రేణూ దేశాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణూ దేశాయ్
జననం రేణూ దేశాయ్
(1981-12-04) 1981 డిసెంబరు 4 (వయస్సు: 37  సంవత్సరాలు)
పుణె, మహారాష్ట్ర
నివాసం హైదరాబాదు
వృత్తి Model, నటి, Costume Designer
క్రియాశీలక సంవత్సరాలు 2000-2006
జీవిత భాగస్వామి పవన్ కళ్యాణ్
[1]
పిల్లలు అకిరా నందన్ (born 2004)
ఆధ్య (born 2010)

రేణూ దేశాయ్ (జ. డిసెంబరు 4, 1981) ఒక తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్ .[2]. ప్రముఖ తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది.

నేపధ్యము[మార్చు]

రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4 న జన్మించింది. ఆమె మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో చర్చ కు దారితీసింది. పవన్ తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ తోనే ‘జానీ' సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది.

నటి[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర
2000 జేమ్స్ పండు రేణు
2000 బద్రి వెన్నెల
2003 జానీ గీత

కాస్ట్యూం డిజైనర్[మార్చు]

సంవత్సరం చిత్రం
2001 ఖుషి
2003 జానీ
2004 గుడుంబా శంకర్
2005 బాలు
2006 అన్నవరం

[3]

మూలాలు[మార్చు]

బయటి లంకలు[మార్చు]