Jump to content

బంధువులొస్తున్నారు జాగ్రత్త

వికీపీడియా నుండి
బంధువులొస్తున్నారు జాగ్రత్త
దర్శకత్వంశరత్
నిర్మాతచలసాని శరత్ బాబు
తారాగణంరాజేంద్రప్రసాద్, రజని
సంగీతంవాసురావు
నిర్మాణ
సంస్థ
సేనా కంబైన్స్
విడుదల తేదీ
1989[1]
భాషతెలుగు

బంధువులొస్తున్నారు జాగ్రత్త శరత్ దర్శకత్వంలో 1989లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను సేన క్రియేషన్స్ పతాకంపై చలసాని శరత్ బాబు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ముఖ్యపాత్రలు పోషించారు.

ఓ బ్యాంకులో పని చేసే చిట్టిబాబుకు నా అన్న వాళ్ళెవరూ ఉండరు. అతని మిత్రుడు సుధాకర్. బంధువులు లేరని చిట్టిబాబు వాపోవడం చూసి తమ ఊర్లో జరిగే ఒక పెళ్ళికి తీసుకెళతాడు సుధాకర్. అక్కడ సీత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు చిట్టిబాబు. సీత తండ్రి సుబ్బారావు బంధువుల సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళ బంధువులు కూడా సుబ్బారావు ఇల్లు గుల్ల చేస్తుంటారు. చిట్టిబాబు పెద్దల్ని ఒప్పించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. మద్రాసులో కాపురం పెడతాడు. బంధువులందరూ మద్రాసు చూసే నెపంతో చిట్టిబాబు ఇంటిమీద పడతారు. చిట్టిబాబుకు మొదట్లో సంతోషంగానే ఉన్నా తర్వాత బంధువులనందరినీ పోషించడానికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. వాళ్ళ ప్రవర్తన మార్చడానికి స్నేహితుడు సుధాకర్ తో కలిసి నాటకమాడి వారందరికీ కనువిప్పు కలుగజేస్తాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: శరత్

సంగీతం: వాసూరావు

నిర్మాత: చలసాని శరత్ బాబు

నిర్మాణ సంస్థ:సేనా కంబైన్స్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

విడుదల:20:01:1989.

పాటల జాబితా

[మార్చు]
  • మా సిరికి మీహరికి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన: వేటూరి సుందరరామమూర్తి
  • అందాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి
  • ఆ ఆహో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల, రచన: వేటూరి
  • మధుర మదన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి
  • ముందు పక్కా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రచన: వేటూరి
  • బంధువులోస్తున్నారు జాగ్రత్త , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: వేటూరి

మూలాలు

[మార్చు]
  1. "Movie Page on Cineratham". Archived from the original on 2019-08-26. Retrieved 2019-08-26.