కె.కె.శర్మ
Jump to navigation
Jump to search
కె. కె. శర్మ | |
---|---|
జననం | కళ్ళేపల్లి శ్రీ వెంకటరామ కామేశ్వర శర్మ బరంపురం |
మరణం | 2017 మే 18 |
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | రైల్వే ఉద్యోగి, నటుడు |
కె.కె.శర్మ తెలుగు సినిమా, రంగస్థల నటుడు. ఏడిద నాగేశ్వరరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, నటులు హరనాథ్, మాడా, వడ్డాది సూర్యనారాయణమూర్తిలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థ తరఫున అనేక నాటకాలలో నటించాడు.
కె.కె.శర్మ పూర్తి పేరు కళ్లేపల్లి శ్రీ వెంకటరామ కామేశ్వర శర్మ. బరంపురంలో జన్మించాడు.[1] నటనపై ఉన్న మక్కువతో రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి, చిత్ర పరిశ్రమకు వచ్చారు. విఠలాచార్య దర్శకత్వంలో డీవీఎస్ రాజు నిర్మించిన గండికోట రహస్యం సినిమాతో సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆయన చివరి చిత్రం హైటెక్ మర్డర్. స్నేహితులతో కలిసి గోల నాగమ్మ చిత్రాన్ని నిర్మించాడు.
కె. కె. శర్మ 2017 మే 18 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు.
సినిమాలు
[మార్చు]ఇతడు నటించిన కొన్ని తెలుగు సినిమాల జాబితా:
- ప్రతీకారం (1969) - తొలి సినిమా
- గండికోట రహస్యం (1969)
- గండర గండడు (1969)
- జరిగిన కథ (1969)
- పసిడి మనసులు (1970)
- మాయని మమత (1970)
- ప్రేమజీవులు (1971)
- మోసగాళ్ళకు మోసగాడు (1971)
- పిల్లా? - పిడుగా? (1972)
- మేమూ మనుషులమే (1973)
- చిరంజీవి రాంబాబు (1978)
- చిలిపి కృష్ణుడు (1978)
- నాయుడుబావ (1978)
- వెంకటేశ్వర వ్రత మహాత్యం (1980)
- దారి తప్పిన మనిషి (1981)
- పటాలం పాండు (1981)
- ప్రేమ మూర్తులు (1982)
- కంచు కాగడా (1984)
- నవమోహిని (1984)
- మయూరి (1985)
- శ్రీవారి శోభనం (1985)
- ఖైదీ రుద్రయ్య (1986)
- కిరాయి దాదా (1987)
- మా ఊరి మగాడు (1987)
- వీరప్రతాప్ (1987)
- అగ్నికెరటాలు (1988)
- మంచి కుటుంబం (1989)
- కొండవీటి దొంగ (1990)
- మగాడు (1990)
- ముద్దుల మేనల్లుడు (1990)
- బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991)
- రౌడీ గారి పెళ్ళాం (1991)
- గౌరమ్మ (1992)
- పోకిరిరాజా (1994)
- స్త్రీ (1995)
- ఆహ్వానం (1997)
- ఉగాది (1997)
- ఏమండీ పెళ్లి చేసుకోండి (1997)
- ఉల్టా పుల్టా (1998)
- పండగ (1998)
- దేవి నాగమ్మ (2002)
- తొలిపరిచయం (2003)
- కుంకుమ (2005)
- సర్దార్ పాపన్న (2006)
- ఉద్రేకం (2008)
మూలాలు
[మార్చు]- ↑ "సీనియర్ నటుడు కేకే శర్మ కన్నుమూత". 19 May 2017. Archived from the original on 24 Jun 2019.