Jump to content

మత్తు వదలరా 2

వికీపీడియా నుండి
మత్తు వదలారా 2
దర్శకత్వంరితేశ్ రానా
కథరితేశ్ రానా
నిర్మాత
  • చిరంజీవి (చెర్రీ) పెదమల్లు
  • హేమలత పెదమల్లు
తారాగణం
ఛాయాగ్రహణంసురేష్ సారంగం
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీs
13 September 2024 (2024-09-13)(థియేటర్)
11 October 2024 (2024-10-11)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం

మత్తు వదలారా 2 2024లో విడుదలైన సినిమా. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమాకు రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, సత్య, వెన్నెల కిషోర్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 30న,[1] ట్రైలర్‌ను సెప్టెంబర్ 8న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 13న విడుదలైంది.[1][2]

ఈ సినిమా అక్టోబర్ 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

బాబూ మోహన్ (శ్రీ సింహా), యేసు (సత్య) చేసే డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు ఊడిపోతాయి. దీంతో వారు హై ఎమర్జెన్సీ టీమ్‌లో కిడ్నాప్ కేసుల్ని ఛేదించి, నిందితుల్ని పట్టుకోవడం చేసే ఆఫీస్ లో స్పెషల్ ఏజెంట్స్‌గా జాయిన్ అవుతారు. ఈ క్రమంలోనే వారికి రియా కిడ్నాప్​ కేసు రాగా, అది రూ. 2 కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉంటుంది ఎలాగైనా ఆ కేసును ఛేదించి రూ.2 కోట్లు దక్కించుకోవాలని బాబూ మోహన్​, యేసు అనుకుంటారు. కానీ కిడ్నాప్​ గురైన రియా వీళ్ల కారులోనే శవంగా కనిపిస్తుంది. ఈ ఇద్దరే కిడ్నాప్ చేశారనే రుజువు ఉన్న ఓ వీడియో కూడా బయటకు వస్తుంది. అప్పట్నుంచి వాళ్ళ జీవితమంతా గందరగోళంగా మారిపోతుంది. అసలు రియాను ఎవరు చంపారు ? ఈ కేస్​ నుంచి బాబు మోహన్‌, యేసు అసలు బయట పడ్డారా? లేదా? ఆ తర్వాత ఏం జరిగింది..? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
  • నిర్మాత: చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రితేశ్ రానా
  • సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • సంగీతం: కాల భైరవ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "He టీంకు స్వాగతం.. ఫన్నీగా శ్రీసింహా, సత్య మత్తు వదలరా 2 టీజర్‌". NT News. 30 August 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "He టీంకు స్వాగతం.. ఫన్నీగా శ్రీసింహా, సత్య మత్తు వదలరా 2 టీజర్‌" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 NT News (11 October 2024). "ఓటీటీలోకి వ‌చ్చేసిన 'మ‌త్తు వ‌ద‌ల‌రా 2'". Retrieved 14 October 2024. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "రివ్యూ: మత్తు వదలరా 2.. శ్రీసింహా, సత్యల క్రైమ్‌, కామెడీ సీక్వెల్‌ హిట్టయిందా?". Eenadu. 13 September 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.