ఇంద్రజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంద్రజ
జననంరాజాతి
కేరళ
వృత్తిసినీ నటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు1993-2007, 2014-

ఇంద్రజ తెలుగు, మలయాళ సినిమా నటి.[1] ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.

కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు.[2]

పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.

ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.

పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథకు యాంకరుగా కూడా పనిచేసింది.[3] ఇటీవలి కాలంలో, ఈమె టీవీ సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ టీవి సీరియల్ వల్లిలో నటిస్తుంది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "కృష్ణగారి షూటింగ్‌కు పిలిచి పంపించేశారు!". eenadu.net. మూలం నుండి 13 March 2018 న ఆర్కైవు చేసారు.
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-12-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-04-20. Cite web requires |website= (help)
  3. http://www.hindu.com/fr/2005/09/16/stories/2005091602460800.htm
  4. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంద్రజ&oldid=2878978" నుండి వెలికితీశారు