చిట్టి తమ్ముడు
Appearance
చిట్టి తమ్ముడు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. బి. తిలక్ |
---|---|
తారాగణం | కాంతారావు, రాజసులోచన, దేవిక, జగ్గయ్య, సూర్యకాంతం, రాజనాల |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ గోపాల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది 1962లోవిడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రసిద్ధిచెందిన ఆలివర్ ట్విస్ట్ నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. అనాథ శరణాలయాలు, అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు. ఇదే కథతో తమిళంలో జయలలితతో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులోనికి డబ్బింగు అయ్యింది.
నటీనటులు
[మార్చు]- కాంతారావు - శ్రీహరి
- రాజసులోచన
- జగ్గయ్య - రాము
- దేవిక - సుభద్ర
- మాస్టర్ వెంకటరమణ - చిరంజీవి, రాము కొడుకు
- సూర్యకాంతం - తాయారమ్మ, అనాథాశ్రమం వార్డెన్
- రాజనాల
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
- రమణారెడ్డి - లాయర్
- సంధ్య - సీత, రాము అక్కయ్య
- జి. రామకృష్ణ
- రాజబాబు
- చదలవాడ కుటుంబరావు
- బొడ్డపాటి
పాటలు
[మార్చు]- అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి బాధలు పోవాలంటే - ఎస్.జానకి బృందం, రచన :ఆరుద్ర
- ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో ఆపైన సూస్కో - పి.సుశీల, రచన: ఆరుద్ర
- దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు కనిపించడు అదే కదా చిక్కు - పి.సుశీల, రచన:ఆరుద్ర
- నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా నీలో కలిగిన - పి.సుశీల, ఘంటసాల . రచన: ఆరుద్ర.
- మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి కాలం కాదు - పి.సుశీల, రచన: ఆరుద్ర
- మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి మావా చీకట్లో - పి.సుశీల, రచన: ఆరుద్ర
- అయ్యోరామా అయ్యో రామా లంబా రాస్తా,మాధవపెద్ది, స్వర్ణలత, రచన: ఆరుద్ర
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)