ష్ గప్‌చుప్
స్వరూపం
| ష్ గప్‌చుప్ (1994 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జంధ్యాల |
|---|---|
| తారాగణం | వరుణ్ కుమార్, బ్రహ్మానందం, రాళ్ళపల్లి , భానుప్రియ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | ప్రగతి చిత్ర |
| భాష | తెలుగు |
ష్ గప్ చుప్ 1994లో విడుదలైన తెలుగు సినిమా. ప్రగతి చిత్ర మూవీస్ పతాకంపై శివప్రతాప్ నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ చిత్రంలో వరుణ్ రాజ్, భానుప్రియ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- వరుణ్ రాజ్
- భానుప్రియ
- కన్నెగంటి బ్రహ్మానందం
- కోట శ్రీనివాసరావు
- బాబు మోహన్
- శుభలేఖ సుధాకర్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సుత్తివేలు
- శ్రీలక్ష్మీ
- రాళ్ళపల్లి నరసింహరావు
- ఏ.వి.ఎస్
- గుండు హనుమంతరావు
- అనూష
సాంకేతిక వర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: జంధ్యాల
- చిత్రానువాదo: జంధ్యాల, మల్లాది
- కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
- సంగీతం: రాజ్ కోటి
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, కె. ఎస్.చిత్ర
- కెమెరా: ఎం.వి.రఘు
- ఎడిటింగ్: గౌతంరాజు
- నృత్యం: కళ, శివ సుబ్రహ్మణ్యం
- కో డైరెక్టర్: శాస్త్రి
- నిర్మాతలు: శివ, ప్రతాప్
- నిర్మాణ సంస్థ: ప్రగతి చిత్ర మూవీస్
- విడుదల:1994.
పాటల జాబితా
[మార్చు]- కుహు కుహు మన్నది కోకిలేందుకో తహతహ లాడేను, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్. చిత్ర
- తెలుగందాలే నను తొంగి తొంగి చూసేనమ్మా తొలకరిగా, రచన: వేటూరి,గానం. కె .ఎస్. చిత్ర, ఎస్ . పి.బాలసుబ్రహ్మణ్యం
- ఓ బాబయ్యో ఓ బాబయ్యో లోకాన రైలు బండి చిక్ చిక్ అంటుంది, రచన: వేటూరి, గానం.ఎస్ . పి .బాలసుబ్రహ్మణ్యం
- ఒరే పాపి మహాపాపి నిన్ను చూడంగనే వచ్చు బి.పి, రచన: జొన్నవిత్తుల, గానం.ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం, ఎస్ .పి .శైలజ.
మూలాలు
[మార్చు]- ↑ "Shh Gup Chup (1994)". Indiancine.ma. Retrieved 2025-08-19.