భాస్కర్ (దర్శకుడు)
భాస్కర్ | |
---|---|
జననం | భాస్కరన్ నటరాజన్ సెప్టెంబరు 23, 1979 |
ఇతర పేర్లు | బొమ్మరిల్లు భాస్కర్ |
విద్యాసంస్థ | తమిళనాడు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శ్రీవిద్య |
పిల్లలు | హాసిని భాస్కరన్ నయా విభా |
భాస్కర్ (బొమ్మరిల్లు భాస్కర్) తెలుగు సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత, నిర్మాత. 2006లో బొమ్మరిల్లు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]భాస్కర్ 1979, సెప్టెంబరు 23న తమిళనాడులోని వెల్లూరులో జన్మించాడు.[2] చెన్నైలోని తమిళనాడు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ లో సినిమా రంగంలో శిక్షణ పొందాడు.
సినిమారంగం
[మార్చు]తన కెరీర్ ప్రారంభంలో భద్ర, ఆర్య చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2006లో సిద్ధార్థ్ నారాయణ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి నంది ఉత్తమ నూతన దర్శకుడుగా, నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా రెండు నంది అవార్డులు అందుకున్నాడు.[3] 2008లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంకాగా,[4] 2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. 2013లో వచ్చిన ఒంగోలు గిత్త బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[5] ఆర్య, రానా దగ్గుబాటి, సమంత, శ్రీదివ్య, బాబీ సింహా నటించిన తమిళ చిత్రం బెంగళూరు నాట్కల్ 2016లో విడుదలయింది.[6]
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమాపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | 2006 | బొమ్మరిల్లు | తెలుగు | నంది ఉత్తమ నూతన దర్శకుడు నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత |
2 | 2008 | పరుగు | తెలుగు | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు – తెలుగుకి నామినేట్ |
3 | 2010 | ఆరెంజ్ | తెలుగు | |
4 | 2013 | ఒంగోలు గిత్త[7] | తెలుగు | |
5 | 2016 | బెంగళూరు నాట్కల్ | తమిళ | తొలిచిత్రం |
6 | 2020 | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ | తెలుగు |
Collaborations
[మార్చు]నటులు | బొమ్మరిల్లు | పరుగు | ఆరెంజ్ | ఒంగోలు గిత్త | బెంగళూరు నాట్కల్ |
---|---|---|---|---|---|
జెనీలియా | Yes | Yes | |||
సునీల్ | Yes | Yes | |||
జయసుధ | Yes | Yes | |||
ప్రకాష్ రాజ్ | Yes | Yes | Yes | Yes | Yes |
బ్రహ్మానందం | Yes | Yes | |||
చిత్రం శ్రీను | Yes | Yes | |||
ప్రభు | Yes | Yes | |||
ఆలీ | Yes | Yes |
మూలాలు
[మార్చు]- ↑ Rajamani, Radhika. "The man behind Telugu hit Bommarillu". Rediff.com. Retrieved 2007-10-15.
- ↑ Times of India, Movies (5 March 2020). "Bommarillu Bhaskar". timesofindia.indiatimes.com. Archived from the original on 4 June 2020. Retrieved 4 June 2020.
- ↑ "Nandi award winners list 2006 - Telugu cinema, et". Idlebrain.com. Retrieved 4 June 2020.
- ↑ "'Parugu' remake gets mixed response in Bollywood". IndiaGlitz. 24 May 2014. Retrieved 4 June 2020.
- ↑ "ఒంగోలు గిత్త విడుదల తేదీ". FilmGola. January 23, 2013. Archived from the original on 2013-01-26. Retrieved 4 June 2020.
- ↑ "`Bangalore Days` to be remade in Hindi, Tamil and Telugu?". Sify. 1 July 2020. Archived from the original on 1 జూలై 2014. Retrieved 4 June 2020.
- ↑ "Ram to team up with Bommarillu Bhaskar?". Times of India. 20 February 2012. Archived from the original on 3 జనవరి 2013. Retrieved 4 June 2020.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భాస్కర్ పేజీ