Jump to content

నల్ల రామమూర్తి

వికీపీడియా నుండి
నల్ల రామమూర్తి / నల్ల రామ్మూర్తి
జననం
నల్ల రామమూర్తి

1913
మరణం1978, మార్చి 20
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు

కోటపల్లి (నల్ల) రామమూర్తి ప్రముఖ తెలుగు చలనచిత్ర, రంగస్థల నటుడు. హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలంలోని చింతపర్రు ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించాడు. ఇతడు సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించాడు[1].

విశేషాలు

[మార్చు]

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఇతనికి చదువు అంతగా అబ్బలేదు. చక్కని గాత్రం ఉండడంతో నాటకరంగాన్ని తేలికగా ఆకర్షించగలిగాడు. తన 15వ యేటనే శ్రీకృష్ణతులాభారం నాటకంలో వసంతకుని వేషం వేసి అందర్నీ మెప్పించాడు. ఇంగ్లీషు చదువు అబ్బకపోయినా తెలుగులో అనేక వచన గ్రంథాలను చదవడం వల్ల, నాటకాలలోని పద్యాలు కంఠస్తం చేయడం వల్ల అచిర కాలంలోనే రచయితగా మారాడు. "తూర్పు సావిత్రి", "సీతమ్మోరి వనవాసం", "పండగ అల్లుళ్లు" మొదలైన హాస్యనాటికలను స్వయంగా రచించి తన బృందంతో ఆంధ్రదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చాడు. గాత్రం కూడా ఉండడంతో అద్దంకి శ్రీరామమూర్తి, ఈలపాట రఘురామయ్య, పువ్వుల సూరిబాబు, కొచ్చర్లకోట సత్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు, స్థానం నరసింహారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు మొదలైన రంగస్థల నటులతో కలిసి అనేక పౌరాణిక నాటకాలలో హాస్యభూమికలు ధరించాడు.

చిత్రసమాహారం

[మార్చు]

మరణం

[మార్చు]

ఇతడు తన 65వ యేట తన స్వగ్రామమైన చింతపఱ్ఱు గ్రామంలో 1978, మార్చి 20వ తేదీన మరణించాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. మల్లీప్రియ, నాగరాజు (14 May 1978). "హాస్యనటచక్రవర్తి కీ.శే.నల్ల రామమూర్తి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 41. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 10 January 2018.

లింకులు

[మార్చు]