అంజనా ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజనా ప్రొడక్షన్స్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన1988 (హైదరాబాదు)
స్థాపకుడుచిరంజీవి
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
చిరంజీవి
నాగేంద్ర బాబు
పవన్ కళ్యాణ్
రామ్ చరణ్
ఉత్పత్తులుసినిమాలు
అనుబంధ సంస్థలు

అంజనా ప్రొడక్షన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ నటుడు చిరంజీవి, అతని సోదరుడు నాగేంద్ర బాబు 1988లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు వారి తల్లి అంజనా దేవి పేరు పెట్టారు. తెలుగు సినిమారంగంలోని ముఖ్య నిర్మాణ సంస్థలలో ఒకటైన ఈ అంజనా ప్రొడక్షన్స్, అల్లు-కొణిదెల కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థగా పరిగణించబడుతోంది.[1][2]

సినిమా నిర్మాణం

[మార్చు]

అంజనా ప్రొడక్షన్స్ సంస్థ నుండి మొదటగా 1988లో కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రుద్రవీణ అనే సంగీత ప్రధాన సినిమా రూపొందింది. ఈ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ సమైక్యతా చిత్రం గా నర్గిస్ దత్ అవార్డును గెలుచుకుంది. [3] ఈ సంస్థ, తరువాత త్రినేత్రుడు (1988), ముగ్గురు మొనగాళ్ళు (1994), బావగారూ బాగున్నారా? (1998) వంటి చిత్రాలను నిర్మించింది.[1]

నాగేంద్రబాబు ప్రధాన పాత్రలో కౌరవుడు (2004) సినిమా వచ్చింది. తరువాత, పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ (2004), చిరంజీవితో కలిసి స్టాలిన్ (2006) సినిమాలు తీశారు[1][4]

2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా ఫెయిల్ అవడంతో తనకు తీవ్ర నష్టాలు వచ్చాయిని, ఇకపై సినిమాలు నిర్మించబోనని నాగేంద్రబాబు ప్రకటించాడు.[5][6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు తారాగణం దర్శకుడు
1988 రుద్రవీణ చిరంజీవి, శోభన కె. బాలచందర్
1988 త్రినేత్రుడు చిరంజీవి, భానుప్రియ, నాగేంద్ర బాబు ఎ.కోదండరామిరెడ్డి
1994 ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ కె. రాఘవేంద్రరావు
1998 బావగారూ బాగున్నారా? చిరంజీవి, రంభ, రచన జయంత్ సి పరాన్జీ
2000 కౌరవుడు నాగేంద్ర బాబు, రమ్యకృష్ణ జ్యోతి కుమార్
2004 గుడుంబా శంకర్ పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ వీర శంకర్ బైరిశెట్టి
2005 రాధా గోపాళం శ్రీకాంత్, స్నేహ, బ్రహ్మానందం బాపు
2006 స్టాలిన్ చిరంజీవి, త్రిష, కుష్బూ మురుగ దాస్
2010 ఆరెంజ్ రామ్ చరణ్, జెనీలియా డిసౌజా, షాజాన్ పదమ్సీ భాస్కర్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "నేడు నాగబాబు పుట్టినరోజు" [Today is Nagababu's birthday]. Prajasakti. 29 October 2015. Archived from the original on 26 October 2016. Retrieved 21 January 2021.
  2. Bhargavi (2014-01-02). "Mega banners Geetha Arts, Anjana Productions out of work?". www.thehansindia.com. Retrieved 21 January 2021.
  3. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1998) [1994]. Encyclopedia of Indian Cinema (PDF). Oxford University Press. p. 486. ISBN 0-19-563579-5.
  4. "Archived copy". Archived from the original on 17 June 2012. Retrieved 21 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. kavirayani, suresh (2018-05-02). "I lost my confidence after Orange: Naga Babu". Deccan Chronicle. Retrieved 21 January 2021.
  6. "All's not well between Chiru & brothers - Times of India". The Times of India. Retrieved 21 January 2021.

ఇతర లంకెలు

[మార్చు]