సునీల్ (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్
Sunil actor.jpg
జన్మ నామంఇందుకూరి సునీల్ వర్మ
జననం ఫిబ్రవరి 28, 1973 (1973-02-28) 1973 ఫిబ్రవరి 28 (వయస్సు: 46  సంవత్సరాలు)/
ప్రముఖ పాత్రలు నువ్వు నాకు నచ్చావ్,మనసంతా నువ్వే,అందాల రాముడు

సునీల్‌గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడి పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరంలో జన్మించాడు. తండ్రి కేంద్ర తపాలా (Postal Department) శాఖా ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసు అప్పుడు తండ్రి మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది.

చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివర్రులో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత భీమవరం వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ఉండి ఉన్నత పాఠశాలలో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు)వచ్చేవాడు.అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.

ఇతర విశేషాలు[మార్చు]

సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకునిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు. సునీల్ మరియు ప్రఖ్యాత రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరువురూ స్నేహితులు.

కుటుంబం[మార్చు]

సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఆయన భార్య పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. వీరిద్దరికీ ఒక పాప. పేరు కుందన.

సునీల్ హీరోగా[మార్చు]

సునీల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అందాలరాముడు ఇందులో ఆర్తీ అగర్వాల్ కథానాయిక.లోని అన్నిపాటలు ప్రజాదరణ పొందినవి. ఈ చిత్రం విజయవంతంగా నడచి సునీల్ కు మంచి పేరు తెచ్చింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న (సినిమా) కూడా ప్రజాదరణ పొందింది. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు వంటి చిత్రాల్లో నటించారు.

సునీల్ నటించిన చిత్రాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". మూలం నుండి 7 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 June 2019. Cite news requires |newspaper= (help)