Jump to content

బొమ్మరిల్లు (2006 సినిమా)

వికీపీడియా నుండి
బొమ్మరిల్లు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం భాస్కర్
తారాగణం సిద్దార్థ్
జెనీలియా
నేహా బాంబ్
జయసుధ
ప్రకాష్ రాజ్
కోట శ్రీనివాసరావు
తనికెళ్ళ భరణి
సునీల్
సత్య కృష్ణన్
చిత్రం శ్రీను
సంగీతం దేవిశ్రీప్రసాద్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్
భాష తెలుగు

బొమ్మరిల్లు 2006 సంవత్సరంలో విడుదలైన చలనచిత్రం. భాస్కర్ దర్శకత్వం, దిల్ రాజు నిర్వహణలో చిత్రీకరించిన బొమ్మరిల్లులో సిద్ధార్థ్ నారాయణ్ తో జతగా జెనీలియా ప్రథమ పాత్రల్లో నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ లు సిద్ధార్థ్ ధరించిన పాత్రకి తల్లితండ్రులుగా ద్వితీయ పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్స్-ఆఫీసు సఫాలత్వం వల్లనా తమిళంలో సంతోష్ సుబ్రమణ్యం (2008) గా, బెంగాళీలో భలోబస భలోబస (2008)గా, ఒరియాలో డ్రీంగాళ్ (2009) గా రీ-మేక్ చేయబడింది.[1]

ఈ చలనచిత్రం ముఖ్యంగా తండ్రీ కొడుకుల బంధుత్వం గురించి ప్రస్తావించింది. ఇందులో కొడుకు గురించి అతిగా పట్టించుకునే తండ్రి, తండ్రి వైపు ప్రేమ, కోపం మధ్య నలిగే కొడుకు పడే ఘర్షణ ప్రముఖంగా చూపించడం జరిగింది.

అవార్డులు. ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం.

ఉత్తమ సహాయ నటుడు, ప్రకాష్ రాజ్

ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డు, జెనీలియా

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

బొమ్మరిల్లు చిత్ర కథ

[మార్చు]

సిద్ధు వాళ్ళ నాన్న తనకు అవసరమైనవన్ని తన ఇష్ట ప్రకారం చేస్తున్నాను అని అనుకొంటున్నాడు. కాని సిద్ధుకి వాళ్ళ నాన్న చేసే విషయాలేమి నచ్చవు. సిద్ధు వాళ్ళ నాన్న తనకి చెప్పకుండా పెళ్ళి సంబంధం తీసుకొస్తాడు. కాని సిద్ధు హాసిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ విషయం కొన్ని రోజుల తరువాత సిద్ధు వాళ్ళింట్లో తెలుస్తుంది. సిద్ధు వాళ్ళ నాన్నకి ఈ విషయం నచ్చదు. అప్పుడు సిద్ధు హాసిని వారం రోజులు మన ఇంట్లో ఉంటే తను మనకు అనుగుణంగా అనుకూలంగా ఏలా ఉండాలో తెలుసుకుని ఆ విధంగా తాను మారుతుంది అప్పుడు మీ అందరికి సరేనా అని అంటాడు. వారం రోజుల్లో అది సాధ్యమయ్యే పని కాదు అని వాళ్ళ నాన్న అంటాడు. నేను సాధ్యమని నిరూపిస్తాను అని చెప్పి, ఆ అమ్మాయిని సిద్ధు తన ఇంటికి తీసుకొస్తాడు. సిద్ధు హాసినిని తన ఇంటికి తీసుకొచ్చిన తరువాత సిద్ధు వాళ్ళ నాన్నకి సిద్ధు గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు సిద్ధు వాళ్ళ నాన్నకి తన మనస్తత్వాన్ని తండ్రి తన దగ్గర చూపించిన తీరును వివరించి చెప్తాడు. ఆ తరువాత సిద్ధు, హాసిని ఒకటవుతారు.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: భాస్కర్
  • సంగీతం: దేవిశ్రీప్రసాద్
  • రచన: భాస్కర్
  • సంభాషణలు: అబ్బూరి రవి
  • గీత రచయితలు: భాస్కరభట్ల రవికుమార్, చంద్రబోస్, కులశేఖర్, సిరివెన్నెల(చెంబోలు) సీతారామశాస్త్రి, అనంత శ్రీరామ్
  • గాయనీ గాయకులు: గోపికా పూర్ణిమా, రంజిత్, జీన్స్ శ్రీనివాస్, దేవిశ్రీప్రసాద్, నవీన్, మురళి,ప్రియ ప్రకాష్, గంధం సాగర్, సిద్ధార్ద్, ఆండ్రియా జెర్మియా, సుమంగళి
  • ఛాయా గ్రహణం: విజయ్ కె చక్రవర్తి
  • ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
  • నిర్మాత: దిల్ రాజు
  • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర ఫిలింస్
  • విడుదల:09:08:2006.

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: దేవి శ్రీ ప్రసాద్.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వి హావ్ ఎ రోమియో (We Have a Romeo)"చంద్రబోస్, ఆండ్రియా జెర్మియారంజిత్, ఆండ్రియా జెర్మియా5:06
2."బొమ్మని గీస్తే"భాస్కరభట్లగోపిక పూర్ణిమ, జీన్స్ శ్రీనివాస్3:54
3."కానీ ఇప్పుడు"భాస్కరభట్లదేవి శ్రీ ప్రసాద్5:12
4."లాలూ దర్వాజా"కులశేఖర్నవీన్, మురళి, ప్రియ ప్రకాష్4:50
5."నమ్మక తప్పని"సిరివెన్నెల సీతారామశాస్త్రిగంధం సాగర్, సుమంగళి4:30
6."అప్పుడో ఇప్పుడో"అనంత శ్రీరామ్, కులశేఖర్సిద్ధార్థ్4:02
7."బొమ్మరిల్లు (మ్యూజిక్ బిట్)"  1:25
మొత్తం నిడివి:28:19

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (10 August 2021). "Bommarillu Movie | బ్లాక్ బాస్ట‌ర్ 'బొమ్మరిల్లు' కు 15 ఏళ్లు..క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా..?". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  2. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.

బయటి లింకులు

[మార్చు]