ఇది మా కథ
Jump to navigation
Jump to search
ఇది మా కథ (1946 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | డి.ఎస్.కోట్నిస్ |
తారాగణం | లక్ష్మీరాజ్యం, కోన ప్రభాకరరావు, తులసి, స్నేహలతా దేవి, ఇందిరా దేవి, గంగారత్నం, సుబ్బారావు చౌదరి, కె.వి.సుబ్బారావు, రామనాధ శాస్త్రి, ఎ.వి.కె.మూర్తి |
సంగీతం | పి.మునిస్వామి |
నిర్మాణ సంస్థ | ప్రభాకర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది మా కథ (లేదా) మంగళ సూత్రం (లేదా) Excuse Me 1946 నవంబర్ 21న విడుదలైన తెలుగు సినిమా.
సాంకేతిక వర్గం[మార్చు]
దర్శకత్వం: డి.యన్. కొట్నీస్ సంగీతం: పి. మునుస్వామి
తారాగణం[మార్చు]
- ప్రభాకర్,
- సుబ్బారావు చౌదరి
- ఎ.రామనాధ శాస్త్రి,
- లక్ష్మీరాజ్యం,
- ఇందిర,
- కనకం,
- బాలసరస్వతీ దేవి
పాటలు[మార్చు]
ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | మామయ్యోచ్చేడే మా మామయ్యోచ్చేడే ఏమిటి తెచ్చాడే | జిక్కి, పిఠాపురం |
2 | పగలంతా తగవులా రాత్రంతా నగవులా బలే మంచి కాపురమే | |
3 | తెల్లారిందిలే చీకటిని చీల్చుకొని వెలుగొచ్చినాది | |
4 | తెలవారె తెలవారె చీకటితీరె యేమో లోకము మారె | |
5 | ఎలాగ నను చూడకలాగ విడిపోడ మెలాగా | |
6 | ఎటుల పోయేడో తానిపుడేమైనాడో నే చేసిన దోసము | |
7 | అలుకా పలుకవేరా కృష్ణా నాపై అలుకా | |
8 | అందగాడే బలే సోగ్గాడే ఎందుకలా నవ్వుతాడు | |
9 | హాయిగా పాడవే కోయిలా హాయిగా తియ్యగా పాడవే |
పేరు వెనుక కథ[మార్చు]
ఈ సినిమాకి మంగళ సూత్రం, ఇది మాకథ, excuse me అని మూడు పేర్లు. మూడు పేర్లు ఎందుకు అంటే నిర్మాత కోన ప్రభాకర్ ఒక పేరు, దర్శకుడు కోట్నెస్ ఒక పేరు, రచయిత సదాశివ బ్రహ్మం ఒక పేరూ సూచించారు. నేను చెప్పినదే ఉండాలి అంటే నేను చెప్పినదే ఉండాలి అని వాదించుకున్నారు. ఏకాభిప్రాయం కుదరక మూడు పేర్లూ పెట్టేశారు[1].
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 కొల్లూరి భాస్కరరావు. "మ౦గళ సూత్ర౦ - 1946". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 11 March 2020.