లక్ష్మీరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంసారం సినిమాలో లక్ష్మీరాజ్యం (రూపవాణి పత్రిక ముఖచిత్రం)
దస్త్రం:Sridharrao lakshmirajyam.jpeg
భర్త శ్రీధరరావుతో లక్ష్మీరాజ్యం
ప్రభాకర్ ప్రొడక్షన్స్ చిత్రం "మంగళసూత్రం" (1948)లో లక్ష్మీరాజ్యం

సి.లక్ష్మీరాజ్యం (1922 - 1987) తెలుగు సినిమా, రంగస్థల నటి, నిర్మాత. 1922లో విజయవాడ[ఆధారం చూపాలి]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన శ్రీకృష్ణ లీలలు సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్‌గా నటించింది. ఈమె 1941లో తెనాలికి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి కె.శ్రీధరరావును వివాహమాడినది. సి.లక్ష్మీరాజ్యం కర్నూలు జిల్లాలోని ఆవుకు గ్రామంలో, 1922లో జన్మించారు.[1]


చిన్నతనంలో తన చిన్నాన్న నరసింహం దగ్గర సంగీతం నేర్చుకున్నారు. యుక్తవయసులో హరికథలు చెప్పాలనే మక్కువతో సాలూరు రాజేశ్వరరావు వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. ఈమెకు హరికథా కళాకారిణి కావాలన్న లక్ష్యం ఉండేది. మేనమామ వెంకటరామయ్యతో పాటు పువ్వుల సూరిబాబు నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు.[2] తరువాత పులిపాటి వెంకటేశ్వర్లు, పువ్వుల రామతిలకం వారి సమాజంలో ప్రవేశించి కొన్ని పాత్రలు ధరించారు. ఈమె తులాభారంలో నళిని, చింతామణిలో చిత్ర మొదలగు పాత్రలు ఎంతో చలాకీగా పోషించేవారు.

వీరు 1951లో రాజ్యం పిక్చర్స్ అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి నందమూరి తారక రామారావుతో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన నర్తనశాల. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో హరిశ్చంద్ర, శ్రీకృష్ణ లీలలు, శకుంతల, దాసి, రంగేళి రాజా, మగాడు ఉన్నాయి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.

ఈమె భర్త శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన మద్రాసులోని తమ స్వగృహములో మరణించాడు.[3]

చిత్ర సమాహారం[మార్చు]

నటిగా

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 115. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. Illalu(1940) - The Hindu
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-22. Retrieved 2007-08-27.

బయటి లింకులు[మార్చు]