చదలవాడ కుటుంబరావు
Jump to navigation
Jump to search
చదలవాడ కుటుంబరావు | |
---|---|
జననం | 1940 |
మరణం | 1968 |
ప్రసిద్ధి | తెలుగు సినిమా హాస్య నటులు |
చదలవాడ కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటుడు.
మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో నౌకరు పాత్రలు దరించి పేరుపొందారు. వీరు విజయా సంస్థలో పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు చిత్రాలలో నటించారు. నటనలో వీరి యాస భాష ప్రత్యేకమైన హాస్యనటులుగా నిలబెట్టింది. వ్యక్తిగతంగా వీరు మంచి చమత్కారి. పెద్ద మనుషులు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు సినిమాలలోని వీరి పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రముఖ దర్శకుడు వి.మధుసూధనరావు ఇతని అల్లుడు. వీరు 1968లో పరమపదించారు.
చిత్రసమాహారం
[మార్చు]- తాసీల్దార్ (1944)
- స్వర్గసీమ (1945)
- మన దేశం (1949)... మధు
- పల్లెటూరు (1952)
- పరివర్తన (1954) ... పిచ్చివాడు
- నిరుపేదలు (1954)
- పెద్ద మనుషులు (1954) ... శేషావతారం
- కన్యాశుల్కం (1955) ... పోలిశెట్టి
- సంతానం (1955)
- అర్ధాంగి (1955)
- చరణదాసి (1956)... హనుమంతు
- మాయాబజార్ (1957)... లంబు
- తోడి కోడళ్ళు (1957) ... తిరుపతయ్య
- పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
- అప్పుచేసి పప్పుకూడు (1959)... చెంచయ్య
- జయభేరి (1959)... డప్పుల రాఘవులు
- కృష్ణ లీలలు (1959)
- కులదైవం (1960)
- భార్యాభర్తలు (1961)
- చిట్టి తమ్ముడు (1962)
- పెళ్ళితాంబూలం (1962)
- తిరుపతమ్మ కథ (1963)
- శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)... మంచిబుద్ధి
- నవరాత్రి (1966)
యితర లింకులు
[మార్చు]- చదలవాడ కుటుంబరావు గూర్చి Archived 2013-10-01 at the Wayback Machine