గులేబకావళి కథ
గులేబకావళి కథ (1962 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | డి.యోగానంద్ |
నిర్మాణం | నందమూరి త్రివిక్రమరావు |
కథ | సముద్రాల |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, నాగరత్నం, ఋష్యేంద్రమణి, హేమలత, ఛాయాదేవి, బాలసరస్వతి, రాజనాల, మిక్కిలినేని, పద్మనాభం, నల్ల రామమూర్తి, లంక సత్యం, బాలకృష్ణ, పేకేటి శివరాం |
సంగీతం | జోసెఫ్ & విజయా కృష్ణమూర్తి |
నేపథ్య గానం | పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.జి.కృష్ణవేణి, ఎస్.జానకి |
గీతరచన | సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | సముద్రాల |
ఛాయాగ్రహణం | రవికాంత్ నగాయిచ్ |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ ధియేటర్స్ |
విడుదల తేదీ | జనవరి 5, 1962 |
భాష | తెలుగు |
గులేబకావళి కథ 1962 సంవత్సరంలో విడుదలైన జానపద తెలుగు సినిమా.
సంక్షిప్త చిత్రకథ[మార్చు]
పాటలీపుత్ర మహారాజు (మిక్కిలినేని) కు ఇద్దరు భార్యలు. రెండవ భార్య (ఛాయాదేవి) కు ముగ్గురు కొడుకులు. పెద్ద భార్య (ఋష్యేంద్రమణి) ఒక సిద్ధుని వరంచేత గర్భవతి అవుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డ వల్ల తనకు చూపు పోతుందని తెలుసుకున్న మహారాజు ఆమెను అడవులకు పంపిస్తాడు. అక్కడ ఆమెకు జన్మించిన కుమారుడు విజయుడు (రామారావు) కోయగూడెంలో పెరిగి పెద్దవాడవుతాడు. మహారాణి తమ్ముడు (రాజనాల) రాజ్యాధికారం కోసం ఎత్తులు వేస్తుంటాడు. ఇంతలో రాజుకు కళ్ళుపోతాయి. 'గులేబకావళి' పుష్పం తెచ్చి రాజు కన్నులకు తాకిస్తే చూపు వస్తుందని తెలియడంతో దానిని తేవడానికి ముగ్గురు మూర్ఖులైన చిన్న భార్య కొడుకులు బయలుదేరతారు. విజయుడు కూడా ప్రయాణమవుతాడు. త్రోవలో యుక్తమతి (జమున) అనే వగలాడి వేసిన పావుల పందెంలో అన్నలు ముగ్గురు ఓడిపోయి బందీలవుతారు. విజయుడు మారువేషంలో పందెంలో పాల్గొని ఆమెను ఓడిస్తాడు. ఫలితంగా ఆమె తన మనస్సును అర్పించి సోదరులను మిగిలిన వారిని విడుదల చేస్తుంది. విజయుడు గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తుండగా సోదరులు దానిని తస్కరించి విజయుడిని బావిలో పడవేసి రాజ్యానికి చేరతారు. బావిలోంచి బయటపడ్డ విజయుడు ఒక తాపసి సహాయంతో తిరిగి గులేబకావళి పుష్పాన్ని సాధించడమే కాక గులేబకావళిని పెళ్ళిచేసుకొంటాడు. రాజ్యానికి వచ్చిన అన్నల పెట్టెలో పుష్పానికి బదులు చీపురు కట్ట వుండటం చూసి ఆశ్చర్యపోతారు. విజయుడు సమయానికి వచ్చి తండ్రికి చూపు తెప్పించడమే గాక వక్రకేతుతో పోరాడి అంతమొందిస్తాడు.
నటీనటులు[మార్చు]
- ఎన్.టి.రామారావు - విజయ్
- జమున - యుక్తిమతి
- నాగరత్నం - బకావళి
- ముక్కామల కృష్ణమూర్తి - చంద్రసేనుడు
- రాజనాల కాళేశ్వరరావు - వక్రకేతు
- ఛాయాదేవి - రూపవతి
- ఋష్యేంద్రమణి - గుణవతి
- చదలవాడ
- బి.పద్మనాభం
- బాలకృష్ణ - అతితెలివి
- సురభి బాలసరస్వతి - అధికాశ
- పేకేటి శివరాం
- కె.వి.ఎస్.శర్మ
- హేమలత
- మిక్కిలినేని
- బొడ్డపాటి
- నల్ల రామమూర్తి
- లంక సత్యం
- మీనాకుమారి
- మహంకాళి వెంకయ్య
పాటలు[మార్చు]
ఈ సినిమాకు సంగీతదర్శకత్వం జోసెఫ్ కృష్ణమూర్తి వహించగా, పాటలన్నీ సి.నారాయణ రెడ్డి రాశారు. జోసెఫ్ కృష్ణమూర్తికి సంగీత దర్శకునిగానూ, సినారెకు గేయ రచయితగానూ ఇదే తొలిచిత్రం.[1]
- అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా కన్నయ్య - పి. లీల
- అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమేనమ్మి ( పద్యం) - ఘంటసాల
- ఈ ఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీలికముందు - ఎస్. జానకి బృందం
- ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని అంటారా - బి.వసంత బృందం
- ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల
- ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని పొంగినదిరా - పి.సుశీల
- కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసిపోదునో చెలియా - ఎస్.జానకి, ఘంటసాల
- - రచన: సి.నారాయణ రెడ్డి; గానం: ఘంటసాల, పి.సుశీల
- మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా నీకన్నా లోకంలో నాకెవరు - ఘంటసాల
- సలామాలేకుం సాహెబుగారు బలే షోకుగా వచ్చారా - ఎస్. జానకి, ఘంటసాల బృందం
- విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ నరుడో నరుడా - బి. గోపాలం
ఇతర విశేషాలు[మార్చు]
- ఈ చిత్రకథను మూకీ చిత్రంగా ఒకసారి (1924), హిందీలో రెండు సార్లు (1932, 1963), తమిళంలో రెండు సార్లు (1935 1955), పంజాబీలో ఒకసారి (1939) మరియు తెలుగులో రెండు సార్లు (1938, 1962) లో నిర్మించారు.
వనరులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
బయటి లింకులు[మార్చు]
- ఐ.ఎమ్.డి.బి.లో గులేబకావళి కథ పేజీ.
- పూర్తి సినిమాను చూడండి.
- తెలుగు సినిమాలో గులేబకావళి కథ రివ్యూ.
- దిద్దుబాటు
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన