Jump to content

మేన కోడలు

వికీపీడియా నుండి
మేన కోడలు
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం కృష్ణ,
జమున
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ రవిశంకర్ పిక్చర్స్
భాష తెలుగు

మేనకోడలు రవిశంకర్ పిక్చర్స్ బ్యానర్‌పై బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో వై.సునీల్ చౌదరి నిర్మించిన తెలుగు సినిమా. ఇఐ 1972, జూన్ 7వ తేదీన విడుదలయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సంక్షిప్త కథ

[మార్చు]

గయ్యాళి ఐన దుర్గమ్మ చలపతికి రెండవ భార్య. తన కొడుకు వెంకట్, కూతురు శశిలను మాత్రం బాగా చూసుకుంటుంది కానీ సవతి కొడుకు సుందర్‌ని మాత్రం అనేక బాధలకు గురిచేస్తుంది. దుర్గమ్మ తమ్ముడు మూర్తి పరాయి కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్న కారణంగా అతడితో సంబంధాలు తెంచుకుంటుంది. ఆ తర్వాత అతడు వ్యాపారం చేసి లక్షలు గడిస్తాడు. మూర్తి భార్య తీవ్రమైన జబ్బు చేసి మరణించడంతో ఇంటికి ఆడదిక్కుగా అక్క కుటుంబాన్ని పట్నానికి రావలసిందిగా అభ్యర్థిస్తాడు. విచిత్ర పరిస్థితులలో అతడు మరణిస్తాడు.దుర్గమ్మతో తగాదా వచ్చి సుందర్ ఆమెను బాగా కొట్టి ఇంట్లోంచి పారిపోతాడు. తనకిష్టం లేని ఆడపడుచుకు పుట్టిన మూర్తి ఒక్కగానొక్క కూతురు సుశీల అంటే కూడా దుర్గమ్మకు చాలా కోపం. సుశీల చదువు మాన్పించి ఆమెను ఒక బానిసలా తయారు చేస్తుంది. ఇంటినుండి పారిపోయిన సుందర్ విచిత్ర పరిస్థితులలో చిదంబరం అనే ఒక లక్షాధికారి అభిమానం చూరగొని అతని ఆశ్రయంలో సొంత కుమారుడిగా పెరిగి పెద్దవాడవుతాడు. విద్యాధికుడైన వ్యక్తికి ఇచ్చి సుశీలను వివాహం చేస్తే ఎక్కడ ఆస్తి ఇచ్చేయాల్సి వస్తుందో అని అమాయకుడు, వృద్ధుడు ఐన గోవిందయ్యకు ఇచ్చి పెళ్ళి చేయబోతుంది దుర్గమ్మ. ఈ వివాహం చేసుకోవడం ఇష్టంలేని సుశీల ఇంటిలోంచి పారిపోతుంది. ఆమె ఎవరో తెలియకుండానే సుధీర్ అనే పేరుతో పిలవబడుతున్న సుందర్ ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకుని సుఖంగా జీవిస్తుంటారు. శశి శంకర్ అనే ఒక కారు మెకానిక్‌ను ప్రేమిస్తుంది. అతడు తానొక లక్షాధికారినని శశిని నమ్మించి మోసం చేయడమే కాకుండా గర్భవతిని చేస్తాడు. వెంకట్ చదువుకు స్వస్తి చెప్పి, త్రాగుడు, జూదం, స్త్రీ వ్యామోహాలకు గురై చెడిపోతాడు. శశి వృద్ధుడైన గోవిందయ్యను పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. శంకర్‌కు డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా శశి దగ్గరకు వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. తనకు శశికి ఉన్న అక్రమసంబంధాన్ని గోవిందయ్యకు చెబుతాడు. తన పాపిష్టి జీవితం లోకానికి వెల్లడి కాగా శశి భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ పరిస్థితులన్నీ చూసి చలపతి నరకప్రాయమైన సంసారం వదిలి వెళ్ళిపోతాడు. ఐతే సుధీర్ చేసే వ్యాపారంపై అనుమానం వచ్చి పోలీసులు అతడిని అరెస్టు చేస్తారు. సుధీర్‌ను అరెస్టు చేయడానికి కారణం, దుర్గమ్మకు జ్ఞానోదయం కలగడం, సుశీల ఈ కష్టాలన్నీ గట్టెక్కడానికి చేసిన పని మొదలైనవన్నీ మిగిలిన సినిమాలో తెలుస్తాయి,[2] [3]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించాడు.[3]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన గాయకులు
1 ఆశలు విరిసె కాంతులు మెరిసె అరుణోదయ శుభవేళా దాశరథి పి.సుశీల
2 చిన్నదాన్నీ చిన్నదాన్ని చిరుపొగరున ఉన్నదాన్నిలే కొసరాజు పి.సుశీల
3 ఈ సిగ్గు దొంతరలు ఎన్నాళ్ళు ఈ వయసు తొందరలు ఎన్నాళ్ళు సినారె ఘంటసాల, పి.సుశీల
4 బ్రతుకే చీకటాయె తనువే భారమాయె ఎటు చూచినా ఎటు పోయినా ఏ దారి లేకపోయె[4] శ్రీశ్రీ ఘంటసాల
5 తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగరా ఏ పేరున నిను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా దాశరథి పి.సుశీల
6 వయసు కులుకుచున్నది వలపు నిలువకున్నది మనసంతా నీమీదే ఉన్నది నీవురాకపోతే గుబులుగుబులుగున్నది కొసరాజు ఘంటసాల, పి.సుశీల
7 అమ్మా! ఈ నిరాశామయ నిశీధివేళ గమ్యమే కానరాని ఈ పయనమేలా శ్రీశ్రీ ఘంటసాల

విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "Mena Kodalu (B.S. Narayana) 1972". indiancine.ma. Retrieved 4 January 2023.
  2. రెంటాల (14 July 1972). "చిత్ర సమీక్ష:మేనకోడలు" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 4 జనవరి 2023. Retrieved 4 January 2023.
  3. 3.0 3.1 దాసరి నారాయణరావు (7 July 1972). Mena Kodalu (1972)-Song_Booklet. Ravishankar Pictures. p. 10. Retrieved 4 January 2023.
  4. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
"https://te.wikipedia.org/w/index.php?title=మేన_కోడలు&oldid=3894966" నుండి వెలికితీశారు