Jump to content

స్వర్గసీమ (1945 సినిమా)

వికీపీడియా నుండి
స్వర్గసీమ
(1945 తెలుగు సినిమా)
దర్శకత్వం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి)
నిర్మాణం బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, మూలా నారాయణస్వామి
కథ చక్రపాణి
తారాగణం పాలువాయి భానుమతి (సుజాతాదేవి పాత్ర),
బి.జయమ్మ (కల్యాణి - నాగయ్య భార్య),
ముదిగొండ లింగమూర్తి,
చిత్తూరు నాగయ్య (మూర్తి పాత్ర),
చదలవాడ నారాయణరావు,
కస్తూరి శివరావు
సంగీతం చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు, బాలాంత్రపు రజనీకాంతరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు (మొదటి సినిమా)
గీతరచన బాలాంత్రపు రజనీకాంతరావు, సీనియర్ సముద్రాల
సంభాషణలు చక్రపాణి
ఛాయాగ్రహణం మార్కస్ బార్ట్లీ
కళ ఎ. కె. శేఖర్
నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్
నిడివి 114 నిముషాలు, 10,296 అడుగుల రీలు
భాష తెలుగు
స్వర్గసీమ

వేశ్యా వ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్.రెడ్డి 1945లో తీసిన స్వర్గసీమ తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. ఘంటసాల గాయకుడుగానూ, సంగీతదర్శకుడుగానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీరచయితగా చక్రపాణి పరిచయమైన సినిమా కూడా ఇదే. భానుమతి పాడిన ఓహో పావురమా అనే పాట విజయవంతమైంది.

మూర్తి (నాగయ్య) కోసం ఎదురుచూస్తున్న సుజాత (భానుమతి). స్వర్గసీమలో ఒక సన్నివేశం

మూర్తి (చిత్తూరు నాగయ్య) పెళ్ళయి హాయిగా సంసారం చేసుకొంటున్న వ్య్తక్తి. ఒక పత్రికకు సంపాదకునిగా పని చేస్తూ సాయంకాలం తన భార్య అయిన కళ్యాణి (బి.జయమ్మ), పిల్లలతో హాయిగా గడిపుతూంటాడు. ఒక రోజు వీధిలో నాట్యం చేసే సుబ్బి (పాలువాయి బానుమతి) తో పరిచయం ఏర్పడుంది. ఆమె నాట్యం విపరీతంగా నచ్చిన మూర్తి ఆమెను ఒక నాటకలు వేసే సంస్థకు పరిచయం చేస్తాడు. ఆ సంస్థ మేనేజరు (కస్తూరి శివరావు) ఆమెను సుజాతాదేవిగా మారుస్తాడు. సుజాతాదేవిగా మారిన సుబ్బి మూర్తిని ఆకర్షిస్తుంది. సుజాతాదేవి మాయలో పడిన మూర్తి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యటం మొదలుపెడతాడు.

ఒక ప్రమాదంలో గాయపడిన మూర్తిని వదుల్చుకొనే ప్రయత్నంలో సుజాతాదేవి, మూర్తి బాగుగోలంతా ఆ నాటక సంస్థలో సాంఘిక నాటకాలు వేసే నరేన్ కు అప్పగిస్తుంది. నిజమైన ప్రేమాభిమానాలు తెలిసి వచ్చి మూర్తి పల్లెకు వెళ్ళిపోయిన తన భార్యాబిడ్డలను వెతుక్కొంటూ వెళతాడు. అందరూ కలవడంతో కథ సుఖాంతం అవుతుంది.

విశేషాలు

[మార్చు]
  • సినిమాలో నాగయ్య కూతురు పాత్రను సినిమా దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్) కూతురు బేబీ జయలక్ష్మి, నాగయ్య కొడుకు పాత్రను బి.ఎన్ రెండవ కుమారుడు మాస్టర్ వేణు పోషించారు.[1]
  • భానుమతికి ఒకరోజు "బ్లడ్ అండ్ సాండ్" (Blood and Sand (1941 film)) సినిమా టిక్కట్లు బుక్ చేయించారు. అందులోని రీటా హేవర్త్ నటన ఆమెనెంతో ఆకర్షించింది; ఒక సన్నివేశంలో గిటార్ వాయిస్తూ చేసిన స్పానిష్ ట్యూన్ బాగా నచ్చి స్వర్గసీమ సినిమాలో సుజాత వేషంలో ఆ ట్యూన్ పాటగా రూపొందించారు. అదే "ఓహో పావురమా" పాట. [2]

ఈ సినిమాలోని పాటలు

[మార్చు]
స్వర్గసీమ పోస్టరుపై భానుమతి
1947 చందమామలో వచ్చిన సినిమా ప్రకటన

1) మోహినీ రుక్మాంగద (వీధి నాటకం)
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

పాట పాడినవారు: పాలువాయి భానుమతి , లింగమూర్తి
పాటలో కనిపించినవారు : పాలువాయి భానుమతి, బృందం


2) మేలుకో కృష్ణా! నా తరమా నిదుర నాపగా...
పాడినవారు : బి. జయమ్మ, నాగయ్య
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
పాటలో కనిపించినవారు : బి.జయమ్మ, నాగయ్య


3) మంచిదినము నేడే (పదం)
పాడినవారు : పాలువాయి భానుమతి , లింగమూర్తి ,
రాగం : ఆనందభైరవి
పాటలో కనిపించినవారు : పాలువాయి భానుమతి
సాహిత్యం:మూవ నల్లూరు సభాపతయ్య


4) గృహమేకదా స్వర్గసీమ
పాడినవారు : బి. జయమ్మ, నాగయ్య
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: బాలాంత్రపు రజనీకాంతరావు
పాటలో కనిపించినవారు : బి.జయమ్మ, నాగయ్య


5) ఓహో పావురమా
పాడినవారు : భానుమతి
సంగీతం : బాలాంత్రపు రజనీకాంతరావు
సాహిత్యం: బాలాంత్రపు రజనీకాంతరావు


6) హాయి సఖీ హాయి సఖీ
పాడినవారు : నాగయ్య
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: బాలాంత్రపు రజనీకాంతరావు
పాటలో కనిపించినవారు : నాగయ్య, భానుమతి


7) ఎవని రాకకై యెదురు చూచెదో
పాడినవారు : రజనీకాంతరావు బాలాంత్రపు
సంగీతం : బాలాంత్రపు రజనీకాంతరావు
సాహిత్యం: బాలాంత్రపు రజనీకాంతరావు


8) రారా రాధా మనోరమణా
పాడినవారు : బి. జయమ్మ
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
పాటలో కనిపించినవారు : బి.జయమ్మ


9) జో అచ్యుతానంద
పాడినవారు : బి. జయమ్మ
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: అన్నమయ్య


10) ఓహో తపోధనా (ఋష్యశృంగ)
పాడినవారు : పాలువాయి భానుమతి కోరస్
సంగీతం : బాలాంత్రపు రజనీకాంతరావు
సాహిత్యం: బాలాంత్రపు రజనీకాంతరావు
పాటలో కనిపించినవారు : పాలువాయి భానుమతి , నాగయ్య


11) మధుర వెన్నెల రేయి మల్లెపూల తెప్పగట్టి
పాడినవారు: పాలువాయి భానుమతి , నాగయ్య
పాటలో కనిపించినవారు : పాలువాయి భానుమతి , నాగయ్య
సాహిత్యం:సముద్రాల రాఘవాచార్య


12) ఆరేహా లే యెన్నెల ఇరజిమ్ము (గాజులపిల్ల)
పాడినవారు : ఘంటసాల వెంకటేశ్వరరావు, పాలువాయి భానుమతీ
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
( ఇది ఘంటసాల గారికి మొదటి పాట )


13) దుఖ్ కా హై దునియ బాబా
పాడినవారు : నాగయ్య


14) గృహమే కదా స్వర్గసీమ (విషాద రసం)
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: బాలాంత్రపు రజనీకాంతరావు
పాటలో కనిపించినవారు : బి.జయమ్మ, నాగయ్య
పాట పాడిన వారు:నాగయ్య


15) ఈ జన్మము దుర్లభము
సాధువుల పాట


16)చలో చలో సైకిల్
పాడినవారు : బి. జయమ్మ, నాగయ్య
సంగీతం : నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య


17)నా తరమా నిదుర నాపగ
పాడినవారు: నాగయ్య
పాటలో కనిపించినవారు : నాగయ్య

మూలాలు

[మార్చు]
  1. Musings By Bhanumati Ramakrishna p.172 [1]
  2. డా. భానుమతీ రామకృష్ణ, నాలో నేను, శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ, పేజీ, 164.