Jump to content

బావగారూ బాగున్నారా?

వికీపీడియా నుండి
(బావగారు బాగున్నారా నుండి దారిమార్పు చెందింది)
బావగారు బాగున్నారా
దర్శకత్వంజయంత్
తారాగణంచిరంజీవి,
రంభ
అచ్యుత్,
రచన,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాస రావు, పరేష్ రావల్, శ్రీహరి
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఏప్రిల్ 9, 1998 (1998-04-09)[1]
భాషతెలుగు

బావగారూ బాగున్నారా 1998లో జయంత్. సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, రంభ ఇందులో ప్రధాన పాత్రధారులు.

న్యూజిల్యాండ్లో రెస్టారెంటుని నిర్వహిస్తున్న రాజుకి, తన చెల్లెలి పేరు పై అనాథాశ్రమం భారతదేశంలో ఉంటుంది. న్యూజిల్యాండ్ లో నే చదువుకొంటున్న స్వప్న (రంభ) తన స్నేహితురాలి ప్రమాదానికి రాజే కారణం అని పొరపడి అతనిని చూడటానికి వెళుతుంది. తర్వాత నిజాన్ని గ్రహించిన స్వప్న, రాజుని ప్రేమించటం మొదలు పెడుతుంది. రాజు భారతదేశానికి వచ్చినప్పుడు గర్భవతి అయిన సంధ్య (రచన) ఆత్మహత్యా ప్రయత్నానికి అడ్డుపడి, తనని రక్షిస్తాడు. ఆ యువతి ప్రేమలో పడి మోసపోయిందని తెలుసుకొన్న రాజు, తన బిడ్డ జన్మించేదాకా ఆవిడ భర్తగా నటిస్తానని, తర్వాత భర్త వదిలేసిన భార్యగా ఆ బిడ్డని తాను పెంచుకోవచ్చని మాటిస్తాడు. ఇద్దరూ కలిసి సంధ్య ఇంటికి వెళతారు. సంధ్య తండ్రి రావు బహద్దూర్ రాజేంద్ర ప్రసాద్ (పరేష్ రావల్) మొదట వారించినా తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడితో వారు ఆ ఇంట్లోనే ఉండేందుకు అనుమతిస్తాడు.

ఇంటికి వచ్చిన స్వప్నకి అక్క భర్త రాజే అని తెలుసుకోవటంతో కథ మలుపు తిరుగుతుంది. తను అమాయకుడిని అని రాజు చేసే ప్రతి ప్రయత్నం స్వప్న వద్ద బెడిసి కొడుతూ ఉంటుంది. ఒక సరసు ఎవరిది అన్న గ్రామ తగాదాలో జోక్యం చేసుకొని, తాను గెలిచి తమ ఊరి పరువుని నిలబెట్టటంతో సంధ్య తండ్రి అల్లుడికి పెళ్ళి చేయాలి అని నిర్ణయించటం, స్వప్నకి నిజానిజాలు తెలియటంతో సంధ్య మరొక మారు ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకొంటుంది.

తన ప్రియుడిని (అచ్యుత్) పొరుగూరి గ్రామ పెద్ద (జయప్రకాష్) తన కూతురితో బలవంత వివాహం చేయించటానికి బంధించాడు అని తెలుసుకొన్న రాజు అతనిని రక్షించటంతో కథలోని చిక్కుముడులన్నీ వీడి కథ సుఖాంతమౌతుంది.

తారాగణం

[మార్చు]
  • రాజు గా చిరంజీవి
  • స్వప్న గా రంభ
  • సంధ్య గా రచన
  • రావు బహద్దూర్ రాజేంద్రప్రసాద్ గా పరేష్ రావల్
  • కోట శ్రీనివాసరావు
  • శ్రీహరి
  • జయప్రకాష్ రెడ్డి
  • బ్రహ్మానందం
  • అచ్యుత్

పాటలు

[మార్చు]
  • చల్నే దో గాడీ, దొరక్కపోదులే జోడీ , రచన: చంద్రబోస్ గానం. మనో
  • నవమి దశమీ తగిన రోజులు , రచన:చంద్రబోస్ , గానం. హరిహరన్, సుజాత
  • సారీ సారీ సారీ అంటుందోయ్ కుమారీ, రచన: చంద్రబోస్, గానం. మనో,సుజాత
  • ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరిందీ , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర
  • మత్తెక్కి తూగే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఫెబి .

విశేషాలు

[మార్చు]
  • చల్నే దో గాడీ పాటలో చిరంజీవి వాస్తవంగా చేసిన 'బంగీ జంప్', చిత్రంలో నాయకుడి పరిచయ సన్నివేశం.[1]
  • ఈ చిత్రంలో క్యాజువల్ వేర్ గా చిరంజీవి వేసే పెద్ద పెద్ద గళ్ళ పైజామాలు బావగారూ బాగున్నారా ప్యాంట్లుగా ఆంధ్ర నాట సంచలనాన్ని సృష్టించాయి.
  • బ్రహ్మానందంతో చిరంజీవి నడిపించే హాస్య సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "చిరు రియల్‌ స్టంట్‌కు 22ఏళ్లు!". www.eenadu.net. Retrieved 2020-04-09.