పంతులమ్మ (1943 సినిమా)
Jump to navigation
Jump to search
పంతులమ్మ (1943 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
కథ | మల్లాది విశ్వనాథ కవిరాజు |
చిత్రానువాదం | ఇంటూరి వెంకటేశ్వరరావు |
తారాగణం | ముదిగొండ లింగమూర్తి, ఉమామహేశ్వరరావు, లక్ష్మీరాజ్యం |
సంగీతం | గాలి పెంచల నరసింహారావు |
నేపథ్య గానం | లక్ష్మీరాజ్యం, పి.జి.కృష్ణవేణి |
నృత్యాలు | వేదాంతం రాఘవయ్య |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | సారధీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పంతులమ్మ సినిమా సారధీ పిక్చర్స్ పతాకం క్రింద గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో తయారైనది. ఈ చిత్రంలో వీరు అవినీతికి ఆలవాలమైన పురపాలక సంఘ అధ్యక్షుల బ్రతుకులను బట్టబయలు చేశారు. దీనిలో లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి, డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి, డి.హేమలత మొదలైన వారు నటించారు. ఒక బాలిక పాత్రలో బాలగాయని పి.జి.కృష్ణవేణి (జిక్కి)ని రామబ్రహ్మం పరిచయం చేశారు. "ఈ తీరని నిన్నెరిగి పలుకగా - నా తరమా - జగదేక కారణా" అనే పాటను జిక్కీ పాడింది. ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించారు. సముద్రాల వారే ఈ చిత్రానికి సంభాషణలు కూడా వ్రాసారు. స్క్రీన్ ప్లే రచనలో ఇంటూరి వెంకటేశ్వరరావు సహకారాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.కె.మంగరాజు గారి పూర్ణా సంస్థ ద్వారా విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- లక్ష్మీరాజ్యం - పంతులమ్మ
- ఉమామహేశ్వరరావు
- ముదిగొండ లింగమూర్తి
- గిడుగు వెంకట సీతాపతి
- వంగర వెంకట సుబ్బయ్య
- పార్వతీబాయి
- కమల కుమారి
- పి.హేమలత
- సామ్రాజ్యం
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని 11 పాటలను సముద్రాల రాఘవాచార్య రచించారు.[1]
- ఆనందమానంద మాయెనే - మా అన్నయ్య పెండ్రికొడుకాయెనే
- ఈ తీరని నిన్నెరిగి పలుకగా నా తరమా జగదేక కారణా - పి.జి.కృష్ణవేణి
- కూయకే కోయిలా కూయబోకే కూసి నా గుండియలు కోయబోకె
- చెఱగుమూసె యేమి సేతురా - దరిజేరనైన వీలుకాదురా
- జై జై మహాంధ్ర జననీ జై మహాంధ్ర జననీ - లక్ష్మీరాజ్యం బృందం
- తెలియగా లేడాయెగా - చాయగానైన తన మనసీయ డాయెగా - లక్ష్మీరాజ్యం
- పదరా బైటికి పోదామా బంగారు రాజా
- రాగ సుధారసమే అనురాగ సుధారసమే - సకల జీవసుఖ సాధనమూ - ఎస్.బి. దినకర్ రావు, లక్ష్మీరాజ్యం
- లేదా లేదా పనిలేదా ప్రేమజీవులకు జాతిమతాల - ఎస్.బి. దినకర్ రావు
- సాగించుమురా యువకా ధర్మము సాగించుమురా - అంబారావు బృందం
మూలాలు
[మార్చు]- ↑ పంతులమ్మ (1943), జీవితమే సఫలము, మొదటి సంపుటి, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు: 175-81.
- శ్రీ గూడవల్లి రామబ్రహ్మం, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ గాయత్రి ప్రింటర్స్, తెనాలి, 2004.