మల్లెమాల సుందర రామిరెడ్డి
మల్లెమాల సుందర రామిరెడ్డి | |
---|---|
జననం | మల్లెమాల సుందర రామిరెడ్డి ఆగష్టు 15, 1924 |
మరణం | డిసెంబర్ 11, 2011 |
ఇతర పేర్లు | మల్లెమాల, ఎమ్.ఎస్.రెడ్డి |
వృత్తి | రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మల్లెమాల రామాయణం |
జీవిత భాగస్వామి | సౌభాగ్యమ్మ |
పిల్లలు | శ్యామ్ ప్రసాద్ రెడ్డి, భార్గవి, శారద |
మల్లెమాల (ఆగష్టు 15, 1924 - డిసెంబర్ 11, 2011) తెలుగు రచయిత, సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]1924, ఆగస్టు 15 న నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం అలిమిలి లో ఆయన జన్మించారు. మద్రాసులో మొదట ఫోటో స్టుడియో తో వీరి జీవితాన్ని ప్రారంభించారు. ఈయన చెన్నై లో సినిమా థియేటర్ నిర్మించిన తొలి తెలుగు సినీ నిర్మాత. నిర్మాతగా ఆయన తొలి చిత్రం భార్య. శ్రీకృష్ణ విజయం, కోడెనాగు, ఏకలవ్య, పల్నాటి సింహం, అమ్మోరు, ముత్యాల పల్లకి, అంజి, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, అరుంధతి లాంటి చిత్రాలు నిర్మాతగా ఎంఎస్ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మొత్తం బాలలతో తీసిన రామాయణం సినిమా జూనియర్ ఎన్టీఆర్ ను బాల నటుడిగా తెరమీదకు తీసుకుని వచ్చింది. అంకుశం చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి గా నటించాడు.
వీరు స్థాపించిన శబ్దాలయ థియేటర్స్ సినీ డబ్బింబ్, రికార్డింగ్ లో అత్యున్నత సాంకేతిక విలువలు కలిగినదిగా సినీ వర్గాలు చెబుతారు.
ఒక కవిగా రచించిన గొప్ప పద్యం ,
[మార్చు]రసపిపాస లేని రాలుగాయల మధ్య
చెప్పు కవిత యెంత గొప్పదయిన
కోళ్ల సంతలోన కోహినూరు వజ్రమే,
మహిత వినయ శీల మల్లెమాల.
మరణం
[మార్చు]హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన స్వగృహంలో 2011, డిసెంబర్ 11 న కన్నుమూశారు. ఆయన తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చిత్రనిర్మాత.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- కన్నెపిల్ల (1966)
- కొంటెపిల్ల (1967)
- కాలచక్రం (1967)
- హంతకుని హత్య (1967)
- కలసిన మనసులు (1968)
- భార్య (1968)
- శ్రీకృష్ణ విజయం (1971)
- కోడెనాగు (1974)
- ముత్యాల పల్లకి (1976)
- నాయుడుబావ (1978)
- రామబాణం (1979)
- తాతయ్య ప్రేమలీలలు (1980)
- ఏకలవ్య (1982)
- పల్నాటి సింహం (1985)
- తలంబ్రాలు (1986)
- అంకుశం (1989)
- ఆగ్రహం (1991)
- అమ్మోరు (1995)
- రామాయణం (1996)
- అంజి (2004)
- అరుంధతి (2009)
రచనలు
[మార్చు]వీరు రచించిన 'మల్లెమాల రామాయణం' ఒక విశిష్టమైన స్థాయిలో నిలిపింది.
వీరు రచించిన స్వీయచరిత్ర "ఇది నా కథ" ఎందరో సినీ ప్రముఖులని విమర్శించిన నిర్మొహమాటపు రచనగా పేర్కొనవచ్చును.[1]
సినిమా పాటలు
[మార్చు]- శ్రీకృష్ణ విజయం (1971)
- కోడెనాగు (1974) : సంగమం సంగమం అనురాగ సంగమం
- రామయ్య తండ్రి (1974) : మల్లి విరిసింది
- దొరలు దొంగలు (1976) : చెప్పాలనుకున్నాను, దొరలెవరో దొంగలెవరో తెలుసుకున్నాను
- ముత్యాల పల్లకి (1976) : సన్నజాజికి, గున్నమామికి పెళ్ళి కుదిరింది, తెల్లావారకముందే పల్లె లేచింది
- తాతయ్య ప్రేమలీలలు (1980) : వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం
- ఏకలవ్య (1982) : అన్ని పాటలు
- కళ్యాణ వీణ (1983) : వేగుచుక్క మొలిచింది
- తలంబ్రాలు (1986)
- చూపులు కలసిన శుభవేళ (1988) : చూపులు కలసిన శుభవేళ
- పుట్టింటి గౌరవం (1996)
అవార్డులు
[మార్చు]- 1998 : భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - రామాయణం.[2]
- 2005 : రఘుపతి వెంకయ్య పురస్కారం [3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-19. Retrieved 2011-12-13.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-09-28. Retrieved 2011-12-13.
- ↑ "Raghupathi Venkaiah award for M.S. Reddy". The Hindu. Chennai, India. 2007-02-18. Archived from the original on 2007-05-24. Retrieved 2007-04-16.
బయటి లింకులు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- All articles with dead external links
- రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగు సినిమా రచయితలు
- తెలుగు కవులు
- 1924 జననాలు
- 2011 మరణాలు
- తెలుగు కళాకారులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- నెల్లూరు జిల్లా సినిమా పాటల రచయితలు
- నెల్లూరు జిల్లా సినిమా నిర్మాతలు
- నెల్లూరు జిల్లా కవులు
- నెల్లూరు జిల్లా రచయితలు