శుభలేఖ సుధాకర్
ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.
శుభలేఖ సుధాకర్ | |
---|---|
జననం | సూరావఝుల సుధాకర్ 1960 నవంబరు 19 |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | ఎస్.పి.శైలజ |
తల్లిదండ్రులు | ఎస్‌ఎస్ కాంతం, కృష్ణారావు [1] |
శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా, భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[2] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]సుధాకర్ నవంబరు 19, 1960 న ఎస్.ఎస్. కాంతం, కృష్ణారావు దంపతులకు జన్మించాడు. వీరు ముగ్గురు కొడుకులు. సుధాకర్ వీరిలో పెద్దవాడు. రెండో కొడుకు మురళి. మూడో కొడుకు సాగర్. సుధాకర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజ ను పెళ్ళి చేసుకున్నాడు.
సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలు
[మార్చు]- శుభలేఖ (1982)
- రెండుజెళ్ళ సీత (1983)
- మంత్రి గారి వియ్యంకుడు (1983)
నటించిన చిత్రాలు
[మార్చు]తెలుగు
[మార్చు]- సితార (1983)
- జనని జన్మభూమి (1984)
- మొగుడు పెళ్ళాలు (1985)
- స్వాతి (1985)
- ప్రేమించు పెళ్ళాడు (1985)
- లేడీస్ టైలర్ (1985)
- అన్వేషణ (1986)
- సిరివెన్నెల (1986)
- ముద్దుల మనవరాలు (1986)
- గౌతమి (1987)
- గుండమ్మగారి కృష్ణులు (1987)
- భలే మొగుడు (1987)
- అహ! నా పెళ్ళంట ! (1987)
- బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989)
- చెవిలో పువ్వు (1990)
- ఆదిత్య 369 (1991)
- నిర్ణయం (1991)
- పెళ్ళి పుస్తకం (1991)
- బృందావనం (1992 సినిమా)
- చిత్రం భళారే విచిత్రం (1992)
- 420 (1992)
- మేడమ్ (1993)
- జీవనవేదం (1993)
- ష్ గప్‌చుప్ (1993)
- భైరవద్వీపం (1994)
- సిసింద్రీ (1995)
- పెళ్ళి చేసుకుందాం (1997)[3]
- చిన్నబ్బాయి (1997)[4]
- ఆ నలుగురు
- రక్తచరిత్ర
- ప్రేమా జిందాబాద్
- జీనియస్ (2012)
- ప్రియతమా నీవచట కుశలమా (2013)[5]
- అమర్ అక్బర్ ఆంటోని (2018)
- ఎంత మంచివాడవురా! (2020)[6][7]
- భీష్మ (2020)
- జోహార్ (2020)
- లాయర్ విశ్వనాథ్ (2021)
- నాట్యం (2021)
- రామ్ అసుర్ (2021)
- ఊరెళ్లిపోతా మామ (2022)
- మాచర్ల నియోజకవర్గం (2022)
- అనుకోని ప్రయాణం (2022)
- మసూద (2022)
- హిడింబ (2023)
- భగవంత్ కేసరి (2023)
- బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ (2023)
- రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) (2024)
- గేమ్ ఆన్ (2024)
- యాత్ర 2 (2024)
- చారి 111 (2024)
- భీమా (2024 సినిమా) (2024)
- గేమ్ ఛేంజర్ (2024)
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy. "'శుభలేఖ' సుధాకర్‌కు మాతృవియోగం". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-02. Retrieved 2009-07-29.
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
- ↑ "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
- ↑ The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.