జోమోన్
స్వరూపం
జోమోన్ | |
---|---|
జననం | జోమోన్ తేకన్ |
వృత్తి | దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1984– ప్రస్తుతం |
జోమోన్ మలయాళ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 1990-2006 మధ్యకాలంలో మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
జననం
[మార్చు]జోమోన్ కేరళలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]1984లో మలయాళ సినిమారంగంలోకి అడుగుపెట్టిన జోమోన్, తొలినాళ్ళలో ఆళ్‌కూట్టతిల్ థానియే, ఉయ్యరంగళిల్, ఆదియోజుక్కుకల్, 1921, దౌత్యం వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
1990లో మమ్ముట్టి హీరోగా వచ్చిన సామ్రాజ్యం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు.[1] ఈ సినిమా విజయవంతమై, ఆ సమయంలో అత్యధిక వసూళ్ళు సాధించిన మలయాళ సినిమాలలో ఒకటిగా నిలవడంతోపాటు,[2] కేరళలో థియేటర్లలో 200కి పైగా రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 400 నుండి 600 రోజులకు పైగా నడిచింది.[3] ఇది ఇప్పటికీ అజేయంగా మిగిలిపోయిన రికార్డు ఇది. ఈ సినిమా అదే పేరుతో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో అనువాదమై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | నటించారు |
---|---|---|---|
1990 | సామ్రాజ్యం | మలయాళం | మమ్ముట్టి, మధు, శ్రీవిద్య |
1991 | అనస్వరం | మలయాళం | మమ్ముట్టి, శ్వేతా మీనన్, ఇన్నోసెంట్ |
1992 | అసాధ్యులు | తెలుగు | జగపతి బాబు |
1993 | జాక్‌పాట్ | మలయాళం | మమ్ముట్టి, గౌతమి, ఐశ్వర్య |
1993 | యాధవం | మలయాళం | సురేష్ గోపి, నరేంద్ర ప్రసాద్, ఖుష్బు |
1995 | కర్మ | మలయాళం | సురేష్ గోపి, రంజిత |
1998 | సిద్ధార్థ | మలయాళం | మమ్ముట్టి, రంభ, శ్రీవిద్య |
2001 | ఉన్నతంగళిల్ | మలయాళం | మనోజ్ కె. జయన్, లాల్, ఇంద్రజ |
2006 | భార్గవచరితం మూనం ఖండం | మలయాళం | మమ్ముట్టి, శ్రీనివాసన్, రెహమాన్, సాయి కుమార్ |
మూలాలు
[మార్చు]- ↑ Prasad, Ayyappa (20 November 1992). "Malayalam films cross boundaries". Indian Express. Madras. p. 7. Retrieved 2023-07-14.
- ↑ Neelima Menon (7 February 2019). "Mammootty's pan-Indian appeal proves he's a bonafide star regardless of how Yatra performs". Firstpost.
- ↑ "10 Mollywood films that ran for the longest time". The Times of India. 31 May 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జోమోన్ పేజీ