వంశీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వంశీ
Vamsi.jpg
జననం నల్లమిల్లి భామిరెడ్డి
(1956-11-20) 20 నవంబరు 1956 (వయస్సు: 59  సంవత్సరాలు)
పసలపూడి
వృత్తి దర్శకుడు
రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత
సంగీతదర్శకుడు
మతం హిందూ

వంశీ తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి .ఈయన సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి.

బాల్యం[మార్చు]

వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబర్ 20 న పుట్టి అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు.

కెరీర్[మార్చు]

తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

1984 లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్ధతులు. గోదావరి పట్ల వంశీకి వున్న ప్రేమ అంతా ఇంతా కానిది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాతో సబంధముండి వుంటుంది.

అవార్డుల సినిమాలు[మార్చు]

వంశీ సినిమాల జాబితా[మార్చు]

 1. మంచు పల్లకి
 2. ఆలాపన
 3. అన్వేషణ
 4. సితార
 5. లేడీస్ టైలర్
 6. ప్రేమించు పెళ్ళాడు
 7. డిటెక్టివ్ నారద
 8. లాయర్ సుహాసిని
 9. మహర్షి
 10. చెట్టు క్రింద ప్లీడర్
 11. స్వర కల్పన
 12. శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
 13. ఏప్రిల్ 1 విడుదల
 14. లింగబాబు లవ్ స్టోరి
 15. జోకర్
 16. ప్రేమ ‍‍& కో
 17. వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్
 18. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
 19. దొంగ రాముడు అండ్ పార్టి
 20. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను
 21. అనుమానాస్పదం
 22. గోపి గోపిక గోదావరి
 23. సరదాగా కాసేపు
 24. తను మొన్నే వెళ్లిపోయింది (2013)

రచనలు[మార్చు]

ప్రభావాలు[మార్చు]

వంశీపై తెలుగు, తమిళ సినీదర్శకులు, సాంకేతిక నిపుణులు బాపు, భారతీరాజా, విశ్వనాథ్, బాలచందర్, పుట్టణ్ణకణగాళ్, ఇళయరాజాల ప్రభావం ఉంది. తాను దర్శకుణ్ణి కావడానికి వీరి ప్రభావమే కారణమని, వీరు తనకు గురువులని పేర్కొంటారు.[1] ఆయన మిస్టరీ సినిమాలపై సుప్రసిద్ధ ఆంగ్ల దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్‌గా పేరుపొందిన ఆల్‍ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రభావం ఉంది.

మూలాలు[మార్చు]

 1. వంశీ (1 march 2015). "వంశీ ఇళయరాజా". సాక్షి ఫన్‌డే. Retrieved 4 March 2015.  Check date values in: |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=వంశీ&oldid=1780703" నుండి వెలికితీశారు