మరణ మృదంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరణ మృదంగం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం ఏ.కోదండరామి రెడ్డి
తారాగణం చిరంజీవి,
సుహాసిని ,
రాధ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

మరణ మృదంగం 1988 లో విడుదలైన యాక్షన్ క్రైమ్ చిత్రం, దీనిని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మించాడు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు. చిరంజీవి, రాధ, సుహాసిని, K. నాగబాబు ముఖ్య పాత్రధారులు. ఇళయరాజా సంగీత దర్శకుడు.[1] యండమూరి వీరేంద్రనాథ్ రాసిన మరణ మృదంగం నవల ఆధారంగా ఈ సినిమా తీసారు.

విశేషాలు[మార్చు]

కథ[మార్చు]

జానీ (చిరంజీవి) తన భాగస్వామి భిల్లు (నాగేంద్ర బాబు) తో కలిసి చిన్నపాటి క్యాసినో నడుపుతూంటాడు. ఒక రోజు అతను అనూష (రాధ), ఉత్పాల (సుహాసిని) అనే ఇద్దరు మహిళల కారు చెడిపోతే వారికి లిఫ్టు ఇచ్చి సహాయం చేస్తాడు. జానీ ఇచ్చిన సమాధానాన్ని గుర్తుంచుకుని ఇంటర్వ్యూలో చెప్పి, ఉత్పల ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం పొందుతుంది. జానీ, అతని భాగస్వామి కూడా అనూషకు పోటీదారుని అడ్డుకుని ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేస్తారు.

ఒక రోజు, భిల్లు తన వంటగదిలోని గుడ్డులో కొకైన్‌ను కనుగొంటాడు. వారు ఈ దానికి మూలాన్ని పరిశోధించడం ప్రారంభిస్తారు. ఇది పొగాకు సుబ్బారావు (గొల్లపూడి) స్టోరు నుండి వచ్చినట్లు తెలుసుకుంటారు. ఒక మామూలు వ్యాపారవేత్త అయిన పొగాకు సుబ్బారావుకూ అండర్ వరల్డ్ డాన్, వసంత దాదా (సురేష్ ఒబెరాయ్) కూ మధ్య ఉన్న సంబంధాలు వీరి పరిశోధనలో బయట పడతాయి వారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇస్తారు. వారి శరీర భాగాలను విక్రయిస్తారు. ఉత్పల నిరుద్యోగ సోదరుడు శర్మ (ప్రసాద్ బాబు) వారి ఉచ్చులో చిక్కుకుని ఇల్లు వదలి వెళ్లిపోతాడు. తన సోదరుడితో మాట్లాడటం కోసం ఉత్పల జానీ సాయం కోరుతుంది. ఆమె సోదరుడిని సంప్రదించడానికి ఇచ్చిన ఫోన్ నంబరు అదే నగరంలో ఉందని తెలుసుకున్న జానీ, దీనిపై అన్వేషించడం ప్రారంభించాడు. ఇంతలో, అనూష వారి చీకటి వ్యాపారాల గురించి పొగాకు సుబ్బారావు పైన, అతని మేనల్లుడు సుధాకర్‌పైనా ఫిర్యాదు చేస్తుంది.

సురేష్ ఒబెరాయ్ చెంచా అయిన సలీమ్ (రంజీత్) పోలీసుగా మారువేషంలో వెళ్ళి అనుషను తనతో విచారణ కోసం రమ్మని అడుగుతాడు. అతడు అత్యాచారానికి ప్రయత్నించినప్పుడు, జానీ ఆమెను రక్షిస్తాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. వసంత దాదా రాజ్యాన్ని అన్వేషించడం ప్రారంభిస్తారు. శర్మ వసంత దాదా స్థావరం నుండి తప్పించుకుని, వారి అధోలోకం లోని కార్యకలాపాలను వివరిస్తూ ఉత్పలకు ఒక లేఖను వదిలివేసినట్లు వారు తెలుసుకుంటారు. అధోలోకానికి ఏకైక సాక్షి అయిన శర్మను ఆసుపత్రిలో సలీం హత్య చేస్తాడు. జానీ, అనూష వసంత దాదాపై దాడి చేస్తారు. దాదా మనుషులు వారిని బంధించి, రాబందులకు ఎరగా ఎడారిలో వదిలివేస్తారు. పోగాకు సుబ్బారావు చేతి లోంచి జారిపడిన భూతద్దాన్ని ఉపయోగించి, వారు తమ బంధనాలు విడిపించుకుని, వసంత దాదాపై దాడి చేస్తారు.

చివరి ఘర్షణలో జానీ, భిల్లులు మొత్తం వసంత దాదా విషవృక్షాన్ని కూకటి వేళ్ళతో పకలిస్తారు. జానీ అనూషను వివాహం చేసుకుంటాడు.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • "గొడవే గొడవమ్మ": ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర
  • "జుంగిలి జిమా": ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దుర్గ
  • "కరిగిపోయాను కర్పూరవీణలా": ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  • "కొట్టండి తిట్టండి": ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర
  • "సరిగమ పదనిస": ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర
  1. "మరణ మృదంగం (1988) | మరణ మృదంగం Movie | మరణ మృదంగం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-07. Retrieved 2020-08-07.

ఇవి కూడా చూడండి[మార్చు]

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

మూలాలు[మార్చు]