నీహారిక కొణిదెల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిహారిక కొణిదెల
Niharika Konidela.png
వృత్తినటి, యాంకర్
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం
తల్లిదండ్రులునాగేంద్రబాబు కొణిదెల
బంధువులుమెగా కుటుంబం

నీహారిక కొణిదెల తెలుగు సినిమా నటి. ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటించింది. జూన్ 2016లో విడుదలైన ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది.

వృత్తి[మార్చు]

ఆమె తెలుగు సినిమాకు తెరంగేట్రం చేసే ముందు టెలివిజన్ లో వ్యాఖ్యాతగా పనిచేసారు.[1][2] ఆమె తెలుగూ టెలివిజన్ ఛానల్ "ఈటీవీ"లో నిర్వహింపబడు తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోలు అయిన ఢీ జూనియర్స్-1, ఢీ జూనియర్స్-2 లకు ఆంకర్ గా పనిచేసింది.[3] ఆమె తెలుగు భాషలో వెలువడిన లఘు చిత్రం "ముద్దపప్పు ఆవకాయ్"లో నటించారు, నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.[4] 2015 సెప్టెంబరు చివరిలో ఆమె ఒక మనసు చిత్రంలో నటించుటకు సంతకం చేసారు.[5] ముద్దపప్పు ఆవకాయ్ లఘు చిత్రంలో ఈ నగరంలో పెరిగిన ఈ తరం అమ్మాయిలా జీన్స్ ప్యాంటులు వేసుకొని చేసిన పాత్రలో నీహారిక ఒదిగిపోయింది. ఒక మనసు లో పక్కింటి అమ్మాయి వలె చుడీదార్లు/చీరలు కట్టి మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలదని నిరూపించుకొన్నది.

సినిమాలు[మార్చు]

నటిగా
సంవత్సరం సినిమా పాత్ర భాష వివరాలు
2016 ముద్దపప్పు ఆవకాయ్ ఆశా తెలుగు లఘుచిత్రం (ఐదు భాగాలు,
నిర్మాత కూడా
2016 ఒక మనసు సంధ్య తెలుగు తెలుగు సినిమా రంగప్రవేశం[6]
2017 నాన్న కూచి తారా తెలుగు వెబ్‌-సిరీస్ నిర్మాత కూడా
2018 ఒరు నల్లనాళ్ పాత్తు సొల్ఱేన్ సౌమ్యా తమిళం తమిళ సినిమా రంగప్రవేశం
2018 హ్యపి వెడ్డింగ్ తెలుగు
2019 సైరా నరసింహారెడ్డి తెలుగు
2019 సూర్యకాంతం తెలుగు

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె తెలుగు సినిమా నటుడు నాగేంద్ర బాబు కుమార్తె.[7]

సాంఘిక మాధ్యమాలు[మార్చు]

ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్ ప్లస్ లలో నీహారిక IamNiharikaK అనే పేరుతో క్రియాశీలకంగా ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Ram Charan keep teasing me about my TV show : Niharika". Times of India. Retrieved 12 June 2014.
  2. "Niharika Konidela: I will act in movies but I need some more time". Times of India. Times News Network. 15 July 2015. Retrieved 15 July 2015.
  3. "NagaBabu's Daughter Niharika has the desire to act in films". tollywoodshow.com. Archived from the original on 2016-02-21. Retrieved 2016-07-09.
  4. "'Muddapappu Avakai' series set to cross 2 million views on YouTube; Chiranjeevi's niece Niharika impresses audience [VIDEOS]"
  5. "Mega debut in Tollywood". deccanchronicle.com.
  6. "Niharika Konidela to make big screen debut". Times of India. Retrieved 24 September 2015.
  7. "My father is my biggest strength : Niharika Konidela". Times of India. Retrieved 19 October 2014.

ఇతర లింకులు[మార్చు]