Jump to content

పటాలం పాండు

వికీపీడియా నుండి

పటాలం పాండు తెలుగు చలన చిత్రం1981 ఫిబ్రవరి 13 న విడుదల.ఎస్.డి.లాల్ దర్శకత్వంలో మోహన్ బాబు, సుభాషిణి జంటగా నటించిన ఈ చిత్రానికి మాటలు గొల్లపూడి మారుతీరావు వ్రాయగా,సంగీతం చక్రవర్తి అందించారు.

పటాలం పాండు
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం మోహన్ బాబు ,
సుభాషిణి,
మోహన్
సంగీతం చక్రవర్తి
సంభాషణలు గొల్లపూడి మారుతీరావు
నిర్మాణ సంస్థ రవిచిత్ర ఫిలిమ్స్
భాష తెలుగు

సహజంగా కొంత క్రూరంగా కనిపిస్తూ, లారీడ్రైవర్‌గా పని చేస్తూ, అన్యాయాలను ఎదురిస్తూ, మేనమామకు ఇచ్చిన మాటకు కట్టుబడి మల్లిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు పటాలం పాండు. తాళి కట్టే వరకు మల్లిని తాకబోనని ఆ మాటకు కూడా కట్టుబడి ఉంటాడు పాండు. పాండు మనసు వెన్న. మల్లి చెల్లెలు తులసిని ఎంతో గారాం చేస్తూ ఉంటాడు. ప్రమాదంలో తులసికి చూపు పోతే ఎంతో కుమిలి పోతాడు. ఆమెకు చూపు రావడానికి ఎంతటి దీక్ష పూనడానికైనా వెనుకాడడు. మల్లి ఒక సంపన్నుల ఇంట్లో పనిమనిషిగా ఉంటూ చెల్లెలి చూపు తెప్పించడానికి తాపత్రయపడుతూ ఉంటుంది. శస్త్ర చికిత్సకు సరిపడా డబ్బులేక, సమకూరక సతమతమౌతుంది. పరిస్థితులను అదనుగా తీసుకుని యజమానురాలి కొడుకు సానుభూతి వ్యక్తపరుస్తూ, శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బు ఇస్తానని ఆశచూపి అత్యాచారం చేస్తాడు. అనుకున్న విధంగా డబ్బు సంపాదించలేక తిరిగి వస్తున్న పాండుకు మల్లి జీవితం పాడయిందనే విషయం తెలుస్తుంది. దాంతో ఆవేశం కట్టలు తెగి, రౌద్రరూపం దాలుస్తాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి మల్లి హత్యచేయబడి ఉంటుంది. మల్లిని ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనేది పతాక సన్నివేశం.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఓ చెలి ఓ చెలి అనురాగ మేఘమాల, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

2.కొండా కొనల్లోనా చెట్టు చేమల్లోన, రచన: దాశరథి, గానం.పులపాక సుశీల

3.మల్లెపూల మబ్బేసిందమ్మా పిల్లగాలి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.వస్తావా అమ్మకుట్టి చెక్కెద్దాం, రచన: ఆరుద్ర, గానం.ఎం.రమేష్ , ఎల్.ఆర్.అంజలి .

మూలాలు

[మార్చు]
  1. లక్కరాజు (23 February 1981). "చిత్రసమీక్ష: పటాలం పాండు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 319. Retrieved 6 February 2018.[permanent dead link]

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

[మార్చు]