అసాధ్యులు
అసాధ్యులు | |
---|---|
దర్శకత్వం | జోమోన్ |
రచన | సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | జోమోన్ |
కథ | కొడాలి |
దీనిపై ఆధారితం | డ్రీమ్ టీమ్ (1989) |
నిర్మాత | కె.వి. రావు సి. కళ్యాణ్ (సమర్పణ) |
తారాగణం | జగపతిబాబు సురేష్ శోభన నిరోషా |
ఛాయాగ్రహణం | జయరాం |
కూర్పు | హరి హర పుత్రన్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | నియో ఆర్ట్ క్రియేషన్స్[1] |
విడుదల తేదీ | 1992 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అసాధ్యులు అనేది 1992లో విడుదలైన తెలుగు సినిమా. నియో ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కెవి రావు నిర్మించిన ఈ సినిమాకు జోమోన్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, సురేష్, శోభన, నిరోషా నటించగా ఇళయరాజా సంగీతం అందించారు. డ్రీమ్ టీమ్ (1989) అనే ఆంగ్ల సినిమా నుండి ప్రేరణతో ఈ సినిమా రూపొందింది.
కథా సారాంశం
[మార్చు]శ్రీధర్, ఆనంద్, డా. ప్రతాప్, వినోద్ మానసిక రోగులు. ప్రతి ఒక్కరికి వారి జీవితాన్ని కలిగి ఉన్న మానసిక వైద్య కేంద్రం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. డాక్టర్ వైజయంతి కొత్తగా నియమితులైన వైద్యురాలు ఆ నలుగురికి మంచి స్నేహితురాలు అవుతుంది. ఒకసారి, వైజయంతి తన హామీపై వారిని విహారయాత్రకు తీసుకువెళుతుంది. వారి తిరుగు ప్రయాణంలో, వైజయంతి ఒక ఎమ్మెల్యే చిదంబరం, అతని కుమారుడు జగపతి వారి అక్రమ కార్యకలాపాల రహస్యాల డైరీని కలిగి ఉన్న సీబీఐ అధికారిని చంపడం వైజయంతి చూస్తుంది. దురదృష్టవశాత్తు, డైరీ వైజయంతి చేతికి వెళుతుంది, ఇప్పుడు వారు ఆమెను కూడా చంపడానికి ప్రయత్నిస్తుడంగా ఆ నలుగురు పిచ్చివాళ్ళు తమ డాక్టర్‌ని ఎలా కాపాడుకున్నారు అనేది మిగతా కథ.
తారాగణం
[మార్చు]- జగపతి బాబు (శ్రీధర్)
- సురేష్ (ఆనంద్)
- శోభన (జ్యోతి)
- నిరోషా (డాక్టర్ వైజయంతి)
- రఘువరన్ (డా. ప్రతాప్)
- సుధాకర్ (వినోద్)
- పుండరీకాక్షయ్య (ఎం.ఎల్.ఏ. చిదంబరం)
- రాజేష్ (జగపతి)
- విద్యాసాగర్ (రాకీ)
- వినోద్ (పోలీస్ ఇన్స్పెక్టర్)
- ప్రసాద్ బాబు (సి.బి.ఐ. అధికారి)
- పి.జె. శర్మ (పోలీస్ ఇన్స్పెక్టర్)
- హేమ సుందర్ (లత మేనమామ)
- శివాజీ రాజా (సూరిబాబు)
- చిట్టిబాబు (రాజా)
- కిన్నెర (లత)
- పి.ఆర్. వరలక్ష్మి (జ్యోతి తల్లి)
- డబ్బింగ్ జానకి (ప్రతాప్ సోదరి)
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పాట పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "చిటికేసి చప్పున ఆడు" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:06 |
2 | "అరె ఏమైందో లోలోనా" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 5:34 |
3 | "కనపడే దారిలో" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎస్. జానకి | 4:50 |
మూలాలు
[మార్చు]- ↑ "Asadhyulu (Overview)". Youtube.