Jump to content

హ్యాపీ వెడ్డింగ్

వికీపీడియా నుండి
హ్యాపీ వెడ్డింగ్
దర్శకత్వంలక్ష్మణ్ కార్య
రచనలక్ష్మణ్ కార్య
నిర్మాతఎం. సుమంత్ రాజు
తారాగణం
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పుకృష్ణా రెడ్డి
సంగీతంపాటలు:
శక్తికాంత్ కార్తీక్
బ్యాక్గ్రౌండ్ సంగీతం:
ఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
పాకెట్ సినిమా
యువి క్రియేషన్స్
విడుదల తేదీ
జూలై 28, 2018 (2018-07-28)
దేశంఇండియా
భాషతెలుగు

హ్యాపీ వెడ్డింగ్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు.[1] పాకెట్ సినిమా, యూవీ క్రియేషన్స్ పాతాకాలపై నిర్మించారు. 2018 జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

అక్షర ( నిహారిక కొణిదెల ) ఒక డిజైనరు. ఆనంద్ ( సుమంత్ అశ్విన్ ) ఒక ప్రకటన చిత్ర దర్శకుడు. వీళ్ళిద్దరూ ప్రేమిచుకుంటూన్నారు. వారి ప్రేమను వారి తల్లిదండ్రులు ( నరేష్, పవిత్ర లోకేష్, మురళి శర్మ, తులసి ) అంగీకరించారు. వారి వివాహ సన్నాహాలు మొదలయ్యాయి. ఇంతలో, అక్షర మాజీ ప్రియుడు, ఫ్యాషన్ పరిశ్రమలో వ్యాపారవేత్త అయిన విజయ్ (రాజా చంబోలు) వారి సంబంధాన్ని మళ్ళీ మొదలు పెడదామని ఆమెను ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు. కాని అక్షర అతడి ప్రతిపాదనను అంగీకరించదు. అక్షర, ఆనంద్ ల నిశ్చితార్థం తరువాత, కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో, ఆనంద్ అక్షరను కలవలేకపోతాడు. అప్పుడు అక్షర ఆనంద్‌ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. విజయ్ ముందే అతనితో అతడికి తానంటే లెక్క లేనట్లుగా ఉందని, ఈ కారణం వల్లనే తాను విజయ్‌తో విడిపోయానని, ఇప్పుడు ఇతను కూడా అలాగే ఆలోచిస్తున్నాడనీ, అతనికీ విజయ్‌కీ మధ్య తేడా ఏముందనీ ప్రశ్నిస్తుంది. ఇదంతా ఆమె విజయ్ సమక్షం లోనే అడుగుతుంది. తనకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేసుకోవచ్చని ఆనంద్ ఆమెకు చెబుతాడు.

విజయవాడలో ఆనంద్ ఇంట్లో పెళ్ళి పనులు మొదలమవుతాయి. అక్షర యొక్క గందరగోళ మనస్తత్వం కారణంగా రోజు ఆనంద్ ఉద్రిక్తంగా ఉంటాడు. అతను తన నిర్ణయాన్ని తిరిగి తీసుకోవటానికి ఆమెను ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు. తర్వాత అక్షర స్నేహితురాలు లవీనా ( పూజిత పొన్నాడ ) ఆమె అత్త మనస్తత్వవేత్త అయిన నీరజ ( ఇంద్రజ ) ఆమె నిర్ణయం లోని తప్పును ఆమె గ్రహించేలా చేస్తారు. కానీ అక్షర ఇంకా గందరగోళంలోనే ఉంటుంది.

ఆనంద్ అక్షరల పెళ్ళవుతుందా అనేది తరువాతి సినిమా కథ

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "చలువ చెంగలువ"  సిందూరి విశాల్  
2. "కాదని నువ్వంటున్నది"     
3. "ధింతాన తోంతాన"  దినకర్  
4. "ఇట్సె బ్యూటిఫుల్ డే"  ధనుంజయ్  

మూలాలు

[మార్చు]
  1. "హ్యాపి వెడ్డింగ్ (2018) | హ్యాపి వెడ్డింగ్ Movie | హ్యాపి వెడ్డింగ్ Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-23.