మంచుపల్లకీ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచు పల్లకీ
దర్శకత్వంవంశీ
రచనయండమూరి వీరేంద్రనాధ్ (మాటలు)
స్క్రీన్ ప్లేవంశీ
కథరాజశేఖర్
నిర్మాతఎం. ఆర్. ప్రసాదరావు
తారాగణంసుహాసిని
చిరంజీవి
రాజేంద్ర ప్రసాద్
నారాయణరావు
సాయిచంద్
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఅనిల్ దత్తాత్రేయ
సంగీతంరాజన్ - నాగేంద్ర
నిర్మాణ
సంస్థలు
గోదావరి చిత్ర, అనీల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1982 నవంబరు 19 (1982-11-19)
సినిమా నిడివి
132 ని.
భాషతెలుగు

మంచుపల్లకీ 1982 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో సుహాసిని, చిరంజీవి, నారాయణరావు, రాజేంద్రప్రసాద్, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎం. ఆర్. ప్రసాదరావు గోదావరి చిత్ర పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రం తమిళ చిత్రం పాలైవన సోలై కి పునర్నిర్మాణం. రాజశేఖర్ మూలకథ అందించాడు. యండమూరి వీరేంద్రనాథ్ సంభాషణలు అందించగా దర్శకుడు వంశీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. చిరంజీవితో యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా పనిచేసిన మొట్టమొదటి సినిమా ఇది. రాజన్ - నాగేంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించాడు. వంశీకి దర్శకునిగా, హరి అనుమోలుకు ఛాయాగ్రాహకునిగా మొదటి సినిమా. ఈ సినిమా తరువాత చిరంజీవి-సుహాసిని కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. (మగమహారాజు, ఛాలెంజ్, కిరాతకుడు, రాక్షసుడు, ఆరాధన, మంచి దొంగ, మరణ మృదంగం).

కథ[మార్చు]

సినిమా కథ ఐదుగురు మిత్రుల (చిరంజీవి, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, గిరీష్)చుట్టూ తిరుగుంది. ఈ ఐదుగురూ నిరుద్యోగులు. వీరు ఉంటున్న వీధిలోకి కొత్తగా వస్తుంది గీత. ఆమె మంచితనాన్ని చూసి శేఖర్ ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. సుహాసిని ఈ ఐదుగురు మిత్రులను విజయం సాధించేలా ప్రోత్సహిస్తుంది. సుహాసినిని వివాహం చేసుకోవాలనుకొన్న శేఖర్ ఆమెకు క్యాన్సర్ అనీ, ఎంతోకాలం బతకదనీ తెలుసుకొంటాడు. ఒక వైపు వరకట్నం సమస్యతో నారాయణ రావు చెల్లెలు పెళ్ళి చెడిపోతుంది. చివరకు గీత కోరిక మేరకు శేఖర్ మిత్రుడు వాసు చెల్లెల్ని వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర స్వరాలు అందించారు. వేటూరి, శ్రీశ్రీ, గోపి పాటలు రాశారు. బాలు, జానకి పాటలు పాడారు.

  • మనిషే మణిదీపం, మనసే నవనీతం - బాలు - వేటూరి
  • విష్‌యూ హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్
  • మేఘమా దేహమా ఉరమకే ఈ క్షణం - జానకి - వేటూరి
  • పగలు రేయిలో జారకముందే, వెలుగు చీకటిగా మారకముందే కలుసుకుంటాం[1] - బాలు - శ్రీశ్రీ
  • నే కోసమే మేమందరం - బాలు, జానకి - గోపి

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు, మూలాలు[మార్చు]

  1. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.