రచన (నటి)
రచనా బెనర్జీ | |
|---|---|
రచనా బెనర్జీ, బెంగాళీ నటి | |
| జననం | 1974 అక్టోబరు 2 కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1994-ప్రస్తుతం |
| భాగస్వామి | సిద్ధాంత్ మహాపాత్ర (2004-5) ప్రొబల్ బాసు (2006-) |
| పిల్లలు | ప్రొణీల్ బాసు |
రచనా బెనర్జీ బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె దక్షిణణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటించింది. ఈమెను నేను ప్రేమిస్తున్నాను అనే సినిమా ద్వారా దర్శకుడు ఇ. వి. వి. సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసాడు. దక్షిణణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. రచన, హిందీ చిత్రం సూర్యవంశ్ లో అమితాబ్ బచ్చన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.
రచన కొల్కతాలో ఆర్.ఎన్.బెనర్జీ, సీమా బెనర్జీ దంపతులకు జన్మించింది.[1] ఈమె ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్ళి చేసుకున్నది. కానీ వీరి వివాహం ఎంతో కాలం నిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచన, 2005లో ప్రొబల్ ని రెండవ వివాహం చేసుకుంది. వీరికి ప్రొణీల్ అనే కొడుకు పుట్టాడు.
1995 నుండి 2002 వరకు[2] రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది. అందులో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించినవే. వ్యక్తిగత జీవితంలో సిద్ధాంత్ మహాపాత్రతో విభేదాలు రావటంతో, అప్పట్లో ఆయన తప్ప మరో హీరో లేని ఒరియా పరిశ్రమను తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి వెళ్ళింది. బెంగాళీ పరిశ్రమలో ఈమె ప్రొసేన్‌జీత్ ఛటర్జీతో నటించిన అనేక సినిమాలు ఘనవిజయం సాధించాయి.
రచనా బుల్లితెరపై జీ బాంగ్లాలో దీదీ నెం.1 అనే గేమ్ షోకు సేతగా పనిచేస్తుంది.[3]
నటించిన చిత్రాలు
[మార్చు]రాజకీయ జీవితం
[మార్చు]రచనా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్‍లోని హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యింది.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Rachana Ragalahari interview". the original నుండి 2016-03-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-07-10.
- ↑ "Tollywood's oomph factor - Kolkata on Wheels". the original నుండి 2013-08-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-07-10.
- ↑ "Rachana Banerjee had invited Bengali celebrities in Didi No. 1 in Zee Bangla". the original నుండి 2012-04-26 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-07-10.
- ↑ Hindustantimes Telugu (10 March 2024). "బెంగాల్‍లో ఎంపీగా పోటీ చేస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్". the original నుండి 10 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2024.
- ↑ "2024 Loksabha Elections Results - Hooghly". Election Commission of India. 4 June 2024. the original నుండి 18 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2025.
- ↑ "Hooghly Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 18 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2025.