Jump to content

శ్రీకృష్ణ విజయం

వికీపీడియా నుండి

'శ్రీకృష్ణ విజయం' కౌముది పిక్చర్స్ పతాకంపై మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన తెలుగు పౌరాణిక చిత్రం.సంక్రాంతి కానుకగా 1971 జనవరి 11 న విడుదల.పౌరాణిక బ్రహ్మ గా పేరుగాంచిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు నేతృత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు, సత్యభామ గా జూలూరి జమున నటించిన ఈ చిత్రంలో ఇంకా జయలలిత, ఎస్.వి.రంగారావు,కాంతారావు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.

శ్రీకృష్ణ విజయం
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎం.ఎస్. రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత,
జమున,
ఎస్.వి. రంగారావు,
కాంతారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కౌముదీ పిక్చర్స్ (తారకరామ పిక్చర్స్?)
భాష తెలుగు

పాత్రలు, పాత్రధారులు

[మార్చు]
  • శ్రీకృష్ణుడు - ఎన్.టి.రామారావు
  • సత్యభామ - జమున
  • వసుంధర - జయలలిత
  • నారదుడు - కాంతారావు
  • కుచేలుడు - మద్దాలి కృష్ణమూర్తి
  • పౌండ్రక వాసుదేవుడు - నాగభూషణం
  • సత్యకి_జి.రామకృష్ణ
  • పుండ్రక వాసుదేవ: నాగభూషణం
  • కుడిభుజం: పద్మనాభం
  • బలరామ_ మిక్కిలినేని
  • కైకాల సత్యనారాయణ
  • లార్డ్ శివ_రాజనాల
  • రుక్మిణి_ దేవిక
  • లక్షణ: సంధ్యారాణి
  • సరస్వతి: రమాప్రభ
  • మహోదర, కాలయవణ_ఎస్.వి.రంగారావు (ద్వి పాత్రాభినయం)
  • ముచికుంద: ధూళిపాళ
  • లార్డ్ బ్రహ్మా: ప్రభాకరరెడ్డి
  • వసంతక: అల్లు రామలింగయ్య
  • ఇంద్రుడు: త్యాగరాజు
  • రంభ: హేమమాలిని
  • చతురిక: ప్రసన్న రాణి
  • వామాక్షి: శ్రీరంజని జూనియర్
  • జాంబవతి: జయశ్రీ.

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

కధ, చిత్రానువాదo:మల్లెమాల

మాటలు:పింగళి నాగేంద్రరావు

నిర్మాత:మల్లెమాల సుందర రామిరెడ్డి

నిర్మాణ సంస్థ: కౌముది పిక్చర్స్

గీత, పద్య రచన:మల్లెమాల సుందర రామిరెడ్డి,సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, ముదివర్తి, కొండమాచార్య, పింగళి నాగేంద్రరావు

నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పులపాక సుశీల , జయలలిత

ఛాయా గ్రహణం: ఎల్లప్ప

కళ: గోఖలే

కూర్పు: బి.గోపాలరావు

నృత్యాలు: వేంపటి చిన సత్యం

సహకార దర్శకత్వం: వై.ఈశ్వరరెడ్డి

విడుదల:11:01:1971.

పాటలు

[మార్చు]
  1. అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు కృష్ణపరమాత్మ సేవకు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  2. అడిగితి నొక్కనాడు నేనడిగితి ఒక్కనాడు కమలాసను (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  3. అనరాదే బాలా కాదనరాదే బేల కొమ్ములు తిరిగిన - ఘంటసాల, జయలలిత - రచన: సినారె
  4. అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే (పద్యం) - ఘంటసాల
  5. అంకిత దీక్షఉగ్రతపమధ్భుతరీతి నొనర్చి శంభు (పద్యం) - మాధవపెద్ది_రచన: మల్లెమాల
  6. అఖిలలోకాధినాయక సమూహంబెల్ల నా ఆఙ్ఞ (పద్యం) - మాధవపెద్ది_రచన:మల్లెమాల
  7. ఓరీ యాదవా నీ ప్రగల్భములు మాయోపాయజాలములు (పద్యం) - మాధవపెద్ది_రచన:మల్లెమాల సుందర రామిరెడ్డి
  8. జయహే నవనీల మేఘశ్యామా వనమాలికాభిరామా - ఘంటసాల - రచన: దాశరథి
  9. జయతు జయతు దేవి దేవసంధావి (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల బృందం
  10. జోహారు శిఖిపించమౌళి ఇదే జోహారు రసరమ్య గుణశాలి వనమాలి - పి.సుశీల_రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి
  11. జేజేల తల్లికి జేజేలు మా గౌరమ్మ పెళ్ళికి బాజాలు - సుశీల బృందం
  12. పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
  13. పలువా ప్రేలకుమింక పండినది నీ పాపములు ఈనాడు (పద్యం) - మాధవపెద్ది_రచన: ముదివర్థి
  14. పనివడి నీవు కోరినటు భట్టులో పెను భట్టులో (పద్యం) - ఘంటసాల_రచన: ముదివర్తి కొండమాచార్య
  15. భళిరే మేల్ మేల్ మదిలోని భావమెల్ల హాయి హాయీ (పద్యం) - మాధవపెద్ది_రచన: మల్లెమాల
  16. నా జీవితము నీకంకితము నీవే నాకు ఆలంబనము - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి కృష్ణమాచార్య
  17. నీవైన చెప్పవే ఓ మురళీ ఇక నీవైన చెప్పవే ప్రయమురళీ - ఘంటసాల, సుశీల
  18. మరచినావేమో నీయన్న మమ్మెదిరించి (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల సుందరరామిరెడ్డి
  19. రత్నములవంటి అష్ట భార్యలకు తోడు సోయగము (పద్యం) - ఘంటసాల - రచన: ముదివర్తి కొండమాచార్య
  20. రమణీ ఓ రమణీ నా తప్పు మన్నింపరానిదేని రట్టు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లెమాల
  21. హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి - సుశీల_రచన:పింగళి నాగేంద్రరావు.

మూలాలు

[మార్చు]


  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.