ఇందుకూరి సునీల్ వర్మ
సునీల్ | |
---|---|
![]() | |
జననం | ఇందుకూరి సునీల్ వర్మ 1973 ఫిబ్రవరి 28 |
విద్య | ఫైన్ ఆర్ట్స్ |
విద్యాసంస్థ | భీమవరం కళాశాల |
వృత్తి | నటుడు |
పిల్లలు | కుందన |
సునీల్గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు. సుమారు 200 కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. మొదట ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. హాస్యనటుడిగా నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు అతనికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న మంచి ప్రజాదరణ పొందింది.
2003లో నువ్వు నేను, 2006 లో ఆంధ్రుడు చిత్రాలకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది.
బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]
సునీల్ పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించాడు. తండ్రి కేంద్ర తపాలా శాఖా ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసు అప్పుడు తండ్రి మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివర్రులో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత భీమవరం వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ఉండి ఉన్నత పాఠశాలలో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు) వచ్చేవాడు. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.
కుటుంబం[మార్చు]
సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయన భార్య పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. వీరిద్దరికీ ఒక పాప. పేరు కుందన.
సినిమా కెరీర్[మార్చు]
సునీల్ మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రం సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. తన సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు.[1]
సునీల్ హీరోగా[మార్చు]
సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక. ఇందులోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న (సినిమా) కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.[2]
సునీల్ నటించిన చిత్రాలు[మార్చు]
- భీమ్లా నాయక్ - భీమ్లా నాయక్ పాటలో (2022)
- ముఖచిత్రం (2022)
- తీస్ మార్ ఖాన్ (2022)
- అతడు ఆమె ప్రియుడు (2022)
- బుజ్జీ ఇలారా (2022)
- హెడ్స్ అండ్ టేల్స్ (2021)
- కనబడుటలేదు (2021)
- తెలంగాణ దేవుడు (2021)
- కలర్ ఫోటో (2020)
- డిస్కో రాజా (2020) తెలుగు[3][4]
- చాణక్య (2019)[5][6]
- సిల్లీ ఫెలోస్ (2018)[7]
- అమర్ అక్బర్ ఆంటోని (2018)
- ఉంగరాల రాంబాబు (2017)
- 2 కంట్రీస్ (2017)
- ఈడు గోల్డ్ ఎహె (2016)
- జక్కన్న (2016)
- కృష్ణాష్టమి (2016)
- భీమవరం బుల్లోడు (2014)
- తడాఖా (2013)
- మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
- పూలరంగడు (2012)
- శంభో శివ శంభో (2010)
- తిమ్మరాజు (2010)
- ఖలేజా (2010)
- మర్యాద రామన్న (2010)
- ఆ ఒక్కడు (2009)[8][9]
- నువ్వు నాకు నచ్చావు
- నేనున్నాను (2004)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- నువ్వు నేను
- మనసంతా నువ్వే
- బొమ్మరిల్లు
- నువ్వే నువ్వే
- నువ్వు లేక నేను లేను
- నువ్వే కావాలి
- ఠాగూర్
- మల్లీశ్వరి (2004 సినిమా)
- ఉల్లాసంగా ఉత్సాహంగా
- పాపే నా ప్రాణం (2000)
- కలుసుకోవాలని
- హోలీ (2002)
- విజయం (2003)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- నేను పెళ్ళికి రెడీ (2013)
- మాస్
- జై చిరంజీవ
- అతడు
- జల్సా
- రెడీ
- ఢీ
- కింగ్
- వాసు
- అందాల రాముడు
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు
- అరవింద సమేత వీర రాఘవ
పురస్కారాలు[మార్చు]
- స్పెషల్ జ్యూరీ అవార్డు - మర్యాద రామన్న
మూలాలు[మార్చు]
- ↑ "Sunil Not Interested In Comedian Roles Anymore?". Sakshi Post (in ఇంగ్లీష్). 2020-08-07. Retrieved 2021-01-05.
- ↑ Keramalu, Karthik (2020-10-28). "The Rise, Fall And Resurrection Of Telugu Actor Sunil, Who Stars In Colour Photo". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-05.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
- ↑ "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
- ↑ సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.
- ↑ Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 29 May 2020.
- ↑ Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 29 May 2020.[permanent dead link]
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en)
- All articles with dead external links
- Articles with dead external links from July 2020
- Articles with permanently dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా హాస్యనటులు
- నంది ఉత్తమ నటులు
- నంది ఉత్తమ హాస్యనటులు
- పశ్చిమ గోదావరి జిల్లా సినిమా నటులు