పూలరంగడు (2012 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూల రంగడు
(2012 తెలుగు సినిమా)
Poola rangadu poster.jpg
దర్శకత్వం వీరభద్రం
నిర్మాణం ఆర్. ఆర్. వెంకట్
అచ్చి రెడ్డి
కథ వీరభద్రం
తారాగణం సునీల్
ఇషా చావ్లా
ప్రదీప్ రావత్
దేవ్ గిల్
ఆలీ
కోట శ్రీనివాసరావు
సంగీతం అనూప్ రూబెన్స్
సంభాషణలు శ్రీధర్ సీపన
ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెళ్ళ
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఆర్. ఆర్. మూవీ మేకర్స్
మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్
పంపిణీ ఆర్. ఆర్. మూవీ మేకర్స్
నిడివి 150 నిమిషాలు
భాష తెలుగు

పూల రంగడు 2012 లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం. వీరభద్రం రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని మాక్స్ ఇండియా బ్యానర్‌లో నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

కథ[మార్చు]

రంగా ( సునీల్ ) తన కుటుంబ సభ్యులతో సంతోషంగా, సాదాసీదాగా జీవితాన్ని గడుపుతూంటాడు. ఒక రోజు ఇద్దరు వ్యక్తులు రంగాతో కలిసి 30 ఎకరాల భూమిని కొనడానికి ముందుకొస్తారు. రిస్క్ గురించి తెలియని రంగా, ఈ ఆఫర్‌కు అంగీకరిస్తాడు. అతను తన చెల్లెలు పెళ్ళి కోసం ఉంచిన తన ఇంటిని ఈ భూమిని కొనడానికి అమ్మేస్తాడు. అతను కొన్న భూమికి ఇరువైపులా కొండా రెడ్డి (దేవ్ గిల్), లాలా గౌడ్ ( ప్రదీప్ రావత్ ) లకు చెందిన 300 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామంలోని స్థానిక నేరస్థులైన ఈ ఇద్దరూ ఈ భూమిని కొనడానికి ప్రయత్నించిన వారిని చంపేస్తారు. రంగా కొత్తగా కొన్న భూమిని చూద్దామని ఆ గ్రామానికి చేరుకుంటాడు. వ్యాజ్యం కింద ఉన్న భూమిని కొనుగోలు చేయడం ద్వారా తాను మోసపోయానని అతనికి ఇంకా తెలియదు. గ్రామానికి వచ్చిన వెంటనే, అతను తన పాత స్నేహితుడు వాసు ( అలీ ) ను కలుస్తాడు. వాసు రంగాను ఆ స్థలాన్ని విడిచిపెట్టి దాన్ని మరచిపొమ్మని హెచ్చరిస్తాడు. ఆ స్థలం వెంత పొంచి ఉన్న ప్రమాదాన్ని వెల్లడిస్తాడు. అప్పుడు రంగా తన భూమిని అమ్మేసి తన సోదరి వివాహం కోసం డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. లాలా గౌడ్ కుమార్తె అనిత రంగాతో ప్రేమలో పడింది. అయితే, అనిత తనను ప్రేమిస్తోందని రంగాకు తెలియదు.

ఇక్కడ ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో కొండా రెడ్డి తండ్రి వద్ద పనివాడిగా ఉన్న లాలా గౌడ్‌తో కొండా రెడ్డి సోదరి లేచిపోతుంది. ఇప్పుడు కోపంగా ఉన్న కొండా రెడ్డి గౌడ్ కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెను హింసించి, లాలా గౌడ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు. కథ కొనసాగి, చివరికి రంగా కొండా రెడ్డితో పోరాడి అతని ప్రేమను గెలుచుకుంటాడు..

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "పూల రంగడు"  బెన్నీ దయాళ్, నకాష్, శ్రావణ భార్గవి, లిప్సిక 4:04
2. "నువ్వు నాకు కావాలి"  అనూప్ రూబెన్స్, కౌసల్య , రంజిత్ 4:05
3. "ఒక్కడే ఒక్కడే"  రాజా హసన్, నోయెల్; లిప్సిక 4:29
4. "నువ్వే నువ్వేలే"  కార్తిక్, గాయత్రి 4:34
5. "చాక్లెట్"  ఉదిత్ నారాయణ, మీనల్ జైన్ 3:50
6. "ఒక్కడే ఒక్కడే"  రాజా హసన్, లిప్సిక 4:09
25:11


విడుదల[మార్చు]

ఈ చిత్రం 2012 ఫిబ్రవరి 18 న విడుదలై ఏప్రిల్ 7 న 50 రోజులు పూర్తి చేసుకుని రూ 50 కోట్లు వసూలు చేసింది. ఈ విషయమై సినిమా నిర్మాతలు పత్రికా నోట్ విడుదల చేశారు.[1] ఈ చిత్రం 2012 మే 27 న 100 రోజులు పూర్తి చేసుకుంది [2]

మూలాలు[మార్చు]

  1. 'Poola Rangadu' completes 50 days. supergoodmovies.com. URL accessed on 6 April 2012.
  2. Poola Rangadu completes 100 days on May 27. CNN-IBN. URL accessed on 27 May 2012.