మిషన్ 2020
మిషన్ 2020 | |
---|---|
దర్శకత్వం |
|
రచన | కరణం బాబ్జి |
నిర్మాత | కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె.వి.ఎస్.ఎస్.ఎల్.రమేష్ రాజు |
తారాగణం | నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్ |
ఛాయాగ్రహణం | వెంకట్ ప్రసాద్ |
కూర్పు | ఎస్ బి ఉద్ధవ్ |
సంగీతం | ర్యాప్ రాక్ షకీల్ |
నిర్మాణ సంస్థ | మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిషన్ 2020 2021లో విడుదలైన తెలుగు సినిమా. హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర అండ్ మై విలేజ్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె.వి.ఎస్.ఎస్.ఎల్.రమేష్ రాజు నిర్మించిన ఈ సినిమాకు కరణం బాబ్జి దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 29న విడుదలైంది.
కథ
[మార్చు]విశాఖపట్నానికి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రకాశ్ అశ్లీల వీడియోల చూస్తూ వాటి వ్యసనానికి బానిసలై ఒకరోజు మత్తులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి తమ స్నేహితురాలైన స్వాతి అనే అమ్మాయిపై అత్యాచారం చేస్తారు. ఈ అత్యాచార కేసును ఏసీపీ జయంత్ (నవీన్ చంద్ర) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ నలుగురు విద్యార్థులను జయంత్ ఎలా కనిపెట్టి పట్టుకున్నాడు? వాళ్లకు ఎలాంటి శిక్ష పడేలా చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర [2]
- నాగ బాబు
- జయ ప్రకాష్
- సత్య ప్రకాష్
- చలాకీ చంటి
- సమీర్
- స్వాతి శర్మ
- షకలక శంకర్ [3]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె.వి.ఎస్.ఎస్.ఎల్.రమేష్ రాజు [4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరణం బాబ్జి
- సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
- సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
- ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్
- పాటలు: శ్రీ రాపాక
- ఆర్ట్ : జె కె మూర్తి
- డాన్స్ : గణేష్
- ఫైట్స్ : సిందూరం సతీష్, స్టంట్ వై రవి
- ప్రొడక్షన్ మేనేజర్ : రామారావు జాడ్డ
- పీఆర్ ఓ : జర్నలిస్ట్ ప్రభు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 October 2021). "'మిషన్ 2020' మూవీ రివ్యూ". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
- ↑ HMTV (13 November 2020). "'మిషన్ 2020' లో.. అల్లుడా బరిలో' మాస్ సాంగ్!". Archived from the original on 13 November 2020. Retrieved 1 November 2021.
- ↑ Andrajyothy (30 October 2021). "'మిషన్ 2020' చిత్రం నేటి సమాజానికి అవసరం: 'దర్జా' టీమ్". Archived from the original on 30 October 2021. Retrieved 1 November 2021.