ముత్యాల పల్లకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్యాల పల్లకి
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి.ప్రసాద్
తారాగణం నారయణరావు,చక్రపాణి,
జయసుధ
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

ముత్యాల పల్లకి 1977 మార్చి 5న విడుదలైన తెలుగు సినిమా. కౌముది పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకుడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సంక్షిప్త కథ

[మార్చు]

మురళి అనే అబ్బాయి తన కాలేజీలో చదువుతున్న లత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే మురళి పిరికివాడు. స్నేహితుడి వద్ద ప్రేమపాఠాలు నేర్చుకుని క్రమేణా లత మనసును చూరగొన్నాడు. వారిద్దరూ మేనమామ, మేనత్త బిడ్డలని తేలి ఇద్దరూ ఎంతో పొంగిపోయారు. మొదట కాదన్నా మురళీ తండ్రి చివరికి వారి పెళ్ళికి అంగీకరిస్తాడు. కాని విధివక్రీకరించి అనుకోని సందర్భంలో మురళి లత స్నేహితురాలు మాధవి తప్పు చేశారు. విషయం తెలిసి లత పెనుగాలి తాకిన పూలతీగలా అల్లలాడిపోయింది. తన స్నేహితురాలు మాధవి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. మాధవితో తన బావ మురళికి పెళ్ళి చేయడానికి పూనుకొంది. కానీ ఆ ప్రేమికుల మధ్య తాను ఆటంకం కాకూడదని మాధవి విషం తీసుకుని పెళ్ళిపీటల మీద మరణిస్తుంది. మురళికి, లతకు పెళ్ళి అయ్యింది. మాధవి త్యాగానికి గుర్తుగా వారికి పుట్టిన బిడ్డకు ఆమె పేరు పెట్టుకుంటారు. [2]

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట సంగీతం సాహిత్యం పాడినవారు
1 తెల్లావారకముందే.. పల్లె లేచిందీ.. తనవారినందరినీ.. తట్టీ లేపింది[3] సత్యం మల్లెమాల పి.సుశీల
2 సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ.. మాటా మంతి లేని వేణువు పాట పాడింది..[3] సత్యం మల్లెమాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3 శ్రీరస్తు శుభమస్తు సత్యం మల్లెమాల మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.జానకి
4 ప్రేమకు మేమే వారసులం ప్రేమే మాకు మూలధనం సత్యం మల్లెమాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Mutyala Pallaki (B.V. Prasad) 1977". ఇండియన్ సినిమా. Retrieved 3 September 2022.
  2. రెంటాల (13 March 1977). "చిత్రసమీక్ష : ముత్యాల పల్లకి" (PDF). ఆంధ్రప్రభ. Archived from the original (PDF) on 4 సెప్టెంబరు 2022. Retrieved 4 September 2022.
  3. 3.0 3.1 వెబ్ మాస్టర్. "Muthyala Pallaki (1977)". A To Z Telugu Lyrics. Retrieved 4 September 2022.

బయటిలింకులు

[మార్చు]