Jump to content

మాయలమారి

వికీపీడియా నుండి

'మాయలమారి' తెలుగు చలన చిత్రం.పి.శ్రీధర్ దర్శకత్వంలో1951 జూన్ 14 న విడుదల.ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, కస్తూరి శివరావు మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం, పి.ఆదినారాయణరావు అందించారు.

మాయలమారి
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.శ్రీధర్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీ దేవి
సంగీతం పి.ఆదినారాయణరావు
నేపథ్య గానం ఆర్.బాలసరస్వతి
గీతరచన తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ అశ్వనీ పిక్చర్స్
విడుదల తేదీ జూన్ 14, 1951
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
"రూపవాణి" ముఖచిత్రంగా "మాయలమారి"

రాజకుమారి ఇందుమతి మహారాజు ముద్దుల కుమార్తె. ప్రతాప్ మహారాజు మేనల్లుడు. ఇందుమతీ ప్రతాపులిద్దరూ చిన్నతనం నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. సేనాధిపతి భాస్కరవర్మ మహారాజు బావమరది. రాజ్య కాంక్షాపరుడు. ఇందుమతిని వివాహమాడి రాజ్యానికి రాజు కావాలనుకుంటుంటాడు.

ఒక శుభదినాన్ని మహారాజు ఇందుమతీ ప్రతాపుల వివాహానికి ముహూర్తం నిశ్చయిస్తాడు. భాస్కరవర్మకు ఇది గిట్టదు. అనుచరులతో కుట్రపన్నుతాడు. ఇందుమతి కులదేవతను పూజించి తిరిగి వస్తున్న సమయంలో అతని అనుచరులు మారు వేషాలతో విూద పడి ఆమెను ఎత్తుకుపోతారు, పాతకోటలో బంధిస్తారు. భాస్కర్ తన్ను వివాహమాడమని, నిర్బంధిస్తూ వుంటాడు.

ఈలోగా ప్రతాప్ చెలికత్తె లవంగి సాయంతో, పహరావాళ్ళ కళ్ళలో కారంజల్లి పాతకోటలో ప్రవేశిస్తాడు. ఇందుమతిని విడిపించి తీసుకు పోతూంటాడు. సైనికులు వారిని తరుముకు పోతుంటారు. ఇందువుతీ ప్రతాపులు, తమాషాగా వీధి భాగవతుల్లో కలసి పోతారు. ఊరూరా నాట్యాలు చేనుకుంటూ పోతూ, భాస్కర్ కు చిక్కకుండా చివరకు రాజ్యం ఒక మహారణ్యంలో చెట్టుకు వేలాడుతున్న పెద్ద మామిడి పండు చూస్తాడు ప్రతాప్.

ఆ ఫలాన్ని అందుకోవాలనుకుంటాడు. అదొక మాయ ఫలం, రివ్వున పైకి ఎగిరి ప్రతాపును లాక్కుపోతుంది. ఇందుమతి ప్రతాప్ ప్రతాప్ అని గోలపెడుతూ, వెంటబడి పోయి పోయి ఒకచోట సొమ్మసిల్లి పడిపోతుంది. మాయాఫలం, ప్రతాప్ ను, ఒక చిత్రమైన గుహలోనికి తీసుకొనిపోయి పడవేస్తుంది. వికృత రూపంతో మంత్రకత్తెగా మారిపోతుంది. జ్వాలాశక్తి అనే దేవతకు ఆతని తల బలిచేస్తుంది. దేవత శక్తివలన మంత్రకతై అందాలరాశి అప్సరసగా మారిపోతుంది. ప్రతాపును బతికిస్తుంది. మోహిస్తుంది. ప్రేమించమని నిర్బంధిస్తుంది, మాయలు చేస్తుంది. ప్రతాఫు మాత్రం చలించక ఆమెను తిరస్కరిస్తాడు. మాయలమారి అప్సరస ప్రతాపును గుహ నుండి విడుదల చేస్తుంది. కానీ ప్రతీకార దీక్షతో అతన్ని వెంబడిస్తుంది, ఇందుమతిగా మారి ఆతన్ని భ్రమలో ముంచివేస్తుంది. మరల అప్సరసగా మారి ఆశ్చర్య చకితుణ్ణి చేస్తుంది. ప్రతాప్ కలవరపాటు చెంది, పరుగు లెడుతూంటాడు. పాపం, యీసారి నిజమైన తన భార్య యిందుమతి తారసపడుతుంది. ఆనందంతో ఆలింగనం చేసుకోబోతుంది. మాయల మారి మాయలతో విభ్రాంత చిత్తుడైన ప్రతాప్, యీసారి కూడా మాయలమారి మాయయే అని భయపడి, తన భార్యను అనరాని మాటలు ఆని, కాలితో తన్ని, విడిచిపెట్టి పారిపోశాడు.

ఇందుమతికి లోకమే చీకటైపోతుంది. కొండ శిఖరాలనుండి దూకి జీవితం అంతంచేసుకో బోతుంది. కాని ఒక “గిప్సీ" నాయకు డామెను రక్షిస్తాడు. తన గూడెంలోకి తీసుకుపోతాడు. పత్నీ వియోగంతో పరితిపిస్తూ ప్రతాప్ ఒక గ్రామం చేరుకుంటాడు. అక్కడొక హోటల్లో, భాస్కర్ అనుచరులతో సంఘర్షణ జరుగుతుంది. తప్పించుకుని పారిపోతాడు, ఈ సమయంలోనే, గిప్సీగూడెంలో, కురంజీ అనే గిప్సీ నాయకుని ప్రియురాలు తన ప్రియుడు అందగత్తెను తీసుకురావడం చూచి సహించలేక ఆతనితో పోట్లాడుతుంది. తీవంగా పరాభవింపబడుతుంది. ప్రతీకారం చేస్తానని పతిజ్ఞ కేసి గూడెం విడిచిపోతుంది. - భాస్కర్ అనుచరులతో తరుమబడుతూ ప్రతాప్, కురంజీని తారసపడ తాడు, ఆమె ప్రతాప్ కు సాయంచేసి వాళ్ళ బారినుండి తప్పిస్తుంది. తన గూడెం తీసుకుపోతుంది. అక్కడ గిప్సీ నాయకుడికీ ప్రతాప్ కూ, తీవ్రమైన ముష్టి యుద్ధం జరుగుతుంది, ప్రతాప్ గెలుస్తాడు. ఆ వేళ ప్రతాప్ ను గిప్పీలంతా నృత్య గానాదులతో సత్కరిస్తుంటారు. ఈ సమయంలో, గిప్సీ నాయకుడు ఇందుమతిని బలాత్కరింప బోతాడు. ఈ సంఘర్షణలో వారున్న గుడిసెకు నిప్పఅంటుకుని తగలబడిపోతుంది. ప్రాణాలు దక్కించుకొని బయట పడతారు, కాని గిష్సీ నాయకుడా మెను వెంటాడుతూ పోయి ఒకచోట హింసింపబోతాడు. ఈలోగా, మారు వేషాలతో తిరుగుతున్న భాస్కర్ అనుచరులు ఆమెను రక్షించి గడ్డాల బైరాగి వేషంలో నాటకమాడు తున్న తమ గురువు భాస్కర్ వర్మకు అప్పగిస్తారు.

భాస్కర్ వర్మ పద్మప్యూహాన్ని పన్ని ఇందుమతీ ప్రతాపులను పట్టి బంధించి కోటకు తీసుకుపోతాడు, హింసిస్తాడు. తన్ను వివాహమాడమని యిందుమతిని బలవంతపెడతాడు. ఆమె నిరాకరిస్తోంది. కసితీర్చుకొనడానికి నిశ్చయిస్తాడు, ప్రతాప్ కు మరణదండన విధిస్తాడు. చివరకు ప్రేయసీ ప్రియులు ఎలా కలిసారన్నది మిగిలిన కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి.శ్రీధర్

నిర్మాణ సంస్థ: అశ్వనీ పిక్చర్స్

సంగీతం : పి.ఆదినారాయణరావు

గీత రచయితలు: తాపీ ధర్మారావు, పి.ఆదినారాయణరావు

నేపథ్య గానం.జిక్కి, రావు బాలసరస్వతిదేవి, పిఠాపురం నాగేశ్వరరావు , కె.శివరావు, కె.రాణి

విడుదల:1951:జూన్:14.


పాటల జాబితా

[మార్చు]

1.ఓ పరదేశి ప్రేమ పిపాసి యవ్వనరాశి రావోయీ, గానం.జిక్కి

2.కూయని కూసే కోకిలయైనా జుమ్మని, రచన: తాపీ ధర్మారావు, గానం.రావు బాలసరస్వతి దేవి, పిఠాపురం నాగేశ్వరరావు

3.గురుమహారాజ్ గురుమహరాజ్ సద్గురు మహారాజ్, గానం.కస్తూరి శివరావు బృందం

4.దణత దణ దణత కిసాంధిమ ధిమిత (వీధి భాగవతం), గానం. బృందం

5.భాగ్యశాలినైతినే మా బావ నాకు దక్కేనే భాగ్యజీవినే, గానం: జిక్కి

6.మియాం మియాం హే హూవా హూవా జింబాలో బాలో, గానం.కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు బృందం

7.రాజువెడలి వచ్చే సభకు రవి, రచన: పి.ఆదినారాయణరావు, గానం.పిఠాపురం నాగేశ్వరరావు, రావు బాలసరస్వతి దేవి బృందం

8.లేదేమో లేదేమో ఆశా లేశము నాకింక, రచన: తాపీ ధర్మారావు, గానం.రావు బాలసరస్వతిదేవి, పిఠాపురం.

9.అంతా అంతా ఇంతేరా , గానం.కస్తూరి శివరావు బృందం

10.హా విధీ ఇదిఏమి ఘోరము ఏవిధమ్మున నమ్మగలనో, రచన: తాపీ ధర్మారావు, గానం.ఆర్ .బాలసరస్వతి

11.అందము చందము బ్రతుకిక గందరగోళం, గానం.జిక్కి బృందం

12.జననీ జననీ ఓ కల్యాణి మంగళదాయుని మహేశురాణి , గానం.రావు బాలసరస్వతిదేవి

13.హే హే హే హే ... ఇంటిమాట తలచుకొంటే,

14.ఆ ఆ ఆ బొంచిక్ చిక్ బోంచిక్ చిక్(జిప్సే నాట్యం), గానం.జిక్కి బృందం

15.చందమామ రావే , గానం.జిక్కి.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=మాయలమారి&oldid=4361825" నుండి వెలికితీశారు