Jump to content

జమున (నటి)

వికీపీడియా నుండి
జూలూరి జమున
జమున
జననంజానాబాయి
ఆగష్టు 30, 1936
హంపి, కర్ణాటక
మరణం2023 జనవరి 27(2023-01-27) (వయసు 86)
హైదరాబాదు
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుజమునా రమణారావు
వృత్తిసినీ నటి
మతంహిందూ
భార్య / భర్తరమణారావు (1965-2014)
పిల్లలువంశీ జూలూరి (కుమారుడు), స్రవంతి రావు (కుమార్తె)
తల్లిదండ్రులునిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి

జమున (1936, ఆగస్టు 30 - 2023, జనవరి 27) తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయకి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాలలో నటించింది.

వృత్తి ఔన్నత్యం

[మార్చు]

జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.

తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.

1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇంతవరకు హీరోయిన్ గా కొనసాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటన ప్రతిభతో ఇండస్ట్రీలో స్వేచ్ఛకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అటువంటి వాళ్లలో జమున ఒకరు. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయకగా పేరుగాంచింది. కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జమున పుట్టిందే అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు తరలిరావడంతో ఆమె బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జానాబాయ్. ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు. జమున స్కూలులో చదివేరోజుల్లోనే నాటకాలవైపు ఆకర్షించురాలైంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు.

అవార్డులు

[మార్చు]
  • 1968: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మిలన్
  • 1964: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మూగ మనసులు
  • 2008: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం
  • 2021 సెప్టెంబరు 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జీవితసాఫల్య పురస్కారం అందుకుంది.[1]

పాక్షిక సినిమా జాబితా

[మార్చు]

తెలుగు

[మార్చు]
  1. పుట్టిల్లు (1953) - సుశీల
  2. అంతా మనవాళ్లే (1954) - గిరిజ
  3. ఇద్దరు పెళ్లాలు (1954) - కన్నమ్మ
  4. నిరుపేదలు (1954)- కమల
  5. బంగారు పాప (1954) - శాంత
  6. వద్దంటే డబ్బు (1954) - రేఖ
  7. వదినగారి గాజులు (1955) - ప్రభ
  8. దొంగరాముడు (1955)- లక్ష్మి
  9. సంతోషం (1955)- సరస
  10. మిస్సమ్మ (1955) - సీత
  11. చింతామణి (1956) - రాధ
  12. చిరంజీవులు (1956) - రాధ
  13. తెనాలి రామకృష్ణ (1956) - కమల
  14. నాగులచవితి (1956) - విపుల
  15. ముద్దు బిడ్డ (1956)- రాధ
  16. భాగ్యరేఖ (1957) - లక్ష్మి
  17. దొంగల్లో దొర (1957) - ఇందిర
  18. వినాయక చవితి (1957) - సత్యభామ
  19. వీరకంకణం (1957) - పార్వతి
  20. సతీ అనసూయ (1957) - నర్మద
  21. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) - రుక్మిణి
  22. బొమ్మల పెళ్లి (1958) - సరోజ
  23. భూకైలాస్ (1958) - మండోదరి
  24. శ్రీకృష్ణ మాయ (1958) - మాయ
  25. అప్పుచేసి పప్పుకూడు (1959) - లీల
  26. ఇల్లరికం (1959) - రాధ
  27. వచ్చిన కోడలు నచ్చింది (1959) - చంద్ర
  28. సిపాయి కూతురు (1959) - పన్నా
  29. అన్నపూర్ణ (1960) - అన్నపూర్ణ
  30. జల్సారాయుడు (1960) - లీల
  31. ధర్మమే జయం (1960) - కమల
  32. భక్త రఘునాథ్ (1960) - అన్నపూర్ణ
  33. రేణుకాదేవి మహాత్మ్యం (1960) - అతిథిపాత్ర
  34. అమూల్య కానుక (1961)
  35. ఉషాపరిణయం (1961) - ఉష
  36. కృష్ణ ప్రేమ (1961) - చంద్రావళి
  37. పెళ్ళి కాని పిల్లలు (1961) - రాధ
  38. అప్పగింతలు (1962) - లక్ష్మి
  39. ఖడ్గవీరుడు (1962) - రత్న
  40. గుండమ్మ కథ (1962) - సరోజ
  41. గులేబకావళి కథ (1962) - యుక్తమతి
  42. పదండి ముందుకు (1962) - సరళ
  43. పెళ్ళితాంబూలం (1962) - సీత
  44. మోహినీ రుక్మాంగద (1962) - మోహిని
  45. ఈడూ జోడూ (1963)- శాంతి
  46. తోబుట్టువులు (1963) - రజని
  47. మంచి రోజులు వస్తాయి (1963) - జానకి
  48. పూజాఫలం (1964) - వాసంతి
  49. బొబ్బిలి యుద్ధం (1964) - సుభద్ర
  50. మంచి మనిషి (1964) - సుశీల
  51. మురళీకృష్ణ (1964) - మురళి
  52. మూగ మనసులు (1964) - గౌరి
  53. రాముడు భీముడు (1964) - లీల
  54. కీలుబొమ్మలు (1965) - జానకి
  55. తోడూ నీడా (1965) - రాధ
  56. దేవత (1965) - అతిథి పాత్ర
  57. దొరికితే దొంగలు (1965) - మాధవి
  58. నాదీ ఆడజన్మే (1965) - మాలతి
  59. మంగమ్మ శపథం (1965) - మంగమ్మ
  60. సి.ఐ.డి. (1965) - వసంత
  61. అడుగు జాడలు (1966) - పార్వతి
  62. పల్నాటి యుద్ధం (1966) - మాంచాల
  63. లేత మనసులు (1966) - సత్యభామ
  64. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) - సుజాత
  65. శ్రీకృష్ణ తులాభారం (1966) - సత్యభామ
  66. సంగీత లక్ష్మి (1966) - రాధ
  67. ఉపాయంలో అపాయం (1967) - అతిథి నటి
  68. చదరంగం (1967) - సీత
  69. పూల రంగడు (1967) - వెంకటలక్ష్మి
  70. సతీ సుమతి (1967) - అతిథి నటి
  71. అమాయకుడు (1968) - రాణి
  72. ఉండమ్మా బొట్టు పెడతా (1968) - లక్ష్మి
  73. చల్లని నీడ (1968) - సుశీల
  74. చిన్నారి పాపలు (1968) - గరిక
  75. పాలమనసులు (1968) - ఇందిర
  76. పెళ్ళిరోజు (1968) - మాధవి, గౌరి (ద్విపాత్ర)
  77. బంగారు సంకెళ్ళు (1968) - తులసి, రోహిణి (ద్విపాత్ర)
  78. రాము (1968) - లక్ష్మి
  79. సతీ అరుంధతి (1968) - అరుంధతి
  80. ఏకవీర (1969) - మీనాక్షి
  81. బందిపోటు దొంగలు (1969) - ఇందిర
  82. ముహూర్త బలం (1969) - రాధ
  83. మూగ నోము (1969) - గౌరి
  84. ఆడజన్మ (1970) - దేవకి
  85. మరో ప్రపంచం (1970) - భరతమాత
  86. తాసిల్దారుగారి అమ్మాయి (1971) - మధుమతి
  87. పవిత్ర హృదయాలు - సుశీల
  88. బంగారుతల్లి (1971) - అన్నపూర్ణ
  89. మట్టిలో మాణిక్యం (1971) - లక్ష్మి
  90. మనసు మాంగల్యం (1971) - మంజుల
  91. రామాలయం (1971) - జానకి
  92. శ్రీకృష్ణ విజయం (1971) - సత్యభామ
  93. శ్రీమంతుడు (1971) - రాధ
  94. సతీ అనసూయ (1971) - అనసూయ
  95. అత్తను దిద్దిన కోడలు (1972) - వాసంతి
  96. కలెక్టర్ జానకి (1972) - జానకి
  97. పండంటి కాపురం (1972)- మాలినీదేవి
  98. మా ఇంటి కోడలు (1972) - సీత
  99. మేన కోడలు (1972)- సుశీల
  100. వింత దంపతులు (1972) - సుశీల
  101. సంపూర్ణ రామాయణం (1972) - కైకేయి
  102. ఇంటి దొంగలు (1973) - విజయ
  103. డబ్బుకు లోకం దాసోహం (1973) - అరుణ
  104. దేవుడు చేసిన మనుషులు (1973) - అతిథి పాత్ర
  105. ధనమా దైవమా (1973) - జానకి
  106. నిండు కుటుంబం (1973) - మోహిని
  107. పసి హృదయాలు (1973) - శారద
  108. బంగారు మనసులు (1973) - శోభ)
  109. మమత (1973) - జ్యోతి
  110. మేమూ మనుషులమే (1973) - కుప్పి
  111. స్నేహ బంధం (1973) -
  112. గౌరి (1974) - గౌరి
  113. దీక్ష (1974) - రాణి
  114. దీర్ఘ సుమంగళి (1974)
  115. పెద్దలు మారాలి (1974)
  116. భూమి కోసం (1974)
  117. మనుషులు మట్టి బొమ్మలు (1974) - సరస్వతి
  118. పరివర్తన (1975)
  119. భారతి (1975) - భారతి
  120. మొగుడా- పెళ్ళామా (1975) - ఉమ
  121. యశోదకృష్ణ (1975) - యశోద
  122. సంసారం (1975) - లలిత
  123. మంచి రోజు (1977)
  124. కురుక్షేత్రం (1977)
  125. కటకటాల రుద్రయ్య (1978)
  126. చిరంజీవి రాంబాబు (1978)
  127. సతీ సావిత్రి (1978)
  128. రాజపుత్ర రహస్యము (1978)
  129. శ్రీరామ పట్టాభిషేకం (1978)
  130. బంగారు కొడుకు (1982)
  131. జల్సారాయుడు (1983)
  132. రాజకీయ చదరంగం (1989)
  133. అన్నపూర్ణమ్మ గారి మనవడు (2021)

మరణం

[మార్చు]

89ఏళ్ల జమున వృద్యాప్త సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచింది.[2][3][4]

సూచికలు

[మార్చు]
  1. Sakshi (25 September 2021). "'సాక్షి' అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది: జమున". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.
  2. "Senior Actress Jamuna Passed Away At Her Home - Sakshi". web.archive.org. 2023-01-27. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. TV9 Telugu (27 January 2023). "సీనియర్ నటి జమున కన్నుమూత". Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Legendary actress Jamuna passes away, TFI pours condolences". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-01-27. Retrieved 2023-01-27.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జమున_(నటి)&oldid=4356257" నుండి వెలికితీశారు