Jump to content

నాటి 101 చిత్రాలు

వికీపీడియా నుండి
నాటి 101 చిత్రాలు
నాటి 101 చిత్రాలు పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: ఎస్. వి. రామారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సినీ సాహిత్యం
ప్రచురణ: కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్
విడుదల: 2006

నాటి 101 చిత్రాలు ఒక మంచి విశ్లేషాత్మక సినిమా పుస్తకం. దీనిని ఎస్.వి.రామారావు రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే నంది అవార్డు లభించింది.

ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక 'సితార' లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ, అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు.

ఈ పుస్తకాన్ని కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు వారు ప్రచురించారు.

సినిమాల జాబితా

[మార్చు]
  1. తొలి టాకీ "భక్త ప్రహ్లాద" అయినా తొలి బాక్సాఫీస్ హిట్ ఆనాటి లవకుశ (1934)
  2. శ్రీకృష్ణలీలలు (1935)
  3. ద్రౌపది వస్త్రాపహరణమా? మానసంరక్షణమా? (1936)
  4. నాటి సంచలన చిత్రం గృహలక్ష్మి (1937)
  5. నాటి సినిమా : మాలపిల్ల (1938)
  6. మళ్ళీపెళ్ళి (1939)
  7. మల్లీశ్వరికి బీజం వేసిన వందేమాతరం (1939)
  8. పవర్ ఫుల్ టైటిల్ దేవత (1941)
  9. చరిత్ర సృష్టించిన జెమినీ బాలనాగమ్మ (1942)
  10. సారథీ వారి విలక్షణ చిత్రం పత్ని (1942)
  11. నాటి మేటి చిత్రం భక్త పోతన (1943)
  12. విదేశీ నాగరికతపై విమర్శనాస్త్రం తాసీల్దార్ (1944)
  13. ఎన్నో ప్రత్యేకతలున్న స్వర్గసీమ (1945)
  14. సారథీ చిత్రం గృహ ప్రవేశం (1946)
  15. నాగయ్యను ధన్యుణ్ణి చేసిన త్యాగయ్య (1946)
  16. ఉన్నత విలువల ఉదాత్త చిత్రం యోగి వేమన (1947)
  17. తొలి బాక్సాఫీస్ హిట్ బాలరాజు (1948)
  18. బలమైన కథాకథనాల ద్రోహి (1948)
  19. అపూర్వ కథాకథనాల గుణసుందరి కథ (1949)
  20. హీరోబిజానికి నాంది పలికిన కీలు గుఱ్ఱం (1949)
  21. విజయవంతమైన విషాద చిత్రం లైలా మజ్ను (1949)
  22. నాటి రాజకీయ చిత్రం మన దేశం (1949)
  23. హృదయాన్ని కదిలించే కథతో బీదల పాట్లు (1950)
  24. నవరస భరితం ఏ.వి.యం.వారి జీవితం (1950)
  25. తొలి మల్టీస్టారర్ చిత్రం పల్లెటూరి పిల్ల (1950)
  26. కుటుంబ కథా చిత్రాలకు కొత్తవరవడి సంసారం (1950)
  27. విజయ సంకేతం షావుకారు (1950)
  28. సౌందర్యలహరి స్వప్నసుందరి (1950)
  29. మనసున మల్లెలు జల్లిన మనోజ్ఞ చిత్రం మల్లీశ్వరి (1951)
  30. పాతదైనా నిత్యనూతనం పాతాళభైరవి (1951)
  31. పల్లె వాతావరణం నిండిన చిత్రం పల్లెటూరు (1952)
  32. సమస్యలు హాస్యంలో రంగరించిన పెళ్ళిచేసిచూడు (1952)
  33. కమనీయ ప్రేమకథా చిత్రం ప్రేమ (1952)
  34. బరువైన కథ బ్రతుకు తెరువు (1953)
  35. భానుమతి బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక చండీరాణి (1953)
  36. ప్రేమ కథా చిత్రాల్లో చిరస్మరణీయం దేవదాసు (1953)
  37. ఆత్రేయ సహజసృష్టి గుమస్తా (1953)
  38. ఉదాత్త కథాచిత్రం కన్నతల్లి (1953)
  39. కుటుంబ మధురిమలు తెలిపే నా ఇల్లు (1953)
  40. నవ్వుల్లో ముంచెత్తిన పక్కింటి అమ్మాయి (1953)
  41. విలక్షణ కథాంశంతో కూడిన చిత్రం పరదేశి (1953)
  42. డాక్టర్ రాజారావు అపూర్వసృష్టి పుట్టిల్లు (1953)
  43. సంగీతభరిత చిత్రం అమర సందేశం (1954)
  44. ఒకే సంవత్సరం (1954) రెండు విభిన్న చిత్రాలు అందించిన నిర్మాత, దర్శకుడు భరణీ రామకృష్ణ చక్రపాణి (1954)
  45. విప్రనారాయణ (1954)
  46. పాతిక లక్షల తొలి తెలుగు చిత్రం చంద్రహారం (1954)
  47. జనరంజక చిత్రం జనతావారి పరివర్తన (1954)
  48. అవార్డు చిత్రం తోడు దొంగలు (1954)
  49. రజత కమలం పొందిన తొలి తెలుగు చిత్రం పెద్దమనుషులు (1954)
  50. పి.పుల్లయ్య అర్థాంగి (1955)
  51. సంగీతభరితం అనార్కలి చరితం (1955)
  52. ఎస్.వి.రంగారావు నట జీవితంలో కలికితురాయి బంగారు పాప (1955)
  53. అన్నపూర్ణా వారి తొలి హిట్ చిత్రం దొంగరాముడు (1955)
  54. ఎన్.ఏ.టి.సంస్థను నిలబెట్టిన జయసింహ (1955)
  55. వినోదాన్నిచ్చిన కన్యాశుల్కం (1955)
  56. వినోదాన్నందించిన మిస్సమ్మ (1955)
  57. గ్రామీన జీవితమే రోజులు మారాయి (1955)
  58. సాధనావారి సెంటిమెంట్ చిత్రం సంతానం (1955)
  59. హిట్ మూవీ భలేరాముడు (1956)
  60. ఉదాత్త ప్రేమకథాచిత్రం చిరంజీవులు (1956)
  61. ఇలవేలుపు ప్రత్యేకత (1956)
  62. కమనీయ చిత్రం తెనాలి రామకృష్ణ (1956)
  63. ఆలోచనలు రేకెత్తించే ఏది నిజం (1956)
  64. సామాజిక చిత్రం ఎమ్.ఎల్.ఏ. (1957)
  65. సినీ చరిత్రలో మాయాబజార్ చరిత్ర (1957)
  66. రక్తిని, భక్తిని పండించిన పాండురంగ మహాత్మ్యం (1957)
  67. నవరసభరితం సువర్ణ సుందరి చరితం (1957)
  68. ఉత్తమ కుటుంబ కథాచిత్రం తోడికోడళ్ళు (1957)
  69. రాజేశ్వరరావు మార్క్ సంగీత ప్రధాన చిత్రం చెంచులక్ష్మి (1958)
  70. మహామహుల సమ్మేళనం భూకైలాస్ (1958)
  71. వివాహ బంధాన్ని హాస్యంతో రంగరించిన పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
  72. గిలిగింతలు పెట్టే అప్పుచేసి పప్పుకూడు (1959)
  73. నవరసాల సమ్మేళనం ఇల్లరికం (1959)
  74. నవరస భరితం జయభేరి (1959)
  75. అన్నపూర్ణావారి హిట్ చిత్రం మాంగల్యబలం (1959)
  76. మనం గర్వించదగ్గ చిత్రం మహాకవి కాళిదాసు (1960)
  77. గ్రీకు ధోరణిలో రాజమకుటం (1960)
  78. రికార్డు టైమ్ లో నిర్మించిన శాంతినివాసం (1960)
  79. ప్రత్యగాత్మ తొలిచిత్రం భార్య భర్తలు (1961)
  80. కమనీయం సీతారామ కళ్యాణం (1961)
  81. శ్రీశ్రీని చిరస్మరణీయుని చేసిన వెలుగునీడలు (1961)
  82. హీరోపరంగా తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇద్దరు మిత్రులు (1961)
  83. అక్కినేని అభిమానించిన బాటసారి (1961)
  84. ఆహ్లాద చిత్రం జగపతివారి ఆరాధన (1962)
  85. నవరసాలతో నిండిన గులేబకావళి కథ (1962)
  86. హేమాహేమీల సమ్మేళనం గుండమ్మ కథ (1962)
  87. చారిత్రక చిత్రాలలో మణిపూస మహామంత్రి తిమ్మరుసు (1962)
  88. సిస్టర్ సెంటిమెంటుతో రక్తసంబంధం (1962)
  89. విశాఖ అందాలతో కులగోత్రాలు (1962)
  90. రవీంద్రా ఆర్ట్స్ తొలిచిత్రం లక్షాధికారి (1963)
  91. అగ్రనటుల అభినయ పోరాటమే శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
  92. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నర్తనశాల (1963)
  93. ఘంటసాలను ధన్యుణ్ణి చేసిన చిత్రం లవకుశ (1963)
  94. తెలుగు ప్రేక్షకుల భావస్రవంతిలో చిరంజీవిగా నిలచిన మూగమనసులు (1964)
  95. శిల్పకళకు ప్రాణం పోసిన చిత్రం అమరశిల్పి జక్కన్న (1964)
  96. బంగారు నందినందుకొన్న తొలిచిత్రం డాక్టర్ చక్రవర్తి (1964)
  97. ఏయన్నార్, బి.యన్.ల ఏకైక చిత్రం పూజాఫలం (1964)
  98. సురేష్ రామానాయుడికి తొలి చిత్రమే హిట్ - అదే రాముడు-భీముడు (1964)
  99. మంచి ఫలితాన్నిచ్చిన తేనె మనసులు (1965)
  100. మహామహుల సమ్మేళనం పాండవ వనవాసం (1965)
  101. రసవత్తర జానపదం మంగమ్మ శపధం (1965)

|

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • నాటి 101 చిత్రాలు (1931 - 65 మధ్య వచ్చిన నూటొక్క చిత్రాల చరిత్ర), రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.