ప్రేమించు పెళ్ళాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమించు పెళ్ళాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం రామోజీరావు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
భానుప్రియ ,
తులసి
సంగీతం ఇళయరాజా
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం ఎం.వి. రఘు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

ప్రేమించు పెళ్ళాడు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా వంశీ దర్శకత్వం వహించిన 1985 నాటి హాస్య కథాచిత్రం. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు. గణేష్ పాత్రో మాటలు, వేటూరి పాటలు వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

ప్రేమించు పెళ్ళాడు సినిమాకు గణేష్ పాత్రో మాటలు రాశారు.[1]

నటీనటుల ఎంపిక

[మార్చు]

అప్పటివరకూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు కథానాయకుల్లో ఒకరిగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతో కథానాయకుడు అయ్యారు.[2]

సంగీతం

[మార్చు]

సినిమాకు సంగీత దర్శకత్వం ఇళయరాజా వహించారు. అన్ని పాటలూ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు.[3] సినిమాలోని పాటలు విపరీతంగా జనాదరణ పొందాయి. రియాలిటీ షోలు, సంగీత కార్యక్రమాలు వంటివాటిలో సినిమా విడుదలైన 30 సంవత్సరాలకు కూడా "వయ్యారి గోదారమ్మా", "నిరంతరమూ వసంతములే", "ఈ చైత్రవీణ", "గోపెమ్మ చేతిలో గోరుముద్ద" వంటి పాటలు వినిపిస్తున్నాయి. సినిమాలోని పాటలు క్లాసిక్ కల్ట్ స్థాయి సాధించుకున్నాయి.

1: వయ్యారి గోదారమ్మ , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

2: నిరంతరము వసంతములే , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి

3: ఈ చైత్రవీణ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి

4: గోపెమ్మ చేతిలో గోరుముద్ద , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి

5: ఆడే పాడే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ పి శైలజ

6: లేడి వేట లేడి వేట లేడి వేట ఇది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు

[మార్చు]
  1. చెన్నై, ప్రతినిధి. "ప్రముఖ సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత". ఆంధ్రజ్యోతి. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 19 September 2015.
  2. కత్తి, మహేష్ కుమార్. "జోకర్ గాడి ఫ్యాన్..!". నవతరంగం. Archived from the original on 26 సెప్టెంబరు 2015. Retrieved 19 September 2015.
  3. వంశీ. "ఆయనతో కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు". వేటూరి. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 19 September 2015.