Jump to content

మాయ (సినిమా)

వికీపీడియా నుండి
మాయ
దర్శకత్వంనీలకంఠ
స్క్రీన్ ప్లేనీలకంఠ
కథనీలకంఠ
నిర్మాతమధుర శ్రీధర్ రెడ్డి, డా. ఎం.వి.కె. రెడ్డి
తారాగణంహర్షవర్ధన్ రాణే, అవంతిక మిశ్రా, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ (నటి)
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పునవీన్ నూలి
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
షిరిడి సాయి కంబైన్స్
పంపిణీదార్లుమల్టిడైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
1 ఆగస్టు 2014 (2014-08-01)
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్2.25 crore (US$2,80,000)
బాక్సాఫీసు6.75 crore (US$8,50,000)


మాయ 2014 ఆగస్టులో విడుదలైన తెలుగు సినిమా. జాతీయ పురస్కార గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, అవంతిక మిశ్రా, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ (నటి) తదితరులు నటించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా (సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్ళి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'.

ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్‌లు ఆకట్టుకుంటాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల ప్రయాణం కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి.

సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది.

కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
  • నిర్మాత: మధుర శ్రీధర్
  • దర్శకుడు: నీలకంఠ
  • కూర్పు - నవీన్ నూలి[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 March 2020. Retrieved 13 March 2020.

బయటి లంకెలు

[మార్చు]