కొణిదెల నాగేంద్రబాబు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నాగేంద్రబాబు | |
|---|---|
![]() | |
| జననం | నాగేంద్రబాబు కొణిదల 1961 అక్టోబరు 29 |
| జాతీయత | ఇండియన్ |
| ఇతర పేర్లు | నాగబాబు |
| వృత్తి | నటుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1988 - ప్రస్తుతం |
| భాగస్వామి | పద్మజ కొణిదల |
| పిల్లలు | వరుణ్ తేజ్ (కుమారుడు) నీహారిక కొణిదెల (కుమార్తె) |
| తల్లిదండ్రులు | వెంకట్రావ్ కొణిదల అంజనాదేవి కొణిదల |
| బంధువులు | చిరంజీవి (అన్నయ్య) పవన్ కళ్యాణ్ (తమ్ముడు) రేణు దేశాయ్ (పవన్ కళ్యాణ్ భార్య) రాంచరణ్ (అన్న కొడుకు) అల్లు రామలింగయ్య (చిరంజీవి మామ) అల్లు అరవింద్ (చిరంజీవి బావమరిది) అల్లు అర్జున్ (brother's nephew) అల్లు శిరీష్ (brother's nephew) |
కొణిదల నాగేంద్రబాబు (జననం 1961 అక్టోబర్ 29) తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత. ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత.
కుటుంబం
[మార్చు]అక్టోబర్ 29, 1961న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు. నాగేంద్రబాబు సోదరులు చిరంజీవి (సినిమా నటుడు), పవన్ కళ్యాణ్ (సినిమా నటుడు).
సినిమాలు
[మార్చు]నటుడిగా
[మార్చు]- ఒక్కడినే (2013)
- కౌరవుడు
- ప్రేమాభిషేకం
- Hands-up
- మృగరాజు
- అన్నవరం
- అమ్మ చెప్పింది
- మురారి
- అంజి
- సర్కార్ (తెలుగు)
- ఆపదమొక్కులవాడు
- అగ్రిమెంట్
- 420
- కొండవీటి దొంగ
- మరణ మృదంగం
- అందరు దొంగలే
- త్రినేత్రుడు
- అందమైన అబద్ధం
- అల్లరోడు
- 143 (2004)[1][2]
- అంజనీ పుత్రుడు
- మనసు మాటవినదు
- గొడవ
- శ్రీ
- ఒక్కడే
- ఏక్ పోలీస్
- హీరో (2008)
- ఆపరేషన్ దుర్యోధన (2007)
- మా సిరిమల్లి (2007)
- నేటి మహాత్మ (2007)
- మెంటల్ కృష్ణ
- శ్రీ రామదాసు
- గణపతి
- ప్రియురాలు
- రుక్మిణి
- బావగారు బాగున్నారా (in a song)
- ఆటాడిస్తా
- చందమామ
- శ్రీశైలం
- ఆకాశ రామన్న
- ఆరెంజ్ (cameo appearance)
- మిరపకాయ్
- షాక్
- జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా (2009)
- తూనీగ తూనీగ (2012)
- జీనియస్ (2012)
- షాడో (2013 సినిమా) (2013)
- చండీ (2013)
- మాయ
- గలాట (2014)
- రోమియో (2014)[3]
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- జవాన్ (2017)
- మిస్టర్ మజ్ను (2019) (2019)
- ఏదైనా జరగొచ్చు (2019)
- మిషన్ 2020 (2021)
- శ్రీదేవి శోభన్ బాబు (2022)
- రంగ రంగ వైభవంగా (2022)
- పెదకాపు-1 (2023)
- యమధీర (2024)
నిర్మాతగా
[మార్చు]- ఆరెంజ్ (2010)
- స్టాలిన్ (2006)
- రాధా గోపాలం (2006) (associate producer)
- గుడుంబా శంకర్ (2004)
- బావగారూ బాగున్నారా? (1998)
- ముగ్గురు మొనగాళ్లు (1994)
- త్రినేత్రుడు (1988)
- రుద్ర వీణ (1988)
రాజకీయ జీవితం
[మార్చు]నాగేంద్రబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా పోటీచేశాడు.[4] ఎన్నికల ఫలితాలలో వై. ఎస్. ఆర్. సి. పి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి. వి. శివరామరాజు తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. నాగబాబుకు 21.31% ఓట్లు లభించాయి.[5]
ఆయన 2025లో శాసనమండలికి జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుల కోటా నుండి మార్చి 13న తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "143 review". idlebrain. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 May 2019.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. the original నుండి 16 మే 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 May 2019.
- ↑ సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. the original నుండి 22 May 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2019.
- ↑ వేణు, లంక (21 March 2019). "Lok Sabha elections 2019: Pawan Kalyan's brother Nagababu joins Janasena".
- ↑ "Narasapuram 2019 Loksabha Election Results". 23 May 2019.
- ↑ "ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే". Eenadu. 13 March 2025. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.
- ↑ "ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం, ఎన్నికైన ఎమ్మెల్సీల వీరే". Zee News Telugu. 13 March 2025. the original నుండి 14 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 March 2025.
