అగ్నిపరీక్ష (1951 సినిమా)
| అగ్నిపరీక్ష (1951 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి.మాణిక్యం |
|---|---|
| నిర్మాణం | కోవెలమూడి భాస్కరరావు |
| తారాగణం | లక్ష్మీరాజ్యం, కనకం, మాలతి, లక్ష్మీకాంతం, సావిత్రి, కల్యాణం రఘురామయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు, పేకేటి శివరావు, రేలంగి, నల్ల రామమూర్తి, సీతారాం, రావులపల్లి, ఇమాం |
| సంగీతం | గాలిపెంచెల |
| నేపథ్య గానం | పి. లీల, కె. రఘురామయ్య, మాలతి, లక్ష్మీరాజ్యం |
| నిర్మాణ సంస్థ | సారథీ ఫిల్మ్స్ |
| నిడివి | 181 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అగ్నిపరీక్ష పి.మాణిక్యం దర్శకత్వంలో నిర్మించిన 1951 నాటి చిత్రం . సారథి ఫిలింస్ పతాకంపై కోవెలమూడి భాస్కరరావు నిర్మించిన ఈ చిత్రం లో కళ్యాణం రఘురామయ్య , లక్ష్మిరాజ్యం, మాలతి, చిలకలపూడి సీతారామాంజనేయులు మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు .
తారాగణం
[మార్చు]- లక్ష్మీరాజ్యం
- కళ్యాణం రఘురామయ్య
- కనకం
- చిలకలపూడి సీతారామాంజనేయులు
- మాలతి
- సావిత్రి
- లక్ష్మీకాంతం
- పేకేటి శివరావు
- రేలంగి వెంకట్రామయ్య
- నల్ల రామమూర్తి
- సీతారాం
- రావులపల్లి
- ఇమాం .
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు; పి.మాణిక్యం
సంగీతం: గాలిపెంచల నరసింహారావు
గీతరచన: కె.జి.శర్మ
గాయనీ గాయకులు: కల్యాణం రఘురామయ్య, మాలతి, టి కనకం, నల్ల రామ్మూర్తి, ఎం.ఎస్.రామారావు, స్వర్ణలత, లక్ష్మీరాజ్యo,
నిర్మాత: కోవెలమూడి భాస్కరరావు
నిర్మాణ సంస్థ: సారధి ఫిలింస్
విడుదల:07:04:1951.
నిర్మాణం
[మార్చు]పాత్రల ఎంపిక
[మార్చు]మొదట సావిత్రిని రాకుమారుడైన కథానాయకుణ్ణి లోబరుచుకునే ప్రతినాయిక ఛాయలున్న ప్రధానమైన పాత్రకి తీసుకుందామని భావించారు. అందుకుగాను ఆడిషన్స్ చేశాకా, ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆమెకు ఇందులో చిరుపాత్ర కూడా దక్కలేదు.[1]
పాటలు
[మార్చు]గీత రచయిత: కె. జి. శర్మ
- వసంత రుతువే హాయి మురిపించు - పి.లీల
- ఎన్నినాళ్ళకు కల్గెరా మువ్వగోపాల నిన్ను చూచెడు - పి.లీల
- కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి,లక్ష్మీరాజ్యం
- ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య,
- ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య
- పాలవెన్నెలరేయి ఈరేయి రావోయి నా మేను - పి.లీల
- ఓ నమహా నారాజా ఓ తిరుపతి_టి.కనకం, నల్ల రామమూర్తి
- ఓ గిలిబిలి వలపుల రాణి _ఎం.ఎస్.రామారావు, స్వర్ణలత
- తెలిసేనా ఇకనైనా చేసిన పాప ఫలితము_ఎం.ఎస్.రామారావు
- బీదలము బాబు పేదలము నిరుపేదలము_ఎం.ఎస్.రామారావు, పి.లీల
- ఇదేనా నా ఖర్మము న్యాయమా ఈఫలితము వృధాయేగా_
- దివ్య సుందర నాగ మా కులదైవం నీవేదేవా_
- మూడుముళ్ల నాడు వేడుకాయే మూడుముళ్లె మిగిలేనే మగని చూపే_
- కలగంటినమ్మా కలగంటి వినరమా_(చెంచునాటకం)
- ఎరుగదు ముద్దరాలు పతినేయని నెమ్మది నయము_(పద్యం)
- కులపత్నిన్ నిను గోడు నెట్టిన కృతఘన్న్ నన్ను_(పద్యం).

వనరులు
[మార్చు]- తెలుగు సినిమా పాటలు బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు)- సంకలనంలో సహకరించినవారు: జె. మధుసూదనశర్మ