ఇల్లాలు (1940 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇల్లాలు
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
తారాగణం కాంచనమాల,
లక్ష్మీరాజ్యం,
ఉమామహేశ్వరరావు,
సాలూరి రాజేశ్వరరావు,
రావు బాలసరస్వతి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం రావు బాలసరస్వతి,
సాలూరి రాజేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి
గీతరచన బసవరాజు అప్పారావు,
తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ ఇంద్రాదేవి ఫిల్మ్స్ లిమిటెడ్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
ఇల్లాలు సినిమా పోస్టరు.

మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సంచలన చిత్రాలు నిర్మించిన గూడవల్లి రామబ్రహ్మం, ఈ రెండు చిత్రాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా, 'రైతుబిడ్డ' పై జమీందార్లు అలిగి ప్రింట్లు తగలబెట్టడం, నిషేధింప చేయడం వంటి అంశాలతో మనస్థాపం చెంది, తన రూట్‌ మార్చుకుని ఇందిరా ఫిలింస్‌ అనే సంస్థకు దర్శకత్వం చేయడానికి అంగీకరించి 'ఇల్లాలు' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అడ్వకేట్‌ ఉమామహేశ్వరరావుని హీరోగా, సాలూరి రాజేశ్వరరావుని సంగీత దర్శకుడిగా పరిచయం చేసారు. కాంచనమాల హీరోయిన్‌. రావు బాల సరస్వతీదేవి ఇందులో నటించి పాటలు పాడటమే కాకుండా కాంచనమాలను రాజేశ్వరరావు బాణికి అనుగుణంగా పాడేలా ఆమె ముందు సరస్వతి ఆలపించి ఆమె అలా పాడేలా చేసారు.[1]

పాటలు

[మార్చు]
  1. సుమకోమల కనులేల కమనీయ - ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి
  2. దిన దినము పాపండి దీవించి పొండి దేవలోకములోని - కాంచనమాల
  3. కోయి కోయి కోయిలొకసారి కూసి పోయింది - కాంచనమాల
  4. మనలొకపు లీల నటన ఒక బొమ్మలాటయె కాదా - కాంచనమాల
  5. నీ మహిమేమో నేరగలేమె - పి. సూరిబాబు
  6. సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి -పి. సూరిబాబు

వనరులు

[మార్చు]