నువ్వు నాకు నచ్చావ్

వికీపీడియా నుండి
(నువ్వు నాకు నచ్చావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నువ్వు నాకు నచ్చావ్
దర్శకత్వంకె. విజయ భాస్కర్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతడి.సురేష్ బాబు
తారాగణంవెంకటేష్
ఆర్తీ అగర్వాల్
ఛాయాగ్రహణంకె. రవీంద్ర బాబు
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థలు
శ్రీ స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ (సమర్పణ)
విడుదల తేదీ
సెప్టెంబరు 6, 2001 (2001-09-06)
భాషతెలుగు

నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నాయకా నాయికలుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో సెప్టెంబర్ 6, 2001 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. కోటి స్వరాలు సమకూర్చాడు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో నిర్మించాడు.

వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) అనకాపల్లి నుంచి హైదరాబాద్ లో తన తండ్రి శేఖరం (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి (ప్రకాష్ రాజ్) ఇంటికి వస్తాడు. సంధర్బం, మూర్తి ఏకైక కుమార్తె నందిని ఒక అమెరికా కుర్రాడితో (తనికెళ్ళ భరణి కుటుంబం) నిశ్చితార్థం. వెంకీ వాళ్ళకు నిశ్చితార్థం సాఫీగా జరగడంలో సహాయపడతాడు. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. నందు వెంకీని తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను వదిలి వచ్చేయాలనుకుంటాడు. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్ళిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు.

అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్ళిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్ళిలో మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్ళి అయిపోయిన తరువాత అందరూ కలిసి వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్ళు నందు శీలాన్ని అవమానించి పెళ్ళి పందిరి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

కె. విజయభాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన నువ్వే కావాలి సినిమా ఘన విజయం సాధించడంతో, ఆ సినిమా నిర్మాత స్రవంతి రవికిషోర్ వారితోనే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరో సినిమా చేయాలనుకున్నాడు. అప్పుడే ఈ కథ ప్రస్తావనకు వచ్చింది. మొదట్లో తరుణ్ తో తీస్తే బాగుంటుందేమో అనుకున్నారు. అయికే కథలో హాస్యం, భావోద్వేగాలు పండించాల్సి ఉండటంతో వేరే కథానాయకుడితో చేద్దామని అనుకున్నారు. నిర్మాత సురేష్ బాబు స్రవంతి రవికిషోర్ ని కలిసి వెంకటేష్ డేట్స్ ఖాళీగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు విజయ భాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్ కలిసి వెంకటేష్ కు కథ వినిపించడం, ఆయనకు కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

కథానాయికగా మొదటగా త్రిష, గజాలాను అనుకున్నారు. తర్వాత అప్పటికి హిందీలో ఒక సినిమా చేసిన ఆర్తి అగర్వాల్ ని కథానాయికగా ఎంపిక చేశారు. కథానాయిక తండ్రి పాత్ర కోసం మొదటగా నాజర్ ని అనుకున్నారు. అయితే స్రవంతి రవికిషోర్ పట్టుబట్టి ప్రకాష్ రాజ్ ని ఎన్నుకున్నాడు. ఆ సమయంలో కొంత వివాదంలో చిక్కుకున్న ప్రకాష్ రాజ్ మీద సినిమాల్లో నటించకుండా తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది. కానీ ముందుగా కథానాయిక తండ్రి పాత్ర లేని దృశ్యాలను చిత్రీకరించి తర్వాత, ప్రకాష్ రాజ్ మీద నిషేధం తొలగిపోగానే ఆయనతో సన్నివేశాలు తీశారు. వాటర్ వరల్డ్ లో వచ్చే బ్రహ్మానందం పాత్ర కూడా మొదట్లో లేదు. వెంకటేష్ సలహా మేరకు మిస్టర్ బీన్ స్ఫూర్తితో ఈ పాత్రను చేర్చారు రచయితలు.[1]

విడుదల

[మార్చు]

సెప్టెంబరు 6, 2001 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయాన్ని నమోదు చేసింది. 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.[1]

పాటలు

[మార్చు]

ఈ సినిమా ఆడియో విడుదల అయిన కొద్ది రోజులకే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించింది. నా చూపే నిను వెతికినది అనే పాటను న్యూజీలాండ్ లో చిత్రీకరించారు. నా చూపే నిను వెతికినది అనే పాట శ్రీరాం ప్రభు అనే గాయకుడు మొదటిసారిగా వెంకటేష్ కోసం పాడాడు. అతని గొంతు వెంకటేష్ కి సరిపోతుందో లేదో అని అనుమానం వచ్చి మరో ఉత్తరాది గాయకుడితో కూడా పాడించారు. అయితే చివరికి శ్రీరాం పాడిందే బాగుందని అలాగే ఉంచేశారు.[2]

  1. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి - గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ రచన: సిరివెన్నెల
  2. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా - గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: భువనచంద్ర
  3. ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు - గాయకులు: టిప్పు, హరిణి రచన: సిరివెన్నెల
  4. నా చెలియ పాదాలు... హంసలకే పాఠాలు - గాయకుడు:శంకర్ మహదేవన్ రచన: సిరివెన్నెల
  5. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని - గాయకులు: కుమార్‌సాను, చిత్ర రచన: సిరివెన్నెల
  6. నా చూపే నిను వెతికినది ని వైపె నను తడిమినది - గాయకులు: చిత్ర, శ్రీరాం ప్రభు రచన:సిరివెన్నెల

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Nuvvu Naaku Nachav: 20 వసంతాల క్లాసిక్‌ 'నువ్వు నాకు నచ్చావ్‌' - venkatesh nuvvu naaku nachav classic movie turns 20 years". www.eenadu.net. Retrieved 2021-09-06.
  2. "ఇష్టపది". హాసం ప్రచురణలు.