చిడతల అప్పారావు
చిడతల అప్పారావు | |
---|---|
వృత్తి | నటుడు |
చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించాడు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశాడు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు.
నటజీవితం
[మార్చు]చిడతల అప్పారావు నాటకరంగం నుంచి వచ్చినవాడు. సినిమాల్లో చిన్న చిన్న విషయాలు వేసేవాడు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. ఈయన కూడా అడిగితే ఉన్న వేషాలు కూడా పోతాయి అనే భయంతో కావలసిన పారితోషికం అడిగేవాడు కాదు. ఈయనతో పాటు థం లాంటి మరికొంతమంది చిన్న హాస్యనటులను జంధ్యాల ప్రోత్సహించి అవకాశాలిచ్చాడు.[1] తర్వాత జంధ్యాల శిష్యుడైన ఇ.వి.వి. సత్యనారాయణ కూడా అప్పారావుకు తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.
అప్పారావు పెంకిపిల్ల అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు. వేషాల మీదనే ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ నేర్చుకుని సహాయకుడిగా వెళ్ళేవాడు. దుస్తుల విభాగంలో కూడా పనిచేసేవాడు.
నటించిన చిత్రాలు
[మార్చు]- బొబ్బిలి యుద్ధం (1964)
- అర్ధరాత్రి (1968)
- జ్యోతి (1976)
- వేటగాడు (1979)
- సర్దార్ పాపారాయుడు (1980)
- కొండవీటి సింహం (1981)
- పటాలం పాండు (1981)
- కలియుగ రాముడు (1982)
- ఖైదీ ( 1983)
- ఘరానా అల్లుడు (1984)
- అడవి దొంగ (1985)
- చట్టంతో పోరాటం (1985)
- అపూర్వ సహోదరులు (1986)
- కొండవీటి రాజా (1986)
- జానకి రాముడు (1988)
- మంచి దొంగ (1988)
- మురళీకృష్ణుడు (1988)
- విజయ్ (1989)
- లారీ డ్రైవర్ (1990)
- కిల్లర్ (1991)
- అప్పుల అప్పారావు (1992)
- జంబలకిడిపంబ (1992)
- ప్రెసిడెంటు గారి పెళ్ళాం (1992)
- బృందావనం (1992)
- చిట్టెమ్మ మొగుడు (1992)
- గోల్మాల్ గోవిందం (1992)
- అల్లరి అల్లుడు (1993)
- ఆ ఒక్కటీ అడక్కు (1993)
- ముద్దుల ప్రియుడు (1994)
- ఆలీబాబా అరడజను దొంగలు (1994)
- అసెంబ్లీ రౌడీ (1991)
మూలాలు
[మార్చు]- ↑ "నవ్వులు పంచారు... నమ్ముకుని ఉన్నారు!". సితార. Archived from the original on 2019-11-18. Retrieved 2020-08-06.