అర్ధరాత్రి (సినిమా)
అర్ధరాత్రి (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. సాంబశివరావు |
---|---|
తారాగణం | కొంగర జగ్గయ్య, భారతి |
నిర్మాణ సంస్థ | హైదరాబాద్ మూవీస్ |
భాష | తెలుగు |
ఆరోజుల్లో బీస్‌సాల్‌బాద్, కొహరా వంటి హిందీ చిత్రాలు సక్సెస్ కావటంతో, ఆ తరహా చిత్రాన్ని తెలుగులో ‘అర్ధరాత్రి’గా పి.సాంబశివరావు దర్శకత్వంలో అతని అన్న పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇది పి.సాంబశివరావుకు దర్శకునిగా తొలి సినిమా.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ- ఆరుద్ర
- మాటలు- పాలగుమ్మి పద్మరాజు
- సంగీతం- మాస్టర్ వేణు
- కళ-రాజేంద్రకుమార్
- నృత్యం- చిన్ని, సంపత్
- స్టంట్స్- రాఘవులు అండ్ పార్టీ
- కూర్పు-వీరప్ప
- దర్శకత్వం- పి.సాంబశివరావు
నటీనటులు
[మార్చు]కథ
[మార్చు]ధనవంతుడు, విద్యావంతుడు, గుణవంతుడు అయిన వ్యక్తి శ్రీధర్ (జగ్గయ్య) అతని బంగళాలో 6గురు నౌకర్లు సిద్దయ్య (చదలవాడ), నరసింహం (సీతారాం), ముత్యాలు, పొట్టిప్రసాద్, చిడతల అప్పారావు, మోదుకూరి సత్యం పనిచేస్తుంటారు. ప్రతి రాత్రి ఆ బంగళా ఔట్‌హస్ నుంచి అర్ధరాత్రి ఓ విషాద గీతం వినబడుతుంటుంది. నౌకర్లు, దాన్ని దయ్యాల బంగళా అంటుంటారు. మేనమామ పెరుమాళ్ళు, ఇంట తల్లి, తండ్రి మరణించటంచేత ఆశ్రయం పొందిన సరళ (భారతి) మేనత్త నిర్మల ఆరళ్ళు తట్టుకోలేక ఇల్లువదిలి వెళుతుంది. శ్రీధర్ , కారుక్రింద పడుతుంది. డా.రమేష్ హాస్పిటల్‌లో వైద్యం పొందాక, డాక్టరు సలహాతో ఎవరూ లేని అనాథ అని సరళను తన బంగ్లాకు తీసుకువస్తాడు శ్రీధర్ . పనివాళ్ళను అదుపులోపెట్టి, ఇంటిని చక్కదిద్దటమేకాక శ్రీధర్ అభిమానం, అనురాగం పొందుతుంది సరళ. శ్రీధర్ మేనమామను అని పానకాలరావు (రమణారెడ్డి) అతని కూతురు చిత్ర బావా అంటూ వరసలు కలిపి శ్రీధర్‌ను పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. బంగళాలో ప్రతీ రాత్రి విషాద గీతం వినగానే శ్రీధర్ వెళ్ళి ఔట్‌హౌస్‌లో ఓ స్త్రీతో పెనుగులాడడం, శ్రీధర్ బాధ సరళ గమనిస్తుంటుంది. ఔట్‌హౌస్‌లోకి వెళ్ళబోయిన సరళను ఒకసారి, రౌడీ జగ్గారావు, మరొకసారి శ్రీధర్ అడ్డుకుంటారు. పార్టీలో తాగిన మైకంలో వచ్చిన శ్రీధర్ మంచంను ఒక స్త్రీవచ్చి తగలబెట్టబోగా, సరళ రక్షిస్తుంది. సరళను వివాహం చేసుకుంటానని, నగలు, చీరలు తెచ్చి శ్రీధర్ ఇవ్వగా, ఆ రాత్రి మరోసారి ఒక స్త్రీ వాటిని చింపివేసి, నాశనం చేస్తుంది. చివరకు అన్ని సర్దుకుని సరళ, శ్రీధర్‌లు వివాహం జరగబోతుండగా, కేశవ్ (రావికొండలరావు), పోలీసులతో వచ్చి ఈ పెళ్ళి జరగరాదు, శ్రీధర్, వివాహితుడని, తన చెల్లెలు రాణిని పెళ్ళాడాడని తెలియచేస్తాడు. శ్రీధర్, సరళను ఔట్‌హౌస్‌కి తీసుకువెళ్ళి అందరి సమక్షంలో గతం తెలియచేస్తాడు. కేశవ్ చెల్లెలు, ప్రసాద్ (బాలయ్య)ను ప్రేమించగా, వ్యసనపరుడు దుష్టుడు అయిన కేశవ్ అతన్ని హత్యచేసి, ఆ నేరం శ్రీధర్ తండ్రి ధర్మారావు (నాగయ్య) మీదకు నెట్టి, అతన్ని బంధించి, మోసంతో రాణికి శ్రీధర్‌కు పెళ్ళి జరిపిస్తాడు. ప్రసాద్ మరణంతో పిచ్చిదయిన రాణిని ఔట్‌హౌస్‌లో వుంచి వైద్యం చేయిస్తున్నానని, కేశవ్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, డాక్టరు, కోర్టుఇచ్చిన ఉత్తర్వు ప్రకారం సరళను పెండ్లి చేసుకోబోయానని తెలియచేస్తాడు. పోలీసులు ధర్మారావును అరెస్ట్‌చేయటం, పెళ్ళి ఆగిపోవటం, కేశవ్, తన చెల్లెలు రాణి వున్న ఔట్‌హౌస్‌కి నిప్పుపెట్టడం, ఆ మంటల్లో మతి స్థిమితం వచ్చిన రాణి, ప్రసాద్‌ను తన అన్న చంపాడని నిజంచెప్పి మరణించటం, సరళ, శ్రీధర్‌ల వివాహం, తండ్రి ధర్మారావు సమక్షంలో జరగటంతో చిత్రం సుఖాంతం అవుతుంది.[1]
పాటలు
[మార్చు]- ‘ఎగిరిపోయిన చిలుక ఎచటవాలునో ఎవరికెరుక’ (ఎల్.ఆర్.ఈశ్వరి, అప్పారావు- రచన ఆరుద్ర)
- ‘తిరిగి పోతే రాదు తీయనిమ్మపండు’ (లత బృందం- రచన కొసరాజు)
- ‘కైపెక్కించే కమ్మని రేయి, కనులు కలిపితే కాదనకోయి’’ (ఎస్.జానకి- దాశరథి కృష్ణమాచార్య)
- ‘ఓహో అందమంతా నా సొమ్మే అయినా నేను మాత్రం’(ఎల్.ఆర్.ఈశ్వరి- ఆరుద్ర)
- ‘ఈ పిలుపు నీకోసమే, నా మమత నీకోసమే వేయి జన్మలనుండి’ (పి.సుశీల- రచన ఆరుద్ర)