బేతా సుధాకర్
ఇది తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాతగా పేరుగాంచిన బేతా సుధాకర్ వ్యాసం, ఇతర వ్యాసాల కొరకు సుధాకర్ చూడండి.
సుధాకర్ బేతా | |
![]() సుధాకర్ (బుసాని పృథ్వీరాజ్ రేఖాచిత్రం) | |
జన్మ నామం | సుధాకర్ బేతా |
జననం | |
ప్రముఖ పాత్రలు | యముడికి మొగుడు శుభాకాంక్షలు స్నేహితులు |
సుధాకర్ ప్రముఖ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. ఇతడు ప్రధాన నటుడిగాను,హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.
విషయ సూచిక
జీవిత విశేషాలు[మార్చు]
సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. ఏలూరు లో, మరియు గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.
నట ప్రస్థానం[మార్చు]
ఆయన ప్రముఖ నటుడు చిరంజీవి, హరిప్రసాద్ మరియు నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నారు.[1] ఆయన ఒకసారి అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకరును కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది. దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి రాధికతో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.
తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ఊరికిచ్చిన మాట, భోగి మంటలు.
అనారోగ్యం[మార్చు]
ఆయన 2010 జూన్ 29 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ జూలై 4 2010 నుండి కోమాలో చేరినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు[2]. [3] కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు.[4] ఆయన 2015 జూన్ 8 న తన జీవిత విశేషాలను, తదుపరి చిత్రాలలో నటన గురించి ఇన్.టి.వికి ఇంటర్వ్యూ యిచ్చారు.[5][6]
పురస్కారాలు[మార్చు]
- శుభాకాంక్షలు సినిమాకు గాను నంది పురస్కారము వచ్చింది.
- స్నేహితులు సినిమాకు మరొక నంది నంది పురస్కారము వచ్చింది.
నిర్మాతగా[మార్చు]
సుధాకర్ మూడు చిత్రాలు నిర్మించాడు. అవి
ఇతర విశేషాలు[మార్చు]
- సుధాకర్ ప్రముఖ నటుడు చిరంజీవికి మిత్రుడు.చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ వీరిద్దరికీ పరిచయం.[7]
- ఇతడు చిరంజీవి కలసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణ మూర్తితో కలసి నిర్మించారు.
పేరు పడ్డ సంభాషణలు[మార్చు]
- పితుహు (యముడికి మొగుడు)
- బిళ్ళలు తిప్పుతున్నావా కిట్టూ (అల్లరి ప్రేమికుడు)
నటించిన సినిమాలు[మార్చు]
సుధాకర్ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా.[8]
- అగ్నిప్రవేశం
- అజేయుడు
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
- అల్లరి పిడుగు
- అల్లరి ప్రేమికుడు
- ఆశయం
- ఆహ్వానం
- ఇద్దరు మిత్రులు (చిరంజీవి)
- ఎంత బావుందో!
- గోకులంలో సీత
- గోల్మాల్ గోవింద
- చిన్నా (2001)
- దోషి
- పచ్చని సంసారం
- పెద్దరికం
- పెళ్ళికానుక
- పోస్ట్ మాన్
- పూల్స్
- ఫ్యామిలీ సర్కస్
- భార్గవ్
- మా ఇంటి మహరాజు
- ముగ్గురు మొనగాళ్ళు (చిరంజీవి)
- మెకానిక్ అల్లుడు
- రాజా
- యముడికి మొగుడు
- యమజాతకుడు
- లిటిల్ సోల్జర్స్
- శుభాకాంక్షలు
- శుభమస్తు
- సంక్రాంతి
- సుస్వాగతం
- సూర్యవంశం
- హిట్లర్
- పుట్టింటికి రా చెల్లి (2004)
మూలాలు[మార్చు]
- ↑ తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నాడు: సుధాకర్
- ↑ Home >> Cinema >> Comedian Sudhakar whereabouts please….!! హన్స్ ఇండియా లో ఆర్టికల్.January 10,2014, 01.03 PM
- ↑ కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ (వెబ్ దునియా 5 జులై 2010), పరిశీలన తేది:13 జనవరి2014
- ↑ 'Pichakottudu' Sudhakar Set For Second Innings
- ↑ జూన్ 8, 2015 లో సుధాకర్ ఇంటర్వ్యూ
- ↑ ఇంటర్వ్యూ -ఎన్.టి.వి లో
- ↑ Actor Comedian Sudhakar Health Condition?
- ↑ Celebs Sudhakar Profile & Biography - Latest News,Videos,Galleries,Tweets and More
బయటి లింకులు[మార్చు]
- Comedian Sudhakar Special Interview | Weekend Special | Part 1 | NTV- ఇంటర్వ్యూ
- టాలీవుడ్ టైమ్స్ లో సుధాకర్ బేతా వివరము
- సివీఆర్ న్యూస్ ఛానల్ తో సుధాకర్ ముఖాముఖి
- Flashback - Past life of Chiranjeevi, Betha Sudhakar & Hari Prasad | ABN News
- No-1 Comedy Actor, His Life in Tragedy - Sudhakar - Health Condition Critical-యూట్యూబ్ లో బయోగ్రఫీ