సంతానం (1955 సినిమా)
'సంతానం' తెలుగు చలన చిత్రం,1955 ఆగస్టు 5 న విడుదల.సి.వి.రంగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, అమరనాథ్, ఎస్.వి.రంగారావు మొదలగు వారు నటించారు.సంగీతం సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చారు.తెలుగులొ మొట్టమొదటి సారిగా లతా మంగెష్కర్ 'నిదురపోరా తమ్ముడా' పాడిన పాట ఈ చిత్రంలోనిదే.
సంతానం (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.రంగనాథ దాసు |
---|---|
నిర్మాణం | సి.వి.రంగనాథ దాసు |
కథ | సి.వి.రంగనాథ దాసు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అమర్‌నాథ్, సావిత్రి, ఎస్వీ రంగారావు, శ్రీరంజని జూనియర్, రేలంగి వెంకట్రామయ్య |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, లతా మంగేష్కర్ |
గీతరచన | పినిశెట్టి శ్రీరామమూర్తి, అనిశెట్టి సుబ్బారావు |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహమాన్ |
నిర్మాణ సంస్థ | సాధనా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు
అమర్ నాథ్
సావిత్రి
శ్రీరంజని జూనియర్
సామర్ల వెంకట రంగారావు
రేలంగి వెంకట్రామయ్య
చలం
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: సివి.రంగనాథ దాస్
నిర్మాత, కధ: సి.వి.రంగనాథ దాస్
నిర్మాణ సంస్థ: సాధనా ప్రొడక్షన్స్
పాటల రచయితలు: అనిశెట్టి సుబ్బారావు, పినిశెట్టి శ్రీరామమూర్తి
పద్య కవులు: తిరుపతి వెంకట కవులు, బమ్మెర పోతన
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి, లతా మంగేష్కార్, కె.జమునారాణి
ఛాయా గ్రహణం: ఎం.ఎ.రహమాన్
విడుదల:05:08:1955.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]రంగయ్య (ఎస్.వి.రంగారావు) అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి (బేబి విజయలక్ష్మి, శ్రీరంజని), రాము (అక్కినేని నాగృశ్వరరావు), బాబు (చలం) అనే ముగ్గురు సంతానం. ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు కోల్పోతాడు రంగయ్య. సంతానం ముగ్గురూ కలసి జీవనయానం సాగించి విధివశాత్తూ బాల్యదశలోనే విడిపోతారు. వీరు విడిపోకముందు అక్క లక్ష్మి చిన్న తమ్మున్ని నిద్రపుచ్చుతూ 'నిదురపోరా తమ్ముడా' అని జోల పాడుతుంది. ఈ పాటే కథకు కీలకం. ఒక ఇరవై యేళ్ళు గడిచాక ఇదే పాట వారిని ఏకం చేస్తుంది.
పరిస్థితుల రీత్యా విడిపోయిన లక్ష్మి ఒక జమిందారు (మిక్కిలినేని) యింటిలో వంటమనిషిగా చేరుతుంది. రాము నాటకాల కంపెనీలో చేరి వేషాలేస్తూ పెరిగి పెద్దవాడై ఓ జమిందారు (రేలంగి) ఇంట్లో ప్రవేశించి అతని కూతురు (సావిత్రి) అభిమానాన్ని, ప్రేమను పొందుతాడు. బాబు ఓ వస్తాదు వద్ద పెరిగి మిక్కిలినేని కూతురు (కుసుమ కుమారి)ని ప్రేమిస్తాడు. ఇది నచ్చని పెద్దాయన కొడుకు విదేశాలకు వెళ్ళగానే లక్ష్మిని ఇంటినుంచి గెంటివేస్తాడు. ఆ బాధతో లక్ష్మి పాడిన గీతంతో రాము అక్కను గుర్తిస్తాడు. వారిద్దరూ పతాక సన్నివేశంలో తమ్ముడు బాబును, తండ్రి రంగయ్యను కలుసుకుంటారు. ఆ విధంగా అంధుడైన తండ్రి రంగయ్య తన సంతానం ముగ్గుర్నీ కలుసుకోవడం, అపార్ధాలు తొలగి ఆ ముగ్గురికీ వారు కోరుకున్న వారితో వివాహం జరగడంతో కథ సుఖాంతమౌతుంది.
పాటలు
[మార్చు]- అమ్మా మాయమ్మా ఇలవేల్పువమ్మా మా పూజలే కొనుమా తల్లీ - జిక్కి
- ఇది వింతజీవితమే వింత జీవితమే - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి
- ఈ లోకాన వెలియై విలపించుటేనా ఈ భాధలన్ని విధి వ్రాతలేనా - జిక్కి
- ఈ చిట్టా అణామత్తు అంతా చిత్తులే పేరుకైన జమలేదే - ఘంటసాల , రచన: అనిశెట్టి
- కనుమూసినా కనిపించే నిజమిదేరా ఇల లేదురా నీతి ఇంతేనురా - ఘంటసాల , రచన: అనిశెట్టి
- చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే - ఘంటసాల , రచన: అనిశెట్టి
- చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వేంకట కవులు
- దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే - ఘంటసాల , రచన: అనిశెట్టి.
- నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురలోన - లతా మంగేష్కర్
- నిదురపో నిదురపో నిదురపోరా తమ్ముడా నిదురలోన - లతా మంగేష్కర్,ఘంటసాల , రచన: అనిశెట్టి,
- పోకన్ మానదు దేహమేవిధమునన్ పోషించి రక్షించినన్ - ఘంటసాల , రచన: అనిశెట్టి
- బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వేంకట కవులు
- మురళీ గానమిదేనా తీరని కోరికలే తీయని వేణువలై తోటలోన - జిక్కి బృందం
- లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన
- సంతోషమేల సంగీతమేల పొంగి పొరలేను మనసీవేళ - కె. జమునారాణి,జి.కె. వెంకటేష్
వివరాలు
[మార్చు]ఈ చిత్రములోని నిదురపోరా తమ్ముడా పాట లతా మంగేష్కర్ తెలుగులో పాడిన మొదటిపాట.
మూలాలు
[మార్చు]- చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో పాట లిరిక్స్ విశ్లేషణ - తెలుగు పాత పాటల విశ్లేషణ బ్లాగు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2006.
- దేవి.. శ్రీదేవి పాట విశ్లేషణ[1] - కొన్ని అరుదైన , అపురూపమైన పాటల్ని లోతైన విశ్లేషణలతో ఈ వేదిక … పాటను యధాతధంగా కాదు అందులోని లోతైన అర్థాన్నీ , అంతరార్థాన్ని , అంతకన్నా మించి పాట లోలోతుల్లో కదలాడుతున్న, కవితాత్మక , తాత్విక రసగుళికల్ని, మీ హృదయంలోకి ఒంపుతుంది. పాట విశ్లేషణ కొరకు https://www.teluguoldsongs.net/2021/01/devi%20sri%20devi%20song%20%20santanam%20film.html తెలుగు పాత పాటల విశ్లేషణ బ్లాగ్