ఏదైనా జరగొచ్చు (2019 సినిమా)
ఏదైనా జరగొచ్చు 2019, ఆగస్టు 23న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుదర్శన్ హనగోడు నిర్మాణ సారథ్యంలో కె. రామకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాజా, పూజా సోలంకి, బాబీ సింహా, సాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించగా శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించారు.[1] ఈ చిత్రంలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా తొలిసారిగా నటించాడు.[2][3] దర్శకుడు రామకాంత్ చంద్ర శేఖర్ యెలేటికి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. 2018, జూలై 11న ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీరంగ ముఖ్యులు హాజరయ్యారు.[4]
కథా నేపథ్యం
[మార్చు]జై (విజయ్ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ (పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ (బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ.[5]
నటవర్గం
[మార్చు]- విజయ్ రాజా (జై)
- పూజా సోలంకి (శశి)
- బాబీ సింహ(కాశీ)
- సాషా సింగ్ (బేబీ)
- నాగేంద్ర బాబు
- వైవా రాఘవ్
- పృథ్వీరాజ్
- ఝాన్సీ
- అజయ్ ఘోష్
- వెన్నెల కిషోర్ (ప్రత్యేక పాత్ర)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె. రామకాంత్
- నిర్మాత: సుదర్శన్ హనగోడు
- సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల
- సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
- కూర్పు: ఉద్దవ్
- నిర్మాణ సంస్థ: వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శ్రీకాంత్ పెండ్యాల సంగీతం అందించాడు.
- కావాలే - అపర్ణ నందన్
- అనుభవించు - పృథ్వీ చంద్రన్, స్వీకార్ అగస్తి
- అదిగో - గోల్డ్ దేవరాజ్, లిప్సిక
- చెలియా - యాజిన్ నిజార్
విడుదల
[మార్చు]టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 1.5/5 రేటింగ్ ఇచ్చింది, "ఈ చిత్రంలో బలహీనమైన కథ, స్క్రీన్ ప్లే ఉంది" అని రాసింది.[6] న్యూస్ మినిట్ పత్రిక ఈ చిత్రంపై విమర్శ రాసింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "A comic thriller". Deccan Chronicle. 2019-04-12. Retrieved 2020-11-30.
- ↑ India, The Hans (2019-08-08). "Shivaji Raja's son debuts". www.thehansindia.com. Retrieved 2020-11-30.
- ↑ Vyas (2019-04-22). "Edaina Jaragocchu Movie teaser talk". www.thehansindia.com. Retrieved 2020-11-30.
- ↑ "Vijay Raja all set to make his debut with 'Edaina Jaragochu' - Times of India". The Times of India. Retrieved 2020-11-30.
- ↑ Sakshi (23 August 2019). "'ఏదైనా జరగొచ్చు' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
- ↑ "Edaina Jaragochu Movie Review {1.5/5}: Critic Review of Edaina Jaragochu by Times of India". The Times of India.
- ↑ "'Edaina Jaragochu' review: A jarring horror comedy which is neither scary nor funny". The News Minute. 2019-08-23. Retrieved 2020-11-30.